తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌ను గ‌డ గ‌డ లాడించి, త‌న నియంత‌పు పోక‌డ‌ల‌తో,  ప్ర‌జ‌ల ర‌క్తంతో, వారి శ్ర‌మ‌దొపిడితో చీక‌టి సామ్రాజ్యాన్ని ఏర్ప‌ర‌చుకున్న క‌రుడుగ‌ట్టిన రౌడీ మూక, గ్యాంగ్ స్ట‌ర్ న‌యీం శ‌కానికి తెలంగాణ స‌ర్కార్ ముగింపు ప‌లికింది. ఈ నెల 8వ తేదీన మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా షాద్ న‌గ‌ర్ శివారు ప్రాంతంలో త‌న గెస్ట్ హౌస్ లో ఏ తుపాకుల‌తో త‌న నేర చరిత్ర కు బీజం వేశారో అదే తుపాకికి బ‌లి అయ్యాడు. అత‌డు చేసిన భూకబ్జాలు, సెటిల్ మెంట్లు, అడ్డొచ్చిన వారిని విచ్చ‌క్ష‌ణ ర‌హితంగా హ‌తం చేసిన తీరుతో యావ‌త్ భార‌త ప్ర‌జ‌లు భ‌య‌కంపితుల‌య్యారు. ఇలాంటి వాళ్లు భూమి ఇంకా బ్ర‌తికే ఉన్నారా? అన్న సందేహం క‌లిగేలా ఉన్నాయి న‌యీం అగ‌డాలు. అయితే తాజాగా నయీంతో రాజ‌కీయ నాయ‌కులతో స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయ‌ని తెలియ‌డంతో రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

న‌యీంతో అచ్చెన్నాయుడికి సంబంధాలు...

తాజాగా భువ‌న‌గిరి చెందిన ఓ వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, శాస‌న‌మండలి వైస్ చైర్మ‌న్ నేతి విద్యాసాగ‌ర్ పేరు రావ‌డంతో ఒక్కసారి రాజకీయంగా క‌ల‌క‌లం రేగింది. అయితే తాజాగా మ‌రో ఏపీ కి చెందిన మంత్రికి సైతం సంబంధాలు ఉన్నాయన్న వార్త‌లు గుప్పుమంటున్నాయి. గ్యాంగ్ స్ట‌ర్ న‌యీంకు ఏపీ లో అధికార టీడీపీ నాయ‌కుల‌కు సంబంధం ఉంద‌ని తీవ్ర ఆరోప‌ణలు రావ‌డంతో జిల్లా ప్ర‌జ‌లు ఒక్క‌సారి గా ఉలిక్కి ప‌డ్డారు. నయీం ముఠా అకృత్యాల‌పై ఫిర్యాదు చేసినా పోలీసు అధికారులు ప‌ట్టించుకోలేద‌న్న నిర్మాత న‌ట్టి కుమార్... త‌నకు అన్యాయం జ‌ర‌గ‌డానికి న‌యీం కు మంత్రి అచ్చెన్నాయుడికి సంబంధం ఉండ‌ట‌మే కార‌ణ‌మని మీడియా  ముందు ఆరోపించారు.

అచ్చెన్నాయుడి న‌ట్టికుమార్ ఆరోప‌ణ‌లు...

నిర్మాత న‌ట్టి కుమార్ రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు సినిమా హాళ్ల‌ను గ‌తంతో  లీజుకు తీసుకున్నారు. శ్రీకాకులం జిల్లాలో న‌ర‌స‌న్న‌పేట , క‌విటిలో వేంక‌టేశ్వ‌ర థియేట‌ర్ ను 12 ఏళ్ల పాటు లీజుకు తీసుకున్నారు. అయితే ఏడాది క్రితం ఈ లీజు సొమ్ము చెల్లింపు విష‌యంలో న‌ట్టికుమార్ థియేట‌ర్ యాజ‌మాన్యానికి వివాదాలు  త‌లెత్తాయి. ఈ వివాదంలో న‌యీం జోక్యం చేసుకున్నాడ‌ని నట్టి కుమార్ ఆరోపించారు. త‌న‌కు న‌ష్టం చేకూర్చేలా  ఉంద‌ని , న‌యీం గ్యాంగ్  జోక్యం అన్యాంగా ఉంద‌ని జిల్లా పోలీసు ఉన్న‌తాధికారుల‌కు ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోలేద‌న్నారు. అంతేకాదు జిల్లాలోని పోలీసు అధికారుల్లో ఎక్కువ మంది మంత్రి అచ్చెన్నాయుడికి బంధువులేన‌ని న‌ట్టి కుమారు తెలిపారు
 
ఏపీ పోలీసులు న‌యీంను ఎందుకు అరెస్ట్ చేయ‌లేదు....

ఇదీలా ఉంటే... గ్యాంగ్ స్ట‌ర్ న‌యీం ఈ మ‌ధ్య కాలంలోనే అచ్చెన్నాయుడు జిల్లా అయిన‌ శ్రీకాకుళం జిల్లా కు వ‌చ్చాడ‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. రెండు నెల‌ల క్రితం నయీం త‌న ముఠాతో క‌లిసి శ్రీకాకుళం న‌గ‌రంలోని ఓ హోట‌ల్ లో మ‌కాం వేశారు. ఈ విష‌యం తెలిసిన పోలీసులు అర్థ‌రాత్రి త‌నిఖీలు నిర్వ‌హించారు. నేరుగా  హోట‌ల్ కు వెళ్లిన పోలీసులు త‌నిఖీలు నిర్వ‌హించారో బ‌య‌ట‌కుఉ పొక్క‌నీయ‌లేదు. స‌హ‌జంగా నిర్వ‌హించే త‌నిఖీలే అన్న‌ట్లుగా బిల్డ‌ప్ ఇచ్చారు. ఒకవేళ ఇది నిజ‌మే అయితే ఆ హోట‌ల్ లోనే మ‌క్కాం వేసిన న‌యీం ను పోలీసులు ఎందుకు అరెస్టు చేయ‌లేదు? అన్న ప్ర‌శ్న ఉత్పన్న‌మౌతుంది. 

శ్రీకాకులంకు న‌యీం ఎందుకు వెళ్లాడు...

వాస్త‌వానికి గ్యాంగ్ స్ట‌ర్ న‌యీం అప్పుడ‌ప్పుడు అచ్చెన్నాయుడిని కలిసేందుకు వ‌చ్చేవాడ‌ని ప‌లువురు అభిప్రాయ ప‌డుతున్నారు. తాజాగా న‌ట్టికుమార్ చేసిన ఆరోప‌ణ‌న‌ల‌తో నిజ‌మేనన్న వాద‌న‌లూ ఉన్నాయి. శ్రీకాకుళంలో నయీంకు ఏం ప‌ని... ఇప్ప‌టి వ‌ర‌కు నయీం అన‌వ‌స‌రంగా ఎక్క‌డి వెళ్లే వాడు కాద‌ని పోలీసు విచార‌ణ‌లో బ‌య‌ట  ప‌డింది. అయితే మ‌రీ శ్రీకాకుళం వెళ్లాల్సిన అవ‌సరం నయీం కు ఎందుకు వ‌చ్చింది. ఇప్పుడు ఏపీ ప్ర‌జ‌ల ముందున్న ప్ర‌శ్న‌? అయితే  ఉమ్మ‌డి రాష్ట్ర తెలుగుదేశం ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న‌ప్పుడే నయీం ఆగ‌డాలు పెట్రేగి పోయాయ‌ని తాజాగా అధికార పార్టీ తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తోంది. గ‌తంలో 1998 ప్రాంతంలో బెల్లి ల‌లిత న‌ర‌మేధం సైతం టీడీపీ హ‌యాంలోనే జరిగింది!

నాటి హోంమంత్రికి కొన‌సాగింపేనా...?

అప్ప‌టి హోంమంత్రి, తెలంగాణ తెలుగుదేశం పార్టీ కీల‌క‌నేత‌గా ఉన్న ఎల్మినేటి మాద‌వ‌రెడ్డి  బెల్లి ల‌లిత చంపించార‌న్న ఆరోప‌ణ‌లు గట్టిగానే ఉన్నాయి. నాటి నుంచే టీడీపీ తో నయీం సంబంధాలు కొన‌సాగిస్తూనే ఉన్నార‌ని  స‌మాచారం! తాజాగా మాద‌వ‌రెడ్డి స‌తీమ‌ణి, భువ‌న‌గిరి మాజీ ఎమ్మెల్యే ఎల్మినేటి ఉమా మాధ‌వ‌రెడ్డి తో నిత్యం ఫోన్ లో సంభాషించేవాడ‌ని... అప్పుడ‌ప్పుడు మాధ‌వ‌రెడ్డి ఇంట్లోనే త‌ల‌దాచుకునే వాడ‌న్న ఆరోప‌ణ‌లు  ఉన్నాయి. ఈ క్ర‌మంలో తాజాగా ఆ పార్టీకి చెందిన ఏపీ మంత్రి అచ్చెన్నాయుడి తో సంబంధాలు ఉన్నాయ‌ని వార్త‌లు రావ‌డం నాటి కొన‌సాగింపేనా లేకా మ‌రేదై ఉందా? అన్న విష‌యం పై క్లారిటీ రావాల్సి ఉంది. మ‌రీ దీని పై సిట్ ఎలాంటి ముగింపు ప‌ల‌క‌నుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: