కలుషిత ఆహారం తిని  63 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన కోయంబత్తూరు జిల్లాలో వెలుగు చూసింది. జిల్లాలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాల వసతి గృహంలో ఆహారం తిన్న 63 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురికావడంతో వారిని వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.  అయితే ఈ  వసతీ గృహంలో సుమయారు రెండు వందల మంది వరకు ఉన్నట్లు అయితే ఆదివారం రాత్రం  భోజనం చేసిన విద్యార్థినులు స్నేహ, ప్రియదర్శిని, దుర్గా, కవిత తదితర 26 మంది వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు.

తర్వాత రోజు మరో 37 మంది వరకు అదే విధంగా వాంతులు, విరేచనాలతో బాధపడటంతో వారిని కూడా వెంటనే ఆస్పత్రికి తరలించారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ విద్యార్థినులను ప్రభుత్వ వైద్యశాల డీన్‌ ఎడ్విన్‌ జో, సూపరింటెండెంట్‌ అశోకన్‌ తదితరులు పరామర్శించారు.

 విలేకరుల ప్రశ్నలకు బదులిస్తూ..విద్యార్థినులకు పెట్టిన ఆహారం, తాగునీటిని పరిశోధన నిమిత్తం ప్రయోగాశాలకు పంపామన్నారు. పరిశోధన తర్వాతే అసలు విషయాలు తెలుస్తాయన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: