ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఉగ్రవాదుల దాడుల్లో ఎంతో మంది అమాయకులు బలైపోతున్నారు. ఇప్పుడు అగ్ర దేశాలు సైతం ఉగ్రవాదుల దాడులకు బెంబెలెత్తి పోతున్నారు.  ఏ మూల నుంచి బాంబు దాడులు అవుతాయో తెలియదు..ఎక్కడ నుండి తుపాకుల కాల్పులు జరుపుతారో తెలియని పరిస్థితుల్లో జనాలు జీవనం కొనసాగిస్తున్నారు. తాజాగా అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. న్యూయార్క్‌లోని జాన్ఎఫ్ కెన్నడీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఓ టెర్మినల్‌లో కాల్పుల శబ్దం వినిపించడంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే విమానాశ్రయాన్ని మూసివేశారు.  
న్యూయార్క్ ఎయిర్ పోర్ట్ లో కాల్పుల కలకలం
విమానాశ్రయంలోని ఉద్యోగులు, ప్రయాణీకులు ఎవ్వర్నీ బయటకు పోనీకుండా తలుపులు మూసివేసినట్లుగా సాక్షులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అయితే ఈ విషయంలో ఇప్పటి వరకు ఎటువంటి అరెస్టులు జరగలేదని తెలుస్తోంది. కాగా, కాల్పుల విషయం సోషల్ మీడియాకెక్కడంతో వార్త వెలుగులోకి వచ్చింది.

టెర్మినల్ 8లో చాలామంది ప్రయాణికులు చిక్కుకుపోయినట్టు సోషల్ మీడియాలో పోస్టు అయిన ఫొటోలను బట్టి తెలుస్తోంది. మరోవైపు న్యూయార్క్ విమానాశ్రయం అధికారిక ట్విట్టర్ ఖాతాలో మాత్రం... వాతావరణ పరిస్థితుల కారణంగా కొన్ని విమానాలు ఆలస్యంగా బయల్దేరుతున్నట్లు ట్వీట్ చేసింది.ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: