తెలుగు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాటం సాగుతూనే ఉంది. విభజన సమయంలో ఏపికి ప్రత్యేక హోదా కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పగా దానికి అప్పట్లో ప్రతి పక్ష హోదాలో ఉన్న బీజేపీ మద్దతు పలికింది. ప్రస్తుతం బిజెపి అధికారంలో ఉండగా ఏపీ కి ప్రత్యేక హోదా ప్రసక్తి తీసుకురాకపోవడంపై ఇక్కడి ప్రజలు ఆందోళన చేపట్టారు. మరోవైపు కేంద్రం ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ కల్పిస్తామని చెబుతుందే కానీ ప్రత్యేక హోదా విషయం మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు. ఈ విషయంపై టీడీపి తప్ప అన్ని పార్టీలు ఒక్క తాటిపై నిలిచాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా జనసేన అధ్యక్షుడు, నటుడు అయిన పవన్ కళ్యాన్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది.

మొదటి నుంచి పవన్ కళ్యాన్ టీడీపి, బిజేపీలకు మద్దతు పలుకుతున్నాడే తప్ప ప్రజా క్షేమం గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని అలా చేస్తే మిత్ర బేధం వస్తుందనే భయం ఏర్పడిందని అలాంటపుడు ప్రశ్నించడానికి వస్తున్న అంటూ ప్రగల్భాలు పలకడం ఎందుకని ప్రశ్నించారు.  మీడియాతో మాట్లాడిన ఆమె.. ‘పవన్ కల్యాణ్ సినిమాల్లోనే గబ్బర్ సింగ్ కానీ.. రాజకీయాల్లో మాత్రం రబ్బర్ సింగ్ ’అంటూ వ్యాఖ్యానించారు.  అంతే కాదు ప్రత్యేక హోదాపై పవన్ కల్యాణ్ చేతులెత్తారని ఆమె విమర్శించారు.

హోదా కోసం పోరాటం చేస్తున్న వైసీపీ అధినేత జగన్‌‌కు మద్దతు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.  ఒకవేళ ప్రజా సంక్షేమం కోరే వ్యక్తి అయితే రాష్ట్రంలో అధికార పార్టీతో కలిసి ప్రత్యేక హోదా కోసం పోరాడాలని అన్నారు.  కానీ ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంతో గట్టిగా మాట్లాడకూడదని పవన్ కళ్యాణ్ చెప్పడాన్ని చూస్తే ఆయన ఓ రబ్బర్ సింగ్ అని అర్థమవుతుందన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: