సిరియాలోని జరుగుతున్న విధ్వంసం ఇంతా అంతా కాదు. ప్ర‌భుత్వ తిరుగు బాటుదారులు చేస్తున్న పోరాటంలో ఎంతో మంది జీవితాలు రోడ్లమీద పడుతున్నాయి. అయితే గ‌తంలో సిరియా లో జ‌రుగుతున్న మార‌ణకాండ గురించి ప్ర‌పంచానికి కొంత వ‌రకే తేలిసేది కానీ గతేడాది చిన్నారి  ఆయిల‌న్ కుర్ధి స‌ముద్రంలో మునిగి చ‌నిపోయి ట‌ర్కి దేశంలో ని గాజా బీచ్ ఒడ్డుకు కొట్టుకు వ‌చ్చి సిరియాలో ఉన్న ద‌య‌నీయ ప‌రిస్థితుల‌ను ప్ర‌పంచ దేశాల‌కు తెలిసేలా చేశారు. అత‌ను చ‌నిపోయి కూడా ప్రపంచ దేశాల‌కు సదేశం ఇచ్చిపోయాడు. అప్ప‌ట్లో చిన్నారి ఆయిల‌న్ కుర్ధి శ‌వాన్ని చూసి చ‌ల్లించని వారంటూ ఉండ‌లేదు. దీంతో ప‌లు దేశాలు సిరియా పౌరుల‌ను ర‌క్షించేందుకు ముందుకు వ‌చ్చారు. సిరియా శ‌ర‌ణార్ధుల‌ను కాపాడేందుకు త‌మ దేశానికి రావోచ్చున‌ని  ప్ర‌క‌టించారు.

మ‌తం మ‌త్తుల్లో ఆధిప‌త్య పోరు....

మతం మత్తుల్లో, ఆధిపత్య పోరులో జోగుతున్న రాజ్యాలు, సంస్థలు ఇప్పటికీ చిన్న పెద్ద తేడా లేకుండా శత్రువినాశనానికే మొగ్గు చూపుతున్నాయి. ఆయుద్ధంలో పసి ప్రాణాలు సైతం గాల్లో కలిసిపోతున్నాయి. యుద్ధ నాదం మోగించిన అగ్రరాజ్యాల దెబ్బకు, సైనికుల బూట్ల చప్పుళ్లు, తూటాల మోతలకు భయపడి కూనరిల్లుతున్న చిన్న దేశాలు, ఆర్థిక సంక్షోభంతో కూరుకుపోయిన ప్రాంతాలు బతుకు జీవుడా అంటూ సముద్రాలు, వరదలు, వానలు, వాగులు, వంకలు దాటుకుంటూ ఎటుపడితే అటు వలస కడుతున్నాయి. గతేడాది అలాన్ కుర్ధి అనే సిరయా కు చెందిన మూడేళ్ల బాలుడు తమ కుటుంబీకులతో గ్రీకు దీపంలో గుండా బోర్డడ్రమ్ వైపు పడవలో ప్రయాణిస్తుండగా అది బోల్తా పడింది. దాంతో కుటుంబమంతా చిన్నాభిన్నామయ్యింది. కుర్ధి మృతదేహం టర్కీ నది తీరాల్లో కొట్టుకుపోవడం ప్రపంచమంతా చూసింది. 

ప్ర‌పంచంతో క‌న్నీరు పెట్టిస్తున్న బాలుడు... 

దిక్కుమొక్కులేక కొట్టుకుపోయిన ఈ చిన్నారి దేహాన్ని చూసిన వారి గుండెలు తరుక్కుపోయాయి.యుద్ధం, ఆర్థిక సంక్షోభాల పేరిట ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. అందులో ఇలాంటి చిన్నారులకు ఏలాంటి భాగస్వామ్యం లేకపోయినా ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే తాజాగా అలాంటి చిత్ర‌మే మ‌రోటి బ‌య‌ట‌ప‌డింది. సిరియాలోని ప్ర‌భుత్వ  తిరుగుబాటుదారులు అలెప్పో పై జ‌రిపిన వైమానిక దాడుల్లో గాయ‌ప‌డి షాక్ కు గురైన 5 ఏళ్ల బాలుడు ఒర్మాన్ డ‌ఖ్నీష్ ప్ర‌పంచంతో క‌న్నీరు    పెట్టిస్తున్నాడు. సోష‌ల్ మీడియా వైర‌ల్ గా అత‌డి చిత్రాన్ని చూసిన ప‌లువురు... సిరియా పౌరుల దుస్థితికి ఇది నిలువెత్తు నిదర్శ‌న‌మ‌ని పేర్కొంటున్నారు. అలెప్పో  పై జ‌రిగిన వైమానిక దాడుల్లో ఓ భ‌వ‌నం దెబ్బ‌తింది.  అందులో ఓ కుటుంబం చిక్కుకు పోయింది. స‌హాయ సిబ్బంది అప్ర‌మ‌త్త‌మై వారిని ర‌క్షించారు. ఆ త‌రువాత గంటకే ఆ భ‌వ‌నం కూలిపోయింది.

ర‌క్తంతో త‌డిసిపోయిన బాలుడు....

సహాయక సిబ్బంది రక్షించి, బయటకు తీసుకొచ్చిన వారిలో ముక్కుపచ్చలారని ఒర్మాన్ కూడా ఉన్నాడు. పూర్తిగా దుమ్ము కొట్టుకుపోయి రక్తంతో తడిసిపోయిన బాలుడిని చికిత్స కోసం అంబులెన్సులో తరలించారు. అయితే ఏం జరిగిందో అర్థం కాక బాలుడు నిర్ఘాంతపోయి చూస్తున్నాడు. వైమానిక దాడులపై అలెప్పో మీడియా సెంటర్ ఓ వీడియోను విడుదల చేసింది. అందులో కనిపించిన ఈ బాలుడిని చూసిన ప్రతి ఒక్కరి హృదయాలు ద్రవించి పోతున్నాయి. సహాయక సిబ్బంది రక్షించిన వారిలో 1, 6 సంవత్సరాలున్న ఒర్మాన్ సోదరులు, అతడి తల్లిదండ్రులు ఉన్నారు. అయితే వారికి పెద్దగా గాయాలు కాలేదు.

ఆ చిన్నారుల పోటోలు నెట్ లో ఉంచారు...

అయితే... సిరియాలో విమానదాడుల శిథిలాల కింద కూరుకుపోయిన ఓ చిన్నారి ఫొటోను సిరియా విపక్ష కార్యకర్తలు నెట్‌లో విడుదల చేశారు. ఒళ్లంతా దుమ్ముతో, ముఖం నిండా రక్తపు మరకలతో అంబులెన్స్‌లో కూర్చున్న ఐదేండ్ల ఒమ్రాన్ దఖనీశ్ నేటి సిరియా దుస్థితికి ప్రతిరూపంలా కనిపిస్తున్నాడు. అలెప్పో నగరంలోని ఖతేర్జీ బస్తీలో జరిగిన వైమానిక దాడుల్లో ఆ చిన్నారి తలకు గాయాలయ్యాయి. అయితే అదృష్టవశాత్తు మెదడుకు దెబ్బ తగల్లేదని, చికిత్స చేసి పంపామని వైద్యులు తెలిపారు. గురువారం ఉగ్రవాదుల స్థావరాలు లక్ష్యంగా జరిగిన ఆ దాడిలో ఎనిమిది మంది మరణించారు. అందులో ఐదుగురు చిన్నారులే. చిన్నారులకు సంబంధించిన ఫొటోలే కాకుండా వీడియోలు కూడా నెట్‌లో ఉంచారు.


మరింత సమాచారం తెలుసుకోండి: