స్త్రీజన్మ సార్థకమయ్యేది తల్లి అయినపుడే. అప్పుడే ఆడజన్మలోని అమ్మతనం పురుడుపోసుకుంటుంది. పుట్టిన బిడ్డ పెరిగి ముద్దు ముద్దుగా అమ్మా అంటూ నోరారా పిలిచినపుడే ఆమె జీవితానికి ఓ అర్ధం, పరమార్ధం. సాక్షాత్తు దేవదేవుడైన శ్రీకృష్ణపరమాత్మ కూడా ఓ తల్లికి శిశువుగా జన్మించి ఆ  తల్లిని ఉద్దరించిన సంఘటన మనకు పురాణాలలో ఉంది. అలాంటిది. నవమాసాలు మోసి, కని, ఆపై దిక్కులేని పక్షుల్లా ఇద్దరు చిన్నారులను అనాథలు చేసి వేళ్లిందో తల్లి. 
ఇంతటి అమానుషమైన సంఘటన దేశరాజధాని ఢిల్లీలో వెలుగు చూసింది. సమయ్ పూర్ బాద్లీ ప్రాంతంలో రోజీ,బబ్లూ కుటుంబం జీవించేది. వారికి 8సంత్సరాల అల్కా, 3 సంవత్సరాల జ్యోతితో పాటు ఓ కొడుకు ఉన్నారు.

తాగుడుకు బానిసైన బబ్లూ.. నిత్యం భార్యను వేధిస్తుండటంతో ఆమె రెండు నెలల క్రితం కొడుకును తీసుకుని ఇల్లొదిలిపెట్టి వెళ్లిపోయింది. దీంతో తండ్రి ఉన్నా.. అల్కా, జ్యోతి అనాథలయ్యారు. అప్పుడప్పుడూ ఇంటికొచ్చే బబ్లూ.. ఆగస్టు 15 నుండి కనిపించకుండా పోయాడు. దీంతో గదిలోనే ఉండిపోయిన ఇద్దరు చిన్నారులు ఆహారం లేక నీరసించిపోయారు. నీళ్లు లేక మలమూత్రాలను శుభ్రం చేసుకోకపోవడంతో.. ఒళ్లంతా ఇన్ ఫెక్షన్ సోకి చిన్నారులిద్దరూ దీనావస్థకు చేరుకున్నారు. గది నుంచి దుర్వాసన రావడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 


స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు, గది తలుపులు బద్ధలు కొట్టి చావుకు చేరువైన చిన్నారులను రక్షించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పిల్లలిద్దరూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. స్థానికులిచ్చిన సమాచారంతో తల్లి రోజీ ఆచూకీ తెలుసుకున్న పోలీసులు.. ఆమె సమాధానం విని అవాక్కయ్యారు. 'నన్ను నేను పోషించుకోవడానికే ఇబ్బందులు పడుతున్నాను.. ఆడ పిల్లలను ఎలా పెంచాలి?' "వాళ్లు నాకువద్దే వద్దు" అని చెప్పడంతో పోలీసులు షాక్ కు గురయ్యారు. కడుపున పుట్టిన వారిని కన్నవారే వద్దని వదిలేయడంతో.. వారి భాద్యత తీసుకునేందుకు ఢిల్లీ మహిళా కమిషన్ కు ముందుకొచ్చింది. పిల్లలిద్దరినీ రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించనుంది. 

Image result for indian poor girls

అమ్మ తమని ఎందుకు వదిలివెళ్లిందో అర్థంకాక, నాన్న తిరిగి వస్తాడో రాడో తెలియక ఆ చిన్నారులు సతమతమవుతున్నారు. బిడ్డ ఏడిస్తే ఏ తల్లైనా తట్టుకోలేదే.. అలాంటిది ఆ బిడ్డలు అందులోనూ ఆడ పిల్లలు.. చావుకు చేరువైనా ఆమె హృదయం ఎందుకు కరగలేదు. ఎందుకంత పాషాణంగా మారింది? వదిలిపెట్టి వెళ్లడానికి ఆ తల్లికి మనసెలా ఒప్పింది. రోజీ ప్రవర్తన అమ్మతనానికే మచ్చతెచ్చిందని సమయ్ పూర్ బాద్లీ వాసులు మండిపడుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: