తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలతో ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా రైతాంగం పట్ల ఆయన ఎన్నో పథకాలు అమలు పరుస్తున్నా. ఎప్పటి నుంచో తెలంగాణకు మహరాష్ట్ర కు మద్య ఉన్న నీటి సమస్యలపై పరిష్కారం కోసం మహా ఒప్పందం కుదుర్చుకొని ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ..తుమ్మిడి హట్టిపై 152 మీటర్ల ఇప్పందం జరిగిందని ఉత్తమ్ చెబుతున్నారు. ఆ పేపర్ తీసుకు వస్తే నేను ఖచ్చితంగా రాజీనామా చేస్తా అన్నారు కేసీఆర్. నిజంగా ఆ ఒప్పందాన్ని రుజువు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా.  

టీఆర్ఎస్ ఉద్యమం పుట్టిన తర్వాత ఎమ్మెల్యేలను రాజశేఖర్ ఆగం చేస్తావుంటే టీఆర్ఎస్ ని విచ్చిన్నం చేయాలని ఉద్యమాన్ని నీరు గార్చాలని చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి ప్రయత్నాలు చేస్తుంటే..మీరు పదవుల్లో ఉన్నారు..వారి పంచనపడి బతికిర్రు..అప్పుడు మీకు పౌరుషం రాలేదు. అనేక విషయాల మీద టీఆర్ఎస్ పోరాటం చేస్తుంటే..సమైక్యాంధ్ర సంకలో దూరి మమ్ములను తిప్పలు బెట్టిండ్రు..ఎన్నో సార్లు ఎగతాలి చేసిండ్రు. ఢిల్లీకి పోయి మాకు అభివృద్ది ముఖ్యం తెలంగాణ అన్నారు. గత సంవత్సరం నుంచి పోరాడి మహరాష్ట్ర ప్రభుత్వంతో నీటి ఒప్పందం చేసుకున్నం.

ఈ విషయంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తుండ్రు..మీరందరూ ఇక్కడకు వచ్చి సంతోషం పడుతుండ్రు.. వేలాది మంది నాకు స్వాగతం పలకడానికి వచ్చిండ్రు..ఇదే ఇండికేట్ చేస్తుంది రాష్ట్రంలో రైతులు ఎంత సంతోషంలో ఉన్నరో అన్న విషయం.  ఈ ప్రాజెక్టుల వల్ల పచ్చటి తెలంగాణ ఏర్పడుతుంది.  అందరూ సంతోషంగానే ఉన్నరు. మన రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ సన్నాసులకు మాత్రం నల్లజెండాలు కనిపిస్తున్నాయి. పచ్చి అబద్దాలు మాట్లాడటానికి కూడా ఒక అంతూ ఆధారం ఉండాలి. రాజకీయం మట్లాడినా దానికి తగ్గ పరిజ్ఞానం ఉండాలి.  2017 జూన్ లోగా భూ సేకరణ సమస్యకు పరిష్కారం. ముందు ముందు వ్యవసాయ రంగం చాలా బాగుంటుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: