ప్రస్తుతం మనిషి సాంకేతిక రంగంలో ఎంతో ముందడుగు వేస్తున్నాడు. శాస్త్రపరిశోధనలతో అంతరిక్షాన్ని కూడా శాసిస్తున్నాడు..ఎప్పటికప్పుడు ఎన్నో అత్యాధునిక పరికరాలు కనుగొంటూ తన సౌకర్యాన్ని మరింత మెరుగు పర్చుకుంటున్నాడు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే..రాను రాను మనిషిలోని మానవత్వం విలువలు మాత్రం పూర్తిగా మరిచిపోతున్నాడు. బంధాలు..బంధుత్వాలు అన్నది పూర్తిగా మర్చిపోతున్నాడనడంలో ఆశ్చర్యం లేదు. కవి అందెశ్రీ అన్నట్లు ‘మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు..మచ్చుకైనా కానరాడు మానవత్వం ఉన్నవాడు’ డబ్బు సంపాదన, సొసైటీలో పక్కవాడికన్నా తనే పై స్థాయిలో ఉండాలన్న యావతో మంచీ చెడూ అన్నీ మరిచిపోతున్నాడు.

తాజాగా మేఘారా అనే గ్రామంలో దనమాజీ(42), అమాంగ్ దేయి అనే గిరిజన దంపతులున్నారు. గత కొద్ది కాలంగా అమాంగ్ క్షయ వ్యాధితో బాధపడుతోంది.  కొంత కాలంగా ఆమెకు చికిత్స చేయిస్తూ వచ్చాడు దనమాజీ కానీ ఆమె చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి ప్రాణాలు విడిచింది. అయితే, ఆమె మృతదేహాన్ని తరలించేందుకు ఆస్పత్రిలో ఏ ఒక్కరూ అతనికి సహకరించలేదు. అయితే అక్కడ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 'మహాపారాయణ' అనే పథకం ప్రారంభించారు. దీని ప్రకారం ప్రభుత్వ ఆస్పత్రుల్లో చనిపోయినవారి మృతదేహాలను వారి స్వగ్రామాలకు ప్రభుత్వం తరుపున ఉచితంగా చేర్చడం ఈ పథకం ఉద్దేశం.

కానీ ప్రభుత్వం చేపట్టిన ఆ పథకాన్ని తుంగలో తొక్కారూ..అంతే కాదు ఆమె శవాన్ని ఎవరూ ముట్టుకోకపోవడంతో మనసు చెలించిన దనమాజీ తన భార్యను అక్కడ నుంచి తీసుకు వెళ్లాడానికి నిశ్చయించుకున్న చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఆమెను తన వెంట తెచ్చుకున్న బట్టతో మూటకట్టి భుజాన వేసుకొని బయలు దేరాడు. తల్లి చనిపోయి తండ్రి ఆ పరిస్థితిలో చూసిన దనమాజీ పన్నేండేళ్ల కూతురు కన్నీటికి అంతే లేకుండా పోయింది. అలా 10 కిలోమీటర్లు నడిచి వెళ్లాక ఈ విషయం మీడియా ద్వారా తెలుసుకొని మిగతా 50 కిలోమీటర్లకు కలెక్టర్ వాహనం ఏర్పాటుచేశారు. నిర్లక్ష్య పూరితంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: