ఆంధ్రా, తమిళనాడు జాలర్ల మధ్య వివాదం చిలి చిలికి గాలి వాన అయ్యింది. సాధారణంగా సముద్రాల్లో చేపల వేటకు వెళ్లే వారు తమ పరిధి దాటి లోనికి వెళ్లే సమయంలో అడ్డు పడటం సహజం అయితే ఈ గొడవలు సామాన్యంగా జరుగుతూనే ఉంటాయి..కానీ తాజాగా  నెల్లూరు జిల్లా రామతీర్థానికి చెందిన జాలర్లపై తమిళజాలర్లు దాడి చేశారు. అంతే కాదు  18 మందిని కిడ్నాప్ చేసి తమతోపాటు తీసుకెళ్లారు. దీంతో బాధిత కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. తమ వారిని క్షేమంగా విడిచిపెట్టే చర్యలు తీసుకోవాలని కోరాయి.

తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో చేపల వేటకు సముద్రానికి వెళ్లారు. అయితే అక్కడ తమిళనాడుకు చెందిన మత్స్యకారులు చేపలు వేటాడుతుండటాన్ని గమనించి వారితో గొడవకు దిగారు. అయితే తమిళ జాలర్లు ఎక్కవ మంది ఉండటంతో వారు సామరస్యంగా మాట్లాడకుండా గొడవకు దిగారు. దీందో ఇరు వర్గాల మద్య గొడవ తీవ్ర స్థాయిలో చెలరేగడంతో తమిళ జాలర్లు తెలుగువారిపై దాడి  చేసి  18 మంది మత్స్యకారులను అపహరించి తమిళనాడుకు తీసుకుపోయారు.  

విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో బాధిత కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. కాగా కిడ్నాపైన జాలర్ల ఆచూకీ ఇంతవరకు తెలియరాలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: