గ‌త కొద్ది కాలంగా ఇంటికే పరిమిత‌మైన జ‌న‌సేనాన్ని అభిమానుల కోసం మ‌రోసారి స‌భ ఏర్పాటు చేయ‌నున్నారు. ఈ రోజు సాయంత్రం తిరుప‌తి వేదికగా స‌భను ఫిక్స్ చేశారు. అయితే ఇంత‌కీ ఈ స‌మావేశం దేని కోసం?  ప‌వ‌న్ ఏ చెబుతారు?  ప‌వ‌న్ అభిమానుల‌కే ప‌రిమిత‌మౌతారా?  లేక  జ‌న‌సేన పార్టీ దిశ నిర్దేశం ఇవ్వనున్నారా? అన్న ఆశ‌క్తి నెలకొంది. ఇక‌పోతే ఈ విష‌యంలో ప‌వ‌న్ కే క్లారిటీ రాలేదు! అయితే తాజాగా త‌న అభిమాని వినోద్ రాయ‌ల్ హ‌త్య గురైన సంగ‌తి తెల‌సిందే. ఇందుకు కోసం ప‌వ‌న్ త‌న అభిమాని కుటుంబాన్ని ఓదార్చేందుకు వెళ్లారు. ఇంత‌లోనే ఈ స‌భ ఏర్పాటు కావ‌డం సంచ‌ల‌నం రేపుతోంది. ఈ స‌భ‌లో ప‌వ‌న్ ఏం చెప్ప‌బోతున్నారన్న  ఉత్కంఠ మొద‌లైంది. అభిమాని హ‌త్య విషయం అయితే కాద‌ని ప‌క్కాగా తెలుస్తోంది. 

ప్ర‌త్యేకహోదా పై ప‌వ‌న్ స్పందిస్తారా..?

ఎందుకంటే అభిమాని మ‌ర‌ణం పై ఇప్ప‌టికే త‌న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. కాపు రిజ‌ర్వేష‌న్, బీసీ రిజ‌ర్వేష‌న్ గురించి మాట్లాడే ప్ర‌సక్తి లేదు. ఇక మిగిలింది ప్ర‌త్యేక హోదా.   హోదా పై ప‌వ‌న్ మాట్లాడ‌తారా? ప్ర‌త్యేక హోదా పై ప‌వన్ క‌ళ్యాణ్ మాట్లాడే అవ‌కాశం ఉంది!  అయితే ఇందులో వివిధ రకాలుగా ప్ర‌సంగించే అవ‌కాశం లేక‌పోలేదు.  ప్ర‌త్యేక హోదా వ‌స్తే దానివ‌ల్ల క‌లిగే ప్ర‌త్య‌క్ష - ప‌రోక్ష ప్ర‌యోజ‌నాలు... భ‌విష్య‌త్ త‌రాల‌కు క‌లిగే ఉప‌యోగాల‌పై ప‌వ‌న్ మాట్లాడే అవ‌కాశం ఉంది. అయితే ఈ విష‌యం పై కేవ‌లం మాటాల‌కే పరిమైతే  ఈ స‌భ నీరుగారే ప్ర‌మాదం ఉంది. ఈ విష‌యంలో ప‌వ‌న్ త‌న మాట‌ను...హోదా పై త‌న అభిప్రాయాన్ని ఖ‌చ్చితంగా సూటిగా చెప్పాల్సి  ఉంటుంది. కేంద్ర ప్ర‌భుత్వంలోని బీజేపీ పై పోరాడే అవ‌కాశం ఉందా?  రాష్ట్ర అధికార టీడీపీ కి వార్నింగ్ ఇచ్చే అవ‌కాశం ఉందా? ఇద్ద‌రికీ రాం రాం చెప్పేసి సొంత పార్టీని హోదా పేరుతో బ‌ల‌ప‌చ‌డ‌మా?  లేక ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా కాంగ్రెస్ లే క వైకాపా ల‌తో క‌లిసి పోరాడ‌ట‌మా?  

టీడీపీ-బీజేపీ అధికారంలోకి రావ‌డానికి ప‌వ‌న్ పాత్రం కీల‌క‌మే..

విష‌యాల పై ఏదైనా సూటిగా చెప్పాల్సి ఉంటుంది. ఒక‌టి బాబుగారిని నొప్పిచండకుండా . రెండ‌వ‌ది బాబుకు, మోడీకి కూడా ఝ‌ల‌క్ ఇచ్చేలా ? ఈ రెండవ విధంగా మ‌ట్లాడేంత ధైర్యం ఇప్ప‌టికిప్పుడు ప‌వ‌న్ చేస్తారా అన్న‌ది గ‌ట్టి అనుమానం. ఇక‌పోతే... ప‌వ‌న్ మ‌ళ్లీ మ‌రోసారి ఎప్ప‌టి మాదిరిగానే జ‌నాల‌కు అర్ధ‌మ‌య్యీ, అర్థం కాన‌ట్లు, గోడమీద ఒంటికాలి చిటికెన వేలు ఆధారంగా నిల్చుని ఊగిస‌లాడుతున్న‌ట్లు, ముందుతిట్టి, ఆ త‌రువాత పొగ‌డి, ఇలా త‌నకు అల‌వాటైన స్పీచ్ నే మ‌ళ్లీ ఇస్తార‌నేదే అనుమానం కూడా ఉంది. ఎవ‌రు అవున‌న్నా... కాద‌న్నా... ఏపీలో టీడీపీ- బీజేపీల కూట‌మి అధికారంలోకి రావ‌డానికి ప‌వ‌న్ పాత్ర కీల‌క‌మైందే. అయితే అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచీ ప్ర‌భుత్వ ప‌నితీరును ప్ర‌శ్నించే స్థాయిలో కానీ స‌మ‌ర్థించే స్థాయిలో కానీ ప‌వ‌న్ సూటి గా మాట్లాడింది లేదు. 

ప్ర‌శ్నించేందుకే జ‌న‌సేన స్థాపించారు....

ఏపీ ప్ర‌భుత్వం పై ఎన్ని ర‌కాల విమ‌ర్శ‌లు వ‌స్తున్నా...ఖ‌చ్చితంగా స్పందిస్తార‌ని అంతా భావించిన ప‌వ‌న్ మాత్రం స్పందించిందిలేదు. ఒక‌టి రెండు విష‌యాల‌పై ట్విట్ట‌ర్ లో మాత్రమే స్పందించారు. అయితే ఈ ప‌రిస్థితుల్లో ఈ మైత్రి పై ప‌వ‌న్ ఖ‌చ్చితంగా మాట్లాడాల్సి వ‌స్తుంది. దానికి కార‌ణ‌మ‌య్యేది అంశం కూడా ప్ర‌త్యేక హోదానే కావ‌చ్చు. గ‌త పార్టీ ఏర్పాటు స‌మ‌యంలో ప్ర‌శ్నించ‌డానికే పార్టీ పెడుతున్న‌ట్లు ప‌వ‌న్ స్ప‌ష్టం చేశారు. అందుకే జ‌న‌సేన పార్టీ ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల  అనంత‌రం  ఏపీలో ప్ర‌భుత్వం ఏర్ప‌డిన‌ప్ప‌టి నుంచీ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించే అవ‌కాశాలు సందర్బాలు ఎన్ని వ‌చ్చినా... ఒక రాజ‌కీయ పార్టీగా జ‌నసేన త‌న ఉనికిని చాటుకోలేక‌పోయింద‌నే చెప్పొచ్చు. అయితే అధికారికంగా రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాంతంలో రైతుల నుంచి బ‌ల‌వంతంగా భూములు లాక్కుంటున్నార‌నే విష‌యంపై మాత్రమే ఈ జ‌న‌సేన పార్టీ స్పందించింది.
 
అభిమాని వినోద్ సంతాప స‌భేనా?

ప‌వ‌న్ తన సామాజిక వర్గానికి సంబంధించిన ఉద్య‌మాల స‌మ‌యంలో కూడా మౌనంగానే ఉంద‌న్న విమ‌ర్శ ఉంది. అయితే ఈ విమ‌ర్శ‌ల‌న్నింటికీ ఈ స‌భ ద్వారా జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు చాలా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇకపోతే.. క‌ర్ణాట‌క లో ఇటీవ‌ల హ‌త్య‌కు గురైన త‌న అభిమాని వినోద్ కు సంతాపం తెలిపే కార్య‌క్ర‌మం మాత్ర‌మే ఈ స‌భ‌లో జ‌రుగుతుందా లేక ఈ విష‌యాల‌పై ప‌వ‌న్ అభినంద‌నీయ‌మైన వ్యాఖ్య‌లు ఏమైనా మాట్లాడ‌తారా అనేది ఆస‌క్తిక‌ర‌మైన అంశం. ఎందుకంటే ఆయ‌న ఈ స‌భ అనుకోకుండా పెట్టాల్సి వచ్చింది. దీని కంటూ ప్ర‌త్యేక ఏజెండా అంటూ లేదు. కానీ అభిమాని వినోద్ మ‌ర‌ణానంత‌రం పెడుతున్నాడు కావునా...  అభిమానువెవ‌రూ గొడ‌వ‌లు ప‌డొద్దు అని మాత్ర‌మే చెబితే  పెద్ద‌గా ప్ర‌యోజ‌నం ఏమీ ఉండక‌పోవ‌చ్చు. అలాకాకుండా ఒక విలువైన, బ‌ల‌మైన సూచ‌న అంద‌రి హీరోల అభిమానుల‌కూ అర్ధ‌మ‌య్యేలా చెబితే బాగుంటుంది.

గ‌తంలో మాట్లాడిన తీరులోనే మాట్లాడితే....

గ‌తం లో మాట్లాడిన తీరుగానే ప‌వ‌న్ మ‌రోసారి మాట్లాడితే...  ఇప్ప‌టికే చాలా వ‌ర‌కు ప్ర‌జ‌ల్లో ప్ర‌సంగాల ప్ర‌భావం త‌గ్గిపోయింది, న‌మ్మ‌కం చాలా వ‌ర‌కు స‌డలిపోయింది. దీంతో పూర్తిగా ప‌డిపోతుంది. అధి ప‌వ‌న్ కు తెలియ‌కుండా ఉండ‌దు. ఆయ‌న నిజంగా 2019 ఎన్నిక‌ల‌కు వెళ్లాలనుకుంటే మాత్రం... తెగించి గోదాలో దిగ‌క త‌ప్ప‌దు. మీడియా తోనైనా... తెలుగు దేశం తోనైనా ఢీ కొన‌క త‌ప్ప‌దు. కానీ ప‌వ‌న్ ఈ ధైర్యం చేస్తారా?  చేయ‌రా అన్న‌దే అనుమానం. 
ధైర్యం చేస్తే... ప్ర‌జ‌ల్లో కొంతైనా ప‌వ‌న్ పై న‌మ్మ‌కం ఉంటుంది. లేదూ ఎప్ప‌టి మాదిరి  స్పీచ్ ఇచ్చేసి పోతే... మ‌రోసారి మ‌రింత ప‌లుచ‌న కావడం ఖాయం.


మరింత సమాచారం తెలుసుకోండి: