గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్ కు పకడ్బందీ స్కెచ్ ముందుగానే గీసిన‌ట్టు తెలుస్తోంది! ఈ ఆప‌రేష‌న్ న‌యీం కు డీజీపీ అనురాగ్ శ‌ర్మ‌, ఎస్ ఐబీ డీఐజీ స‌జ్జ‌నార్ లు   కీలకంగా వ్యవహరించారు!   అయితే ఆపరేషన్ నయీం సక్సెస్ వెనుక సజ్జనార్ వేసిన ప్లానేంటి? ఉమ్మడి రాష్ట్రంలో ఏలిన ప్రభుత్వాల వల్ల కానిది.. కేసీఆర్ సర్కార్ వల్లే ఎలా సాధ్యమైంది? బలమైన సామాజిక వర్గంతో బలంగా అంటకాగిన నయీం కోట బద్దలు కావడానికి పోలీసులు ఎలా వ్యవహరించారు? నయీం ఎన్ కౌంటర్ కి సజ్జనార్ అమలు చేసిన పార్మాలా ఏంటీ?  ఇదీ తెలుగు ప్ర‌జ‌ల్లో మెదులుతున్న ప్ర‌శ్న‌లు. గ‌త ఇర‌వై ఏళ్లుగా మొండిధైర్యం, రాక్షసత్వం, క్రూరత్వం, బలమైన ఇన్ ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు నయీం. అయితే అవేవీ తన ప్రాణరక్షణకు అక్కరకు రావని ముందే గ్రహించాడు. వాటికి మించిన ఆయుధాన్ని తనకు రక్షణ కవచంగా మార్చుకున్నాడు.

రాష్ట్రంలో సామాజిక వ‌ర్గం న‌యీంకు సరెండ‌ర్ అయింది...

తెలంగాణలో బలమైన ఓ పటేల్ వర్గానికి అనుకూలంగా.. ఆ తర్వాత ఆ వర్గం తన కనుసన్నల్లో ఉండేలా చూసుకున్నాడు. ఆ ఒక్క వ్యూహాత్మక ఆలోచనే నయీం అరాచకాలు, దుర్మార్గాలు రెండు దశాబ్దాలకు పైగా సాగేలా చేశాయి. తెలంగాణలో ఓ బలమైన సామాజిక వర్గం నయీంకు సరెండర్ అయింది. సంఘంలో పెద్దమనుషులుగా చెలామణి అయిన వాళ్లు.. అధికార ప్రభుత్వంలో కీలక వ్యక్తులు నయీంకు ఉక్కు కవచాలయ్యారు. తమ పనులు చక్కబెట్టుకుంటూనే.. నయీంకు ఏ ఆపద రానీయకుండా కొరియర్లుగా మారారు. నిజం చెప్పాలంటే నయీంకు ఆ పటేల్ వర్గానికి క్విడ్ ప్రో కో (నీకేం కావాలి.. నాకేం ఇస్తావ్) జరిగింది. అందుకే ప్రభుత్వాలు మారినా.. పాలకులు మారినా నయీం చీకటి సామ్రాజ్యానికి ఇంచుమాత్రమైన బీటలు వారలేదు. పైగా అంతకంతకు తన నేరసామ్రాజ్యాన్ని దశదిశలా విస్తరించాడు నయీం. 

త‌న చెల్లి భర్త‌నే ఘోరంగా హ‌త‌మార్చాడు...


అదే టైమ్ లో ప్రజా ప్రతినిధులు, బ్యూరోక్రాట్లు నయీంను ప్రోత్సహిస్తూనే.. కోట్లకు పడగలెత్తారు. మన రాష్ట్రంలోనే కాదు.. పక్క రాష్ట్రాల్లోనూ లెక్కలేనన్ని ఆస్తులు కూడబెట్టారు. ఒక విష‌యం చెప్పాలంటే భూ దంధాలో పోలీసు బాసులే కాకుండా ప‌లు రాజకీయ నాయ‌కులు సైతం చేతులు క‌లిపారంటే నయీం నెట్ వ‌ర్క్ ఏ స్థాయిలో ఉందో చెప్ప‌గ‌లం. అంతే కాదు న‌యీం త‌న‌కు అడ్డం వ‌చ్చిన వారిని ఎవ్వ‌రిని వ‌ద‌లలేదు. ఒక నిమిషంలో చెప్పాలంటే త‌న చెల్లి భ‌ర్త ను ఘోరాతి ఘోరంగా హ‌త మార్చాడు. ఇందుకు బ‌ల‌మైన కార‌ణం ఏమీలేదు. కేవ‌లం నేను వెళ్లి పోతాను, నీతో ఉండ‌నని చెప్పినందుకే చంపేసాడంటే న‌యీం కృర‌త్వం ఎలాంటిదో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.  ఒకచేత్తో బలమైన సామాజిక వర్గం జుట్టు పట్టుకున్న నయీం.. మరో చేత్తో డిపార్ట్ మెంట్ ను వణికించాడు. తన దందాలో వేలు పెట్టకుండా.. అసలు దరిదాపుల్లోకి రానీయకుండా చూసుకున్నాడు. 

బీసీ సోద‌రులు సాంబ‌శివుడు, రాములను హత‌మార్చారు...

అందుకే యథేచ్ఛగా తన మార్క్ ఇజాన్ని మారుమూల పల్లెల్లోనే కాదు నగరం నడిబొడ్డున కూడా నడిపించాడు. అదే సమయంలో పటేల్ వర్గం.. బీసీ వాయిస్ వినిపించే నేతల్ని టార్గెట్ చేసింది. నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో అప్పుడప్పుడే బీసీలను చైతన్యవంతం చేస్తున్న వారిని ఏరిపారేయాలని నయీంను ఉసిగొల్పింది. అందులో భాగంగానే ఆ ఇద్దరు సోదరులు (కొనపురి సాంబశివుడు, రాములు) నయీం దొంగదెబ్బకు బలయ్యారు. అయితే తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువైనా.. నయీం పెచ్చు మీరిన అరాచకాలు ఏ మాత్రం తగ్గలేదు. పైగా ప్రజా ప్రతినిధులకే వార్నింగ్ లిచ్చాడు. ఇదే విషయమై ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ దగ్గర క్యూ కట్టారు. ప్రభుత్వం దృష్టికి ఎన్నో ఫిర్యాదు లొచ్చాయి. ఉపేక్షిస్తే లాభం లేదని గ్రహించిన సీఎం కేసీఆర్.. నయీం వ్యవహారాన్ని డీల్ చేయాల్సిందిగా డిజిపి అనురాగ్ శర్మను ఆదేశించారు. 

న‌మ్మ‌క‌మైన పోలీసు బాసే ఈ స్కెచ్ గీసారు...

డిపార్ట్ మెంట్ లో పటేల్ వర్గానికి పెద్దపీట వేసినా.. ఈ ఆపరేషన్ ను మాత్రం వారికి అప్పగించకుండా సీఎం వ్యూహాత్మకంగా వ్యవహరించారు. నమ్మకస్తుడు, ఏ పనైనా సమర్థంగా చేయగల అధికారి అయిన పోలీస్ బాస్ కు అప్పగించారు. ఈ ఆపరేషన్ ను సవాల్ గా స్వీకరించిన డీజీపీ.. మొత్తం బాధ్యతల్ని నిప్పులాంటి అధికారిగా పేరు తెచ్చుకున్న సజ్జనార్ కు అప్పగించారు. వరంగల్ యాసిడ్ దాడి ఘటనలో.. నిందితుల్ని ఎన్ కౌంటర్ చేసి తనేంటో నిరూపించుకున్న సజ్జనార్ .. ఈ ఆపరేషన్ ను మూడోకంటికి తెలియకుండా స్కెచ్ గీసారు. ఏ పటేల్ సామాజిక వర్గానికి మ్యాటర్ లీకయినా.. అంతే సంగతులని ముందే భావించారాయన. 

ఆప‌రేష‌న్ న‌యీం పూర్తి చేశారు...

అంతా తానై నడిపించారు. భూదందాలు, సెటిల్ మెంట్లతో అవినీతి ఆనకొండగా మారిన నయీంను.. అదే ఫార్మూలాతో కొట్టాడు. ఒక నిజాయితీ గల అధికారికి ఫుల్ ఆర్డర్స్ ఇస్తే.. ఆపరేషన్ ఎలా ఉంటుందో చూపించారు. ప్రభుత్వానికి మచ్చ రాకుండా, పోలీస్ బాస్ ఆదేశాలు పాటిస్తూ ఆపరేషన్ నయీంను సజ్జనార్ పూర్తి చేశారు. ఎన్ కౌంటర్ లో నయీం చాప్టర్ ను క్లోజ్ చేశారు. ఏ ప్రభుత్వం వల్ల కానిదీ.. కేవలం కేసీఆర్ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమైంది. ఈ ఆపరేషన్ ను కేవలం బలమైన సామాజిక వర్గానికి కాకుండా.. నీతి, నిజాయితీ గల అధికారులకు కేసీఆర్ అప్పగించడం వల్లే నయీం అధ్యాయానికి తెరపడింది.⁠⁠⁠⁠


మరింత సమాచారం తెలుసుకోండి: