సాధారణంగా మన పెద్ద వాళ్లు ఓ సామెత అంటుంటారు..అదృష్టవంతున్ని ఎవ్వరూ చెడగొట్టలేరు..దురదృష్టవంతున్ని ఎవ్వరూ బాగుపర్చలేరు.  కొంతమందికి అదృష్టం అనేది అనుకోకుండా బాగా కలిసి వస్తుంది...మరి కొంత మంది ఎంత కష్టపడ్డా ఎప్పుడూ పరిస్థితి మారదు. తాజాగా ఓ జాలరి రోజూ మాదిరిగానే చాపల వేటకు వెళ్లగా అతనికి   670 కోట్లు విలువ చేసే పెద్ద ముత్యం ఒకటి దొరికింది. అసలు విషయానికి వస్తే...ఫిలిప్పీన్స్ కు చెందిన ఒక మత్స్యకారుడు 2006లో పాలవాన్ ద్వీపంలో చేపల వేటకు వెళ్లారు. అయితే అక్కడ అతనికి ఓ రాయి అడ్డుగా రావడంతో దాన్ని పరీక్షగా చూశాడు..అయితే అది తెల్లగా వింత ఆకృతితో కనిపించింది. దాంతో ఆ రాయిని తన వెంట తీసుకొని వెళ్లాడు.

ఆరోజు ఆ రాయి గురించి కాసేపు చర్చించుకొని మంచం కింద పెట్టి మర్చిపోయాడు. అయితే ఓ రోజు ఆ మత్స్య కారుడి ఇంట్లో అగ్ని ప్రమాదం సంబవించింది..దీంతో అన్ని సామాన్లు బయట పడవేసే సందర్భంలో ఈ రాయి కంట పడింది..దాంతో ఆ రాయిని పక్కకు తీసుకొని దగ్గరలో ఉన్న టూరిజం వారికి అప్పజెప్పారు. అది చూసి ఆ అధికారులు ఆశ్చర్యపోయారు..ఇలా మెరిసిపోతున్న రాయి ఏంటా అని దాన్ని పరీక్షించి  ఫొటో తీసి.. దానిని సామాజిక మాధ్యమాల్లో అధికారులు పోస్ట్ చేశారు.

తర్వాత తెలసింది అది అందరూ అనుకుంటున్నట్లు రాయి కాదని అదో అద్భుతమైన ముత్యమని అది కూడా చాలా అరుదుగా కనిపించే ముత్యమని తేల్చారు.  విలువ అక్షరాలా 670 కోట్ల 44 లక్షల 45వేల రూపాయలు! ప్రస్తుతం రికార్డుల్లో ఉన్న అతిపెద్ద ముత్యం 1934నాటి ‘పెర్ల్‌ ఆఫ్‌ అల్లా’ బరువు 6.4 కిలోలు... ధర దాదాపు రూ.235 కోట్లు.  

ఇదిప్పుడు అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో ‘రిప్లీస్‌ బిలీవ్‌ ఇట్‌ ఆర్‌ నాట్‌’ ప్రదర్శనశాలలో ఉంది. దీంతోపాటు ముత్యాలకు ముత్తాతలాంటి తాజా ముత్యం కూడా ఫిలిప్పైన్స్‌లోని పలవన్‌ ద్వీపంలోనే దొరకడం మరీ విశేషం.ఈ అరుదైన ముత్యం గురించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు జెమాలజిస్ట్ ల వద్దకు దీనిని తీసుకువెళ్లనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: