తమిళనాడులో ఆర్థక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యాయత్నం చేసుకున్న  ఇళవరసన్‌ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే తమిళంలో   సిరుతయి, సగుని తదితర చిత్రాల్లో సహాయ నటుడిగా నటించిన ఇళవరసన్‌ వ్యక్తిగత, ఆర్థిక కారణాల వల్ల ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు అయితే ఇంట్లో వారు గమనించి అతన్ని ఆసుపత్రికి తరలించగా ప్రాణాపాయం తప్పింది.

ఇక ఇళవరసన్‌ గతంలో తనను ఆదుకోవాల్సిందిగా తనకు చాలా మంది నిర్మాతలు డబ్బులు ఇవ్వాల్సి ఉందని, ఆ డబ్బులు రాకపోవడంతో కుటుంబాన్ని పోషించడం కష్టంగా ఉందని   విశాల్‌ను ఉద్దేశించి ఇళవరసన్ సూసైడ్ నోట్ రాశారు.  ప్రస్తుతం  విశాల్ దక్షిణ భారత ఆర్టిస్టుల సంఘానికి ప్రధాన కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తున్నారు.  

ఈ విషయం తెలుసుకున్న తమిళ హీరో విశాల్‌ తన దేవీ సంక్షేమ సంఘం నుంచి కొంతమంది వ్యక్తులను ఇళవరసన్‌ దగ్గరకు పంపి ఆసుపత్రి ఖర్చులకు రూ. 10,000 అందించారని తెలుస్తోంది.  ఇళవరసన్ బార్య శశికళ, కుమారుడు శివలతో కలిసి చెన్నైలోని ఎంకెబి నగర్‌లో నివాసం ఉంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: