తెలంగాణలో పెను సంచలనం రేపిన నయిముద్దీన్ (నయీమ్) ఎన్ కౌంటర్ జరిగిన తర్వాత పోలీసులకు విస్తృతపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. నయీమ్ మరణించిన తర్వాత అతని ఇంట్లో సోధాలు ఏక కాలంలో నిర్వహించారు. ఈ సోదాల్లో కుప్పలు తెప్పలుగా డబ్బు మూటలు దొరకడం బినామాల దస్తాలు బంగారం, కార్లు, మోటర్ బైక్ లు ఇలా ఎన్నో లెక్కకు లేని సంపాద బయటకు వస్తుంది. సుమారు ఈ ఆస్తులు అన్నీ కలిపితే పది వేల కోట్లు ఉండవచ్చని ఇంకా కొంత ఎమౌంట్ బయటకు రావాల్సి ఉందని సమాచారం. అయితే పోలీసులకు నయీమ్ గురించి మరికొన్ని నిజాలు వెలుగులోకి వచ్చాయి. అతని ఇంట్లో సోదాలు నిర్వహిస్తుండగా మందుల చీటీలు, మెడికల్ రికార్డులతో బాటు ఒక ప్రాణాంతకమైన వ్యాధికి సంబంధించిన మందులు కూడా దొరికాయి. దీంతో అతను ఆ వ్యాధికి చికిత్స చేయించుకున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

నయీమ్ విశృంఖలమైన, విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి ఎప్పుడూ అమ్మాయిలతో గడిపేవాడని తెలుస్తుంది..అంతే కాదు కొంతమంది అమ్మాయిలను బలవంతంగా లైంగిక దాడులు కూడా నిర్వహించడం లొంగని వారిని చంపుతానని బెదిరించడం జరిగేదని బాధితుల సమాచారం. నయీమ్ కు ఇతర రాష్ట్రాలతో బాటు వేరే దేశాల్లో కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ కార్యకలాపాలతో సంబంధాలు వుండేవన్న కోణం నుంచి పోలీసులు ఆరా తీస్తున్నారుఇప్పటిదాకా ఎక్స్ టార్షన్, కిడ్నాపింగ్, కబ్జాల వంటి కార్యకలాపాలకు నయీమ్ పరిమితమయ్యాడని జరుగుతున్నాయనుకున్నారు కానీ అతని ఇంట్లో దొరికిన అమ్మాయిలను చూస్తుంటే..మహిళల్ని విక్రయించడమనే కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.

గతంలో గుజరాత్ లో హతమైన సోహ్రాబుద్దీన్ తో నయీమ్ కు సన్నిహిత సంబంధాలున్న విషయం తెలిసిందే. సోహ్రాబ్ కు ఐఎస్ఐ, లష్కరే సంస్థలతో అనుబంధం ఉండేది.  ఈ లేక్కన నయీమ్ కి ఇప్పుడు అంతర్జాతీయ తీవ్రవాద సంస్థలతో వున్న లింక్ లు కూడా వెలుగు చూశాయి. తీగ లాగితే డొంకలు కదులుతాయి అంటూ ఒక మాజీ సీనియర్ పోలీసు అధికారి టీవీల్లో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే..!


మరింత సమాచారం తెలుసుకోండి: