తెలుగు రాష్ట్రాలు ఉమ్మడిగా ఉన్నపుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం అయనకు అత్యంత సన్నహితులైన కొణిజేటి రోశయ్య  ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కానీ ఆ సమయంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున రావడంతో ఆ పదవి నుంచి తప్పుకొని ఎన్. కిరణ్ కి అప్పజెప్పారు. తర్వాత రోశయ్య తమిళనాడు గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించారు.  ప్రస్తుతం తమిళనాడు గవర్నర్‌గా ఉన్న సీనియర్ రాజకీయ వేత్త కొణిజేటి రోశయ్య మనవడు అనిరుధ్ వివాహం హైదరాబాదులోని మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో బంధువుల రాకతో అంగరంగ వైభవంగా జరిగింది.
రోశయ్య మనువడి పెళ్లిలో వైఎస్.జగన్‌
బొమిడాల రామకృష్ణ, అనితల కుమార్తె లక్ష్మీ ప్రదీప్తితో అతడి వివాహానికి ప్రముఖులు రాజకీయవేత్తలు విచ్చేశారు. ఈ వేడుకలకు హాజరైన వారిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ - తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ - ఏపీ విపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి - నిజామాబాద్ ఎంపీ కవిత - కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా కేసీఆర్ ని ప్రత్యేకంగా కలిసిని రోశయ్య తెలంగాణలో  హరితహారం కార్యక్రమాన్ని ఒక ప్రజా ఉద్యమంగా కేసీఆర్ ప్రజల్లోకి తీసుకెళ్తున్న తీరు చాలా బాగుందంటూ మెచ్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చగా మార్చేందుకు కేసీఆర్ చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు. అంతేకాదు ఇటీవల కరీనంగర్లో పర్యటించిన రోశయ్య మొక్కలను కూడా నాటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: