ఎన్నో ఏళ్ళ నాటి సాధన, ఎంతో కృషి, ఉదయం నుంచీ రాత్రి వరకూ సాధన చేసి మళ్ళీ యాభై కిలోమీటర్ల మేర రోజూ ప్రయాణం చెయ్యడం.. ఇవన్నీ సింధూ పడిన కష్టాలు . ఆటమీద తనకి ఉన్న ప్రేమని సూచిస్తున్నాయి ఇవన్నీ. మొత్తానికి ఒలంపిక్స్ లో ఆమె భారత దేశం యావత్తూ పులకించేలా సిల్వర్ మెడల్ మేడలో వేసుకుని ఒచ్చింది. భారతదేశం గర్వపడేలా చేసిన పీవీ సింధూ కి ఘనంగా వెల్కం చెప్పింది హైదరాబాద్.



గచ్చిబౌలి స్టేడియం లో ఆమె కీ ఆమె కోచ్ కీ జరిగిన అద్భుత సన్మాన కార్యక్రమం లో చేదు అనుభవం కూడా ఎదురు అయ్యింది. ఇప్పుడు సిల్వర్ మెడల్ గెలిచింది కానీ ఈ సారి ఎలాగైనా గోల్డ్ గెలిచేలగా తాము మంచి కోచ్ లతో ట్రైనింగ్ ఇప్పిస్తాం అంటూ తెలంగాణా ఉప ముఖ్యమంత్రి మహమ్మూద్ అలీ అన్న మాటలు భారీ వివాదానికి దారి తీసాయి. సింధూ ని ఈ స్థాయి లో నిలబెట్టింది పుల్లెల గోపీచంద్ అని అందరికీ తెలిసిందే.



ఇంత గొప్ప ఆటగాడికి, కోచ్ కి ఆలీ అన్నమాటలు గట్టిగా తగిలే ఉంటాయి. ఫక్తు మూర్ఖత్వం తో ఎదో ప్రజా మీటింగ్ లో మాట్లాడినట్టు మాట్లాడేసారు ఆలీ గారు. ఆయన అన్న మాటలు ఎంత ఇబ్బందికరమైనవో కూడా ఆయనకు తెలీదు అదే మన ఖర్మ. అయితే ఇలాంటి వ్యవహారాల్లో డ్యామేజ్ కంట్రోల్ చెయ్యడం తెలిసిన కేటీఆర్ సింధూ కీ, గోపీ కీ స్వయంగా సారీ చెప్పినట్టు తెలుస్తోంది. సింధూ ని చిన్నతనం లోనే గుర్తించి ఆమె టాలెంట్ కి పదును పెడితే అద్భుతంగా రాణిస్తుంది అని ఎంతో అంచనా వేసిన గోపీ ఆమె స్థాయి ని ఇక్కడివరకూ తీసుకుని వచ్చారు.



గోపీ చంద్ కి దేశం మొత్తం జేజేలు కొడుతోంది. తన ఇంటిని అమ్మేసి మరీ ఒక బ్యాడ్మింటన్ అకాడమీ పెట్టిన గోపీ తనకి ఆట అంటే ఎంత ప్రాణమో చెబుతూ సైనా నెహ్వాల్ నీ సింధూ నీ తయారు చేసాడు. అలాంటి వ్యక్తిని బహిరంగంగా అవమాన పరుస్తూ " సింధూ కి సరైన కోచింగ్ లేకనే ఓడిపోయింది ఈ సారి మంచి కోచింగ్ ఇస్తాం " అంటూ పిచ్చి మాటలు మాట్లాడారు డిప్యూటీ ముఖ్యమంత్రి. దీంతో జనాలతో పాటు కేటీఆర్ కి కూడా చిర్రెత్తుకుని ఒచ్చింది. ఆమెకి ఒకపక్క ఘన సన్మానం సాగుతూ ఉంటే మీడియా కూడా ఆయన వ్యాఖ్యల మీద దృష్టి పెట్టేసింది. 




ఈ టైం లో తాము అంత కష్టపడి చేసిన హడావిడి కి ఆలీ తలనొప్పి కల్గించడం తో కేటీఆర్ కి పిచ్చ కోపం ఒచ్చిందట. స్వయంగా డ్యామేజ్ కంట్రోల్ చెయ్యడం కోసం సింధూ , గోపీ లకి స్వయంగా క్షమాపణ చెప్పారు అని తెలుస్తోంది. సింధూ ని తెలంగాణా బిడ్డ లాగా గోపీ ని పరాయి బిడ్డలగా మాట్లాడడం మంత్రిగారికే చెల్లింది. విదేశీ కోచ్ లని తెప్పించి మరీ శిక్షణ ఇప్పిస్తాం అని అనేసారు ఆయన. అవతలి వాళ్ళు నొచ్చుకోకుండా వ్యవహరించడం లలో కేటీఆర్ ముందు ఉంటారు అని అదే పార్టీలో అందరూ ఆయనలో మెచ్చుకునే నైజం అని చెబుతున్నారు. డిప్యూటీ సీఎం ఆలీ కి కూడా కేటీఆర్ పెద్ద క్లాస్ పీకారట .




పబ్లిక్ వేడుక జరుగతున్నప్పుడు సంబంధం లేని వ్యాఖ్యలు ఎందుకు చేస్తారు అని ఒకరకమైన వార్నింగ్ ఇచ్చారు అని తెలుస్తోంది. గోపీ చంద్ కూడా పెద్దగా ఈ వ్యాఖ్యలు పట్టించుకోలేదు గానీ సింధూ మాత్రం కాస్త బాధపడింది అంటున్నారు. తనని ఇంత స్థాయికి తెచ్చిన కోచ్ ని డిప్యూటీ సీఎం స్థానం లో ఉన్న ఒక వ్యక్తి అలా అందరిలో అవమానపరచడం ఆమెకి బాధ కలిగించింది. అయితే వెంటనే కేటీఆర్ క్షమాపణలు చెప్పడం ఉత్తమ విషయం. 



మరింత సమాచారం తెలుసుకోండి: