వెండికొండ‌, తెలుగుతేజం సింధూపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. తెలంగాణ‌, ఏపీ ప్ర‌భుత్వాలు పోటాపోటీగా సింధూకు న‌జ‌రానాలు ప్ర‌క‌టించ‌డంతో పాటు ఘ‌నంగా స‌న్మానిస్తున్నాయి. ఒక క్రీడాకారిణికి ఇలా గౌర‌వించ‌డంఒ బాగానే వుంది. కానీ ప్ర‌భుత్వాలు చేసే తీరులోనే లోపం ఉంద‌నే విమ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయి. సింధూలాంటి క్రీడాకారుల‌కు ఇస్తున్న స‌పోర్ట్ ఏదంటూ ప్ర‌భుత్వాల‌పై నెటిజ‌న్లు విరుచుకుప‌డుతున్నారు. 


సోష‌ల్ మీడియాలో ఎక్క‌డా చూసినా ఇప్పుడు సింధూ ఆర్టిక‌ల్స్‌తోనే నిండిపోతున్నాయి. మ‌న వెండికొండ‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తూ, ప్ర‌భుత్వాల తీరుపై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. పోటీప‌డుతూ సింధూకు భారీ న‌జ‌రానాలు ప్ర‌క‌టించ‌డాన్ని త‌ప్పుప‌డుతున్నారు. అమెరికా స్విమ్మర్ ఫెల్ఫ్ ఒలంపిక్స్ లో  మొత్తం 23 స్వర్ణ పతకాలు సాధించాడు. మనలా అయితే అమెరికా దేశాన్నే రాసివ్వాలి కాదా.. కానీ అమెరికా మాత్రం వారి క్రీడాకారుల కోసం భారీగా ఖ‌ర్చు చేస్తూ స్వ‌ర్ణ‌ప‌తకాల వీరుల్ని త‌యారు చేస్తున్నారు. అలాంటి ప‌రిస్థితి మ‌న ద‌గ్గ‌ర‌రావాల‌ని కోరుకుంటున్నారు. 


సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్ల అభిప్రాయాలు, చ‌ర్చ‌లు ఎలా జ‌రుగుతున్నాయో య‌థాత‌దంగా ఇక్క‌సారి గ‌మ‌నిస్తే... 
రియో ఒలంపిక్స్ లో వెండి పతకం సాధించిన సింధుని అభినందించాల్సిందే. కాని కోట్లకు కోట్లు, వేల గజాల స్ధలాలను ప్రభుత్వం వాళ్ళ కి ధారాదత్తం చేయటం సమంజసం కాదు. అవే కోట్లు పెట్టి ఎంతో మంది ఆర్ధిక స్ధోమత లేని క్రీడాకారులను ప్రభుత్వం  ప్రోత్సహించాలి . కాని ఇలా కోట్లు ఒక్కరికే కుమ్మరించటం మంచి సాంప్రదాయం కాదు. 
అమెరికా స్విమ్మర్ ఫెల్ఫ్ ఒలంపిక్స్ లో మొత్తం 23 స్వర్ణ పతకాలు సాధించాడు. మనలా అయితే అమెరికా దేశాన్నే రాసివ్వాలి కాని. అది అక్కడ సాదారణం. మీరు చేయవల్సిందీ , సింధుకి కోట్ల రూపాయలు, కోట్లరూపాయల విలువ చేసే స్థలాలు కాదండి( అది జనం కష్టార్జితం ).
సింధూ లాంటి అమ్మాయిలని ఎలా తయారు చేయాలి ???అందుకు మీ గవర్నమెంటులు ఏం చేయబోతున్నాయో, ఏ క్రీడావిధానం అమలుచేస్తారో ?? చెప్పండి !! 
స్కూల్లో పిల్లలు ఆటలు ఆడినందుకు పరీక్షల్లో మార్కులు కలపండి. ఆటస్థలం లేకపోతే,  వ్యాయామ‌ ఉపాధ్యాయుడు లేకుంటె స్కూల్ మూసేయించండి. టైం టేబుల్ లో ఒక్క పీరియడ్ అయినా సరే పిల్లలు ఆటలు ఆడాల్సిందే అని హుకుం జారీ చేయండి. ప్లేయింగ్ కిట్స్ అన్ని స్కూల్స్ కు ఉచితంగా ఇవ్వండి ( ఇవి ఇవ్వటానికి డబ్బు ఉండదేం ). ఒలంపిక్స్  గాదు ముందు లోకల్ టోర్నమెంట్సు , ఆడించండి.
లోకల్ టాలెంటెడ్ ' సింధ 'లు చాలా మంది ఉన్నారు. పాపం మీ దరిద్రగొట్టు విద్యావిధానాల వలన ఇంటా , బయట, స్కూల్లోనూ ప్రతి క్షణం , చదువు, చదువు, పరీక్షలు, మార్కులు, అని ఒకటే బెంగతో ఇటు తల్లితండ్రులు,అటు పిల్లలు తరగతి గదులలో, హోమ్ వర్క్ తో మగ్గి పోతున్నారు. వారంతా ఒక్కసారిగా మైదానంలో అడుగిడితే.. ప్రపంచంలో భారతీయులవే పత‌కాలు. 
సచిన్ ని మోసినంతకాలం మోసారు. ఏమైంది ? ఇప్పుడు ఎంతమంది సచిన్ లు రెడీగా ఉన్నారు ??? తెలంగాణలొని ప్రభుత్వ బాలికల పాఠశాలలో మూత్రశాలలు లేవు, కనీస సౌకర్యాలు లేవు. ఆర్ధిక స్ధోమత లేక ఎంతో మంది పిల్లలు బడికి రావటం లేదు. అటువంటి సమస్యల పైన నిధులు పెట్టండి హర్షనీయంగా ఉంటుంది.
అమ్మా ' సింధూ ' నీ విజయాన్ని తక్కువ చేయటానికి కాదమ్మా మేం‌ అంటున్నది. ఈ మాత్రం చలనం కలిగించావు అందుకు
నీకు జే జే లు!!!! ఎప్పటికప్పుడు ఎదవ డ్రామాలాడే కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల విద్యా, క్రీడా విధానాలపైనే ఈ ఆవేదన. 


సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న మ‌రొక విశ్లేష‌ణ చూస్తే... 
 'సింధు' ని చూసి ఏమి నేర్చుకోవాలి. సింధు సాధించిన వెండి పతకంతో భారతీయులందరు మురిసిపోయారనేది ముమ్మాటికీ నిజమే.. గెలిచినవాడి భుజం మీద చెయ్యి వేసి వీడు మా వాడే అని విర్రవీగి చెప్పే వెర్రి వెంగలప్ప ప్రభుత్వాలు ఈ ఘటన నుండి ఏమి నేర్చుకున్నాయి..?
అతి ఉత్సాహం ప్రదర్శించి ప్రజల సొమ్ముని ప్ర‌సాదం లా పంచే హక్కు యాడ ఉంది(అన్ని కోట్లా). అంత ఆనందం పట్టలేకుంటే, పార్టీ నిధుల్లో నుంచో మీ జేబు లోనుంచి ఇవ్వండి. సంతోషిస్తాం..
మీరు చేయవల్సిందీ, సింధుకి కోట్లు రూపాయలు, కోట్లరూపాయల విలువ చేసే స్థలాలు కాదండి ( అది జనం కష్టార్జితం ) సింధూ లాంటి అమ్మాయిలని ఎలా తాయారు చేయాలి, అందుకు మీ గవర్నమెంటులు ఏం చేయబోతున్నాయో.. ఏ క్రీడావిధానం అమలుచేస్తారు ?? చెప్పండి !!

https://www.youtube.com/watch?v=EXdThO_xU1U

జ‌నాభాలో నంబ‌ర్ 2, మ‌రి ప‌త‌కాలు విష‌యంలో ?
మ‌న దేశం జ‌నాభా విష‌యంలో ప్ర‌పంచంలోనే నంబ‌ర్ 2. మ‌రి క్రీడారంగంలో ఎక్క‌డున్నాం. మెడ‌ల్స్‌ల్లో చివ‌రి స్థానంలో ఉండ‌టం ఎవ‌రి త‌ప్పు? ప‌్ర‌భుత్వాల‌ది కాదా..? పోటీప‌డి కోట్లాది రూపాయ‌లు ప్ర‌క‌టించ‌డం కాదు. కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాల ప్ర‌భుత్వాలు సింధులాంటి వంద‌లాది మంది క్రీడాఆణిముత్యాల‌ను త‌యారు చేయాలి. అప్పుడే మ‌న‌దేశం కూడా స‌గ‌ర్వంగా టాప్ ప్లేస్‌లో నిల‌బ‌డుతుంది. విశ్వవేదిక‌ల‌పై మ‌న క్రీడాకారులు జాతీయ‌జెండాను రెప‌రెప‌లాడిస్తారు. స్వ‌ర్ణ‌కాంతుల‌ను మోసుకొస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: