గ్యాంగస్టర్ నయీమ్ ఎన్ కౌంటర్ తర్వాత పెద్ద సినిమా స్టోరీనే నడుస్తుంది. ఇప్పటి వరుకు మన తెలుగు, హిందీ చిత్రాల్లో ఓ విలన్ చేసే పనులు ఎలా ఉన్నాయో అచ్చూ అలాంటి నిజాలే నయీమ్ విషయంలో బయట పడుతున్నాయి. ఇక ఎన్ కౌంటర్ చేసిన కొద్ది గంటల్లోనే నయీమ్ అనుచరులు అలర్ట్ అయ్యారని కొంతమందిని వెంటనే పట్టుకున్నామని పోలీసులు చెబుతున్నారు. అంతే కాదు ఏక కాలంలో నయీమ్ బంధువులు, స్నేహితులు ఇళ్లలో సోదాలు నిర్వహించగా కళ్లు బైర్లు కమ్మే నిజాలు, డబ్బు, నగలు, దస్తా వేజులు బయట పడుతున్నాయి. ఇక నయీమ్ బెడ్ రూమ్ లో సోదాలు నిర్వహించిన పోలీసులకు దిమ్మతిరిగే నిజాలు బయట పడ్డాయి. నయీమ్ ఇంట్లో మేకప్ కిట్లు, విగ్గులు, ఆడవారి దుస్తుల్లో ఉన్న నయీమ్ ఫోటోలు దొరికాయి. అయితే దీనికి వెనుక అసలు నిజాలు కస్టడీలో ఉన్నవారిని ఆరా తీయగా పోలీసులు విస్తృతపోయారు.

 ప్రాణాలు తృణప్రాయంలో తీయగల నయీమ్ ఆడవారి వేషం వేసి చాలా సున్నితంగా ఉన్నట్లు నాజూగ్గా ఉన్నట్లు కనిపించేవాడట.  ఇక సినిమాల్లో చూపించినట్లు బయట తిరిగే సమయంలో రక రకాల వేశాలు వేస్తూ ఎవ్వరికీ గుర్తుపట్టకుండా కనిపించేవాడట..ఈ నేపథ్యంలో చాలా సార్లు పంజాబీ డ్రెస్, చీరా జాకెట్టు వేసుకొని బాగా మేకప్ వేసుకొని అచ్చు అడవారిలా కనిపించేలా బయట తిరిగేవాడట. అంతే కాదు తన నీడను సైతం నమ్మని నయీమ్ సెటిల్ మెంట్ లు చేసే స‌మ‌యంలో ఆడ‌వేషం వేసే వాడ‌ని సిట్ విచార‌ణ లో తేలింది. తాను న‌యీం మ‌నిషిన‌ని సెటిల్ మెంట్ చేశేవాడ‌ట‌. ఇత‌రుల‌కు అప్ప‌గించేందుకు అవ‌కాశం లేని సెటిల్ మెంట్ ల విష‌యంలో చీర క‌ట్టే వాడు.  

అంతే కాదు  వాళ్ళ ఫ్యామిలీతో క‌లిసి చాలా సార్లు ఆడ‌వేశంలో షాపింగ్ లు, సిన‌మాల‌కు తిరిగే వాడ‌ని స‌మాచారం. తాను న‌యీంగా క‌న‌ప‌డ‌టం ఇష్టం లేనప్పుడు ఆడ‌వాళ్ళ వేషంలోకి మారేవాడ‌ట‌. త‌న చీర తానే క‌ట్టుకోవ‌టం, గొంతును కొద్దిగా ఆడ‌వాయిస్ లోకి మాట్లాడ‌టంలో నయీమ్ ఆరితేరిన వ్యక్తి అందుకే అతన్ని ఎవ్వరూ గుర్తుపట్టేవారు కారని సన్నిహితులు చెబుతున్నారు.  కొన్ని సార్లు ఆడ‌వేషంలో న‌యీం చాలా సార్లు ప‌బ్లిక్ కార్య‌క్ర‌మాల‌ను పాల్గొనేవాడ‌ట‌. ఒక్కో సమయంలో తనకు లొంగని వారిని అదే వేశంలో ఉండి మట్టు పెట్టేవారని సమాచారం. ఏది ఏమైనా తన చుట్టూ అమ్మాయిల సైన్యం పెట్టుకొని వారిలో మహిళగా కలిసిపోతూ ఎన్నో అరాచకాలు చేసిన నయీమ్ చిట్టా ఇప్పట్లో పూర్తి అయ్యేలా లేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: