ఈ మద్య మహిళలపై కొంతమంది కామాంధులు రెచ్చిపోతున్నారు..ప్రతిరోజూ ఎక్కడో అక్కడ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఆ మద్య ఓ మెడికల్ కాలేజ్ స్టూడెంట్ ని కొంతమంది కామాంధులు పైశాచికంగా అత్యాచారం చేసిన ఆమెను చెప్పుకోరాని చోట్ల గాయపరిచి కదులుతున్న బస్సులోంచి నెట్టి వేశారు. ఈ ఘటనలో ఆ యువతి మూడు రోజులు నరకం అనుభవించి చనిపోయింది. దీంతో మహిళా లోకం ఉవ్వెత్తున లేచింది..మృతి చెందిన యువతికి న్యాయం చేయాలని నింధితులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేసింది. దీంతో అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ యువతి పేరుపై నిర్భయ చట్టాన్ని తీసుకు వచ్చింది. అంతే కాదు నింధితులకు ఉరిశిక్ష కూడా విధించింది.
ఆ దుర్మార్గుడు ఉరేసుకోబోయాడు
తాజాగా  నిర్భయ కేసులో నిందితుడైన వినయ్ శర్మ ఢిల్లీలోని తీహార్ జైలులో గురువారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.  న్యూఢిల్లీ శివార్లలో నడుస్తున్న బస్సులో 2012 డిసెంబరు నెలలో నిర్భయపై సహచరులతో కలిసి సామూహిక అత్యాచారం చేశాడు. అయితే ఈ  కేసులో వినయ్ శర్మకు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించిన సంగతి తెలిసిందే.  శిక్షపడిన ఐదుగురు వ్యక్తులు ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉండి తిహార్ జైలులో ఉండగా వారిలో వినయ్ శర్మ అనే వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
2012 Delhi gangrape convict Vinay Sharma attempts suicide in Tihar jail
తొలుత పెయిన్ కిల్లర్స్ తీసుకొని అనంతరం టవల్ తో ఉరిపెట్టుకున్నాడు. వెంటనే ఇది గమనించిన జైలు సిబ్బంది వెంటనే అతడిని తప్పించి ఢిల్లీలోని దీన్ దయాల్ ఉపాధ్యాయ్ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉంది. 2013 ప్రారంభంలో తనపై తిహార్ జైలులోని తోటి ఖైదీలు దాడి చేశారని తనకు అదనపు భద్రత కల్పించాలని వినయ్ శర్మ అప్పట్లో డిమాండ్ చేశాడు.అంతకుముందే 2013 మార్చి నెలలో బస్సు డ్రైవర్ రామ్‌సింగ్ అనే నిందితుడు జైలులోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: