అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలంటే ఎవ్వరికి మాత్రం ఆసక్తి ఉండదు. యావత్ ప్రపంచం సైతం ఎన్నికల్లో ఎవరు పై చేయి సాధిస్తారో అని ఉత్కంటగా ఎదురుచూస్తోంది. ప్రస్తుతం రెండు పార్టీల అభ్యర్థుల మధ్య పోరు హోరా హోరీగా నడుస్తోంది. ప్రస్తుతం అమెరికాలో అధికారంలో ఉన్న డెమక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ బరాక్ ఉస్సేన్ ఒబామా స్థానంలో పోటీకి దిగుతోంది. ఈమెకు గట్టి పోటీ దారుడిగా రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి ట్రంప్ బరిలోకి దిగుతున్నాడు. ఇంకా కొద్ది నెలల్లో ఎవరు అధ్యక్ష పదవికి అర్హులు అవుతారో తేలిపోతుంది. 



అసలు ఈ ఇద్దరిలో ఎవరికి గెలుపు వరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రశ్నించుకుంటే గెలుపు మాత్రం ఎక్కువగా హిల్లరీ కే ఉన్నాయని స్పష్టంగా చెప్పవచ్చు. ఈ స్పష్టతకు కారణాలు సైతం లేకపోలేదు. అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ఇద్దరు అభ్యర్థుల వ్యక్తిగత గుణగణాలను బేరీజు వేసుకుంటే ట్రంప్ కంటే హిల్లరీ ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. ఇటీవల చోటు చేసుకొన్న కొన్ని పరిణామాలను విశ్లేషించుకుంటే మనకు ఈ అంశంపై ఒక స్పష్టత వస్తుంది. ట్రంప్ ప్రచార సభల్లో ప్రసంగించిన కొన్ని వ్యాఖ్యలు దేశ ప్రతిష్టనే భంగపరిచేలా ఉన్నాయి. ప్రపంచ శాంతికి ఇతని మాట తీరు పూర్తిగా విరుద్ధం. 



వివిధ దేశాలను దూషించడం, వివిధ మతాల మధ్య చిచ్చు పెట్టడం, భారతీయులను ఇండియా కి రానివ్వనని బహిరంగా ప్రకటించడం, ముస్లీం లపై మండిపాటు, మహిళలపై అసభ్య ప్రవర్తన. ఇవన్నీ కలగలిపి ట్రంప్ ను శోక సంద్రంలో ముంచుతాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇటీవల కాలంలో ట్రంప్ తనని వ్యక్తిగతంగా దూషించాడని చాలా మంది చాలా సార్లు మీడియా ముందు తన గోడును వెల్లబోసుకున్నారు. వ్యక్తిగతంగా ట్రంప్ వ్యక్తిత్వం చాలా కఠినంగా ఉంటుందని, విప్లవ వాద గుణాలు అతనిలో ప్రస్పుటంగా కనబడుతున్నాయని ఇట్టే చెప్పేయవచ్చు. 



ఇవన్నీ చాలు అగ్రరాజ్యానికి అధ్యక్షడి గా ఎన్నికయ్యే అవకాశం ట్రంప్ కి ఎంత మాత్రం లేదని స్పష్టంగా చెప్పవచ్చు. ఇక డెమక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ గురించి మాట్లాడుకుంటే హిల్లరీ వ్యక్తిత్వానికి, ట్రంప్ వ్యక్తిత్వానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. హిల్లరీ క్లింటన్ మాజీ అమెరికా అధ్యక్షుడు బ్లిన్ క్లింటన్ భార్య అవ్వడంతో ఆమెకు రాజ్యాధికారానికి కావాల్సిన సర్వ లక్షణాలు అబ్బాయి. అణుకువ, తెలివి తేటలు, మెళకువలు ఇలన్నీ ఆమెలో స్పష్టంగా కనిపిస్తాయి. 



దేశం మీద, యావత్ ప్రపంచ దేశాల స్థితిగతుల మీద, ప్రజల పైన సమగ్ర అవగాహన ఆమే సొంతం. పైగా స్వయానా ప్రస్తుత అధ్యక్షుడు ఒబామా సైతం ఆమే అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఆమెకే అమెరికా అధ్యక్ష పదవిని కట్టబెట్టాలని ఇప్పటివరకు చాలా సార్లు పేర్కొన్నారు కూడా. ప్రస్తుత అధ్యక్షుడికి పదవిని కట్టబెట్టిన ప్రజలే మళ్లీ హిల్లరీకి పట్టాభిషేకం చేయడానికి అమెరికా ప్రజలే సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: