గత కొంత కాలంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ప్రతి రోజూ ఏదో ఒక విషయంలో వివాదాస్పదాలు జరుగుతూనే ఉన్నాయి.  మొదట్లో ఆయన మాటలకు ఆకర్షితులైన అమెరికా పౌరులు రాను రాను ట్రంప్ కంపు నోటి దూల తో పూర్తిగా వ్యతిరేయం అయ్యారు. క్కడ చూసినా ప్రతికూల సంకేతాలు వెలువడుతుండటంతో ఆయన కూడా తీరు మార్చుకున్నట్లు కన్పిస్తోంది. దీంతో  ఈ మధ్య కాస్త మాటల జోరు తగ్గించినట్లు ఉన్నారు. మరో వైపు ఆయన  ప్రత్యర్ధులు మాత్రం ఆయన్ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు.

వాస్తవ విషయాలు తెలియకపోయినా..రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ విగ్రహం ఒకటి న్యూయార్క్‌ లో అందరినీ షాక్ కు గురిచేసింది. గుర్తుతెలియని వ్యక్తులు రాత్రికి రాత్రే ఏర్పాటు చేసిన ఈ ట్రంప్ నగ్న విగ్రహాన్ని చూసి జనాలు షాక్ అయ్యారు. ఇక చేతిలో స్మార్ట్ ఫోన్..ఎదురుగా ట్రంప్ విగ్రహం..ఇంకేముంది జనాలు ఎగబడి ఫోటోలు దిగారు..కొందరు విగ్రహం వద్ద సెల్ఫీలు దిగారు.  

బెల్లీ ఫ్యాట్, ఎల్లో హెయిర్‌తో కనిపిస్తున్న ఈ విగ్రహాన్ని చూసిన జనాలు పగలబడి నవ్వుకున్నారు. కాలిఫోర్నియాకు చెందిన ఓ కంపెనీ తన వెబ్‌సైట్‌లో ట్రంప్ విగ్రహ తయారీకి సంబంధించిన వీడియోను ఉంచింది. అయితే ఈ వ్యవహారంపై అధికారులు మాత్రం సీరియస్‌గా ఉన్నారు. న్యూయార్క్ నగరంలోని సిటీ స్క్వేర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని అధికారులు వెంటనే తొలగించారు.




మరింత సమాచారం తెలుసుకోండి: