ప్రపంచం మొత్తం ఇప్పుడు ఉగ్రవాదలు దాడులతో సతమతమవుతుంది.  ఎక్కడ ఎప్పుడు ఏ బాంబు పేలుతుందో అని భయం భయంగా జీవితాలు గడుపుతున్నారు ప్రజలు. ముఖ్యంగా పర్యాటక దేశాల్లో వీరి ఆగడాలు మరీ మితిమీరుతున్నాయి.  తాజాగా వరుస బాంబు పేలుళ్లతో థాయ్‌లాండ్ మరోమారు దద్దరిల్లిపోయింది. రాజధాని బ్యాంకాక్‌కు దగ్గరలో హువాహిన్‌ పట్టణంలోని క్లాక్‌టవర్‌ వద్ద శుక్రవారం బాంబు పేలుడు సంభవించింది.రెండు బాంబులు 50 మీటర్ల దూరంలో పేలాయి.

నలుగురు మరణించగా దాదాపు 20 మందివరకు గాయపడినట్లు థాయ్ పోలీసులు తెలిపారు. థాయ్ రాణి సిరికిట్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం నాడు అక్కడ సెలవు ప్రకటించారు.వరుస సెలవులు రావడంతో హువాహిన్ రిసార్ట్‌కు పర్యాటకులు పెద్దమొత్తంలో విచ్చేశారు. మృతుల్లో కొందరు థాయ్ పౌరులు, మరికొందరు విదేశీయులు ఉన్నట్టు అధికా థాయ్‌లాండ్ రులు వెల్లడించారు.

క్షతగాత్రులకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. థాయ్ రాజు భూమిబాల్ (88), ఆయన భార్య సిరికిట్ ఇద్దరూ బ్యాంకాక్ ఆస్పత్రిలోనే ఉన్నారు. కాగా 24 గంటల వ్యవధిలో 8 చోట్ల పేలుళ్లు సంభవించడంతో ప్రజలు తీవ్రభయాందోళనకు గురయ్యారు. ఈ దాడికి ఎవరు పాల్పడ్డారన్న వివరాలు తెలియరాలేదని, దర్యాప్తు చేపడుతున్నామని అధికారులు తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: