పీవీ సింధు - ఒకప్పుడు ఆమె పేరు ఎవ్వరికీ పెద్దగా తెలీదు. కానీ ఆమె లెక్కే వేరు అన్నట్టు సాగుతోంది ప్రస్తుత కథ. ఒలంపిక్స్ లో రజత పతకం సాధించడంతో ఆమె జాతీయ స్థాయిలో మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ సెలెబ్రిటీ గా మారిపోయింది. ఆమె గెలిచిన మరుక్షణం భారతదేశం యావత్తూ హృదయపూర్వకంగా ప్రశంసలు కురిపించారు. మోడీ మొదలు కొని సచిన్ టెండూల్కర్ వరకూ అందరూ ఆమెకి వ్యక్తిగతంగా బహుమతులు ప్రకటించడం గమనార్హం. నగదు బహుమతుల లెక్కన సింధూ కి దాదాపు 12 కోట్ల రూపాయలు వరకూ అందాయి. తెలంగాణా - ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు పోటీ పది మరీ ఆమె కి బహుమతులు ప్రకటించాయి.



కేవలం ఆమెకి బహుమతి ప్రకటించడం కోసం రెండు ప్రభుత్వాలూ ప్రత్యేక క్యాబినెట్ భేటీ నిర్వహించాయి అంటే ఆమె సాధించిన మెడల్ తాలూకా క్రెడిట్ ని తమ మేడలో వేసుకోవడం కోసం రెండు ప్రభుత్వాలూ ఎంతగా పరితపిస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చు. నిన్నటికి నిన్న మంత్రి వర్గ సమావేశం పెట్టి మరీ సింధూ ని తమ రాష్ట్ర విజేతగా చూపించాలి అనే ఆలోచన , ఆవేశం తో భారీ నజరానాలు ప్రకటించాయి రెండు ప్రభుత్వాలూ .




తెలంగాణా ప్రభుత్వం కోటి రూపాయల నజరానా ప్రకటించినట్టు న్యూస్ వచ్చినా అది నిజం కాదు అంటూ కేటీఆర్ కొట్టి పడేసారు.తమ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని త్వరలో తీసుకుంటుంది అని ఆయన చెప్పిన కాసేపటికి చంద్రబాబు సర్కారు మూడు కోట్ల డబ్బు + అమరావతి లో స్థలం + గ్రూప్ 1 ఉద్యోగం ప్రకటించాయి. ఆ కాసేపటికి స్థలం + ఉద్యోగం తో పాటు ఐదు కోట్ల నగదు బహుమతిని తెలంగాణా ప్రభుత్వం ప్రకటించింది.  సింధూ గురువు గోపీ కి యాభై లక్షలు , కోటి రూపాయలూ ప్రకటించాయి రెండు ప్రభుత్వాలు.



సింధూ ఇప్పుడు ఒకే అనాలే గానీ రెండు రాష్ట్రాల్లో ఎక్కడైనా ప్రభుత్వ ఉద్యోగం చేసుకోవచ్చు. మొదట బాబు ప్రకటించిన నగదు + స్థలం + ఉద్యోగం ఇవన్నీ చూసి కెసిఆర్ కి కాక పుట్టినట్టు ఉంది దెబ్బకి ఆయన ఆంధ్రా ఖాతాలో ఆమె క్రెడిట్ ని  వేసుకోవడానికి ఎట్టి పరిస్థితి లో ఒప్పుకోను  అన్నట్టుగా ఐదు కోట్ల కాష్ ప్రకటించి షాక్ కి గురి చేసారు.గోపీ కి  ఆంధ్ర సర్కారు ఇచ్చిన యాభై  కంటే డబల్ అమౌంట్ ని ప్రకటించేసి క్రెడిట్ కోసం ప్రయత్నం చేసారు. తనని మించిన వాడు లేడు అనుకున్న చంద్రబాబుకి నిమిషాల వ్యవధి లో షాక్ ఇచ్చారు కెసిఆర్. కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బుతో పాటు కేంద్ర ఉద్యోగం ఇచ్చేలానే ఉంది సో ఉద్యోగం నిజంగా కావాలి అనుకుంటే అటువైపే మొగ్గు చూపుతుంది ఆమె. చూపాలి కూడా ఏమో ఎందుకంటే ఆమె  తెలంగాణా బిడ్డా ? ఆంధ్రా బిడ్డా ? అంటూ అర్ధం లేని ప్రశ్నలు లేవదీస్తున్నారు ఇక్కడ. సానియా మిర్జా స్థానం లో ఆమెని తెలంగాణా కి బ్రాండ్ అంబాసిడర్ ని చెయ్యాలి అనే వాదన కూడా నడుస్తోంది.



ఈ నేపధ్యం లో పోటా పోటీగా ఆమె క్రెడిట్ అంతా కొట్టెయ్యాలి అనే దురాశ తో రెండు ప్రభుత్వాలూ ఇస్తున్న నజరానాలు సింధూ రిజెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది  ? ఆమె చెయ్యకపోవచ్చు బట్ చేస్తే ? ఇది నిజంగా అందరి మనసులూ గెలుచుకునే విషయం ఆమెకి. క్రెడిట్ కోసం చేస్తున్నారు అని స్పష్టంగా తెలుస్తున్నప్పుడు రిజెక్ట్ చేసి ఆ డబ్బుని పైకి ఎదగడానికి ఎంతో కష్టపడుతున్న అథ్లెట్ లకి ఇవ్వమని ఆమె కోరితే మాత్రం తెలుగు జనాల మనస్సులో ఆమె ఎప్పటికీ సిల్వర్ ప్రిన్సెస్ గా కాక గోల్డ్ ప్రిన్సెస్ గా ఉండిపోతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: