భారత దేశంలో మహిళలపై గత పది సంవత్సరాల నుంచి అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.  మగవారితో సమానంగా అన్ని రంగాల్లో మహిళలు దూసుకు వెళ్తున్నా కామాంధుల భారి నుంచి మాత్రం రక్షించుకోలేక పోతున్నారు. మరోవైపు నిర్భయ సంఘటన తర్వాత నిర్భయ చట్టం అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే..కానీ ఈ చట్టాన్ని తమ చుట్టంగా భావిస్తున్నారు కొంత మంది నీచులు, కామాంధులు.  ఆడది కనిపిస్తే చాలు చిత్త కార్తె కుక్కల్లా రెచ్చిపోతున్న కొంత మంది తగిన శాస్త దేవుడు చూస్తుండగా చట్టం ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటున్నారు.  ఏడేళ్ల క్రితం(2009) జరిగిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని జిగీషా ఘోష్ హత్య కేసులో ఇద్దరు నేరస్తులకు మరణశిక్ష విధించారు.

మూడో నేరస్తుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఢిల్లీ కోర్టు తీర్పును వెలువరించింది. ఢిల్లీలోని వసంత్‌ విహార్‌లో జిగీషను కొంద‌రు దుండ‌గులు 2009లో కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి హ‌త్య చేశారు. జిగీష త‌న‌ ఆఫీస్ క్యాబ్‌లోంచి త‌న ఇంటి వ‌ద్ద దిగిన వెంట‌నే దుండగులు ఆమెను కిడ్నాప్ చేసి, ఆమె వద్ద ఉన్న విలువైన సామాగ్రి దోచుకుని ఆ దారుణానికి పాల్ప‌డ్డారు.  కుంటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు స్వీకరించిన పోలీసుల దర్యాపు చేయగా , మూడు రోజుల తర్వాత హర్యానా సూరజ్‌కుండ్‌ ప్రాంతంలో ఆమె మృతదేహం ల‌భించింది.

ఈ కేసులో రవికపూర్‌, బల్‌జీత్‌, అమిత్‌ శుక్లాలను పోలీసులు అరెస్టు చేశారు. సుదీర్ఘంగా సాగిన ఈ కేసులో   'ఐటీ ఉద్యోగిని జిగిషా ఘోష్‌ను ఈ ముగ్గురు కొన్ని గంటలపాటు నిర్బంధించారు. తనను చంపవద్దంటూ ఆమె బతిమాలారు. డెబిట్ కార్డుతోసహా అన్నీ వారికి ఇచ్చేశారు. పిన్ నెంబర్ కూడా ఇచ్చారు. అయినా ముగ్గురూ సంతృప్తి చెందలేదు. అత్యంత రాక్షసత్వాన్ని వారు ప్రదర్శించారు. వీరిపై ఎలాంటి కనికరాన్ని కనబర్చాల్సిన అవసరమేలేదు' అంటూ న్యాయమూర్తి సందీప్ యాదవ్ తీర్పులో పేర్కొన్నారు.  అంతే కాకుండా మరణశిక్షతోపాటు రవికపూర్‌కు రూ. 1.2 లక్షలు, శుక్లాకు రూ. 2.8 లక్షలు, బల్జీత్ మాలిక్‌కు రూ. 5.8 లక్షల జరిమానా విధించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: