లైవ్ అప్ డేట్స్  :


ప్రత్యేక హోదా కోసం మునుముందు చేసే కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం ఉండాలి 


అశోక్ గజపతి రాజు ఆత్మ గౌరవంతో రాజీనామా చేయలేరా..?


వెంకయ్యగారు, జైట్లీ గారూ అరిగిపోయిన రికార్డులు వినిపించకండి.


మోడీ అంటే ఎంపీలకు ఎందుకంత భయం..ఆయన కూడా మనిషే కదా..? తప్పు చేసిన వారే సీబీఐ కి భయపడతారు..


కేంద్రం వద్ద అప్పట్లో మేడం మేడం అంటూ మోకరిల్లారు..? ఇప్పుడు సార్ సార్ అంటూ..?


వెంకయ్య మాటలు వింటుంటే చిరాకు వేస్తుంది.. కాంగ్రెస్ నేతలకు సిగ్గులేదా..? 


తెలుగు ప్రజల మద్య జైరాం రమేష్ గారు పెట్టిన చిచ్చు అంతా ఇంత కాదు ఆయనకు థ్యాంక్స్..


అడుగు ముందుకేస్తే తల తెగినా కాలు వెనక్కి పడదు.. కాకినాడలో మొదటి మీటింగ్ పెడతా.ప్రత్యేక హోదా మా హక్కు, ఇచ్చి తారాలి


మూడో రోజు ప్రజలతో కలిసి పోరాటం చేస్తాం.. ప్లీజ్ ప్లీజ్ అంటే కేంద్రం పట్టించుకోదు. రాష్ట్రానికి హోదా ఇవ్వకపోతే రాష్ట్రం ముందుకు ఎలా తీసుకువెళ్తారు. 


రెండో దశలో టీడీపీ, వైసీపీ, బీజేపీ ఎంపీలపై పోరాటం చేస్తాం


నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సస్పెండ్ అయి ఇంట్లో కూర్చోవాలి


ఇంత కాలం చేత కాక కాదు.. పౌరుషం లేక ఇన్ని రోజులూ సైలెంట్ గా ఉన్నా..రాష్ట్రానికి జరిగిన అన్యాయం అన్ని జిల్లాల్లో మాట్లాడుతాను.


ఇప్పటి వరకు ఆలోచించి నిర్ణయం తీసుకున్నా..ఈ రోజు నుంచి ఇక ప్రశ్నిస్తూ ఉంటాను


ప్రత్యేకో హోదా కోసం మూడు దశల్లో పోరాడుతా.. అన్ని జిల్లాలు తిరిగి ప్రజల హోదాపై వివరిస్తా
గోమాత పేరిట రాజకీయాలు చేయవొద్దు..మంచిది కాదు


గో సంరక్షణ పైనే మాట్లాడుతూ ముఖ్యమైన సమస్యలను పట్టించుకోవడం లేదు.అయితే ప్రతి బీజేపీ కార్యకర్త ఒక ఆవును పెంచుకోండి చాలు


అంకెల గారడీ మాకు అక్కర్లేదు..హోదా ఇవ్వండి చాలు.




రాష్ట్రం కోసం సొంత పార్టీని కూడా ఎదిరించండి. ప్రత్యేక హోదా ఏపి ప్రజల హక్కు


పద్మ పదే ఆత్మవంఛన చేసుకోవాల్సిన అవసరం లేదు. పార్లమెంట్ లో వెంకయ్య మాటలు చూస్తే బాధేస్తుంది..?


టీడీపీని విమర్శిస్తున్నాను అనుకోవద్దు..సూచనలు అనుకోండి.సీఎం చంద్రబాబు చెప్పిన మాటలను అర్ధం చేసుకోగలను.


రాష్ట్రంలోకి కొత్త పరిశ్రమలు ఎలా వస్తాయి..?వ్యక్తిగతంగా ప్రధానితో మాట్లాడడం నాకు ఇష్టం లేదు.


ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రాష్ట్రాన్ని ముందుకు ఎలా తీసుకువెళ్తాం.


స్పెషల్ స్టేటస్ గురించి నేను మాట్లాడతాను.. సీమాంధ్రులు అంటే పౌరుషం లేని వారా..? జాతీయ పార్టీలు ఎందుకు చులకనగా చూస్తున్నారు..సీమాంద్రుల పౌరుషం త్వరలో చూపిస్తాం. 


బీజేపీ పార్టీలోకి రమ్మని బీజేపీ నేతలు ఆహ్వానించారు.  జనసేన ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ దృక్ఫథం ఉంది. దేశ శ్రేయస్సు కోసమే బీజేపీ మద్దతు ఇచ్చారు. 


దేశ సంపద అంటే ఖనిజాలు కాదు, యువతే దేశ సంపద


రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టి, ప్రత్యేక హోదా ఇస్తానని అన్నారు..కానీ ఇప్పటి వరకు ఇవ్వని కేంద్రంపై కొన్ని అడిగి తేల్చుకుంటాను.


ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని రాజకీయాల్లోకి వచ్చాను


టీడీపీ, బిజేపీకి భుజం కాశాను..దాని వల్ల టీడీపీ అధికారంలోకి వచ్చిందని అనను


వినోద్ హత్య నాకు చాలా బాధ కలిగించింది..బిడ్డ అవయవదానం చేసిన తల్లికి నా పాదాభివందనం


దయచేసి సినిమాను ఒక వినోదంగా చూడండి..దాన్ని సీరియస్ గా తీసుకోవద్దు


నేను రైతు పక్షపాతిని, ఆడబిడ్డల పక్షపాతిని.. ఏ ఒక్క పార్టీకో ఏ ఒక్క వ్యక్తికో పక్షపాతి కాదు. 



ఎవ్వరినీ ఇరకాటంలో పెట్టే విమర్శలు చేసేందుకు నేను ఇష్టపడను


చాలా మంది నన్ను భజన సేన అంటారు. మోదికి భజన సేన అంటారు. అవును  నాది భజనసేన కానీ మోది కాదు ప్రజల భజన సేన చేస్తాను. 


స్పేషల్ స్టేటస్ ఇస్తామని చెప్పి తాత్సారం చేస్తున్నారు.


కొంతమంది నన్ను తెలుగు దేశం తొత్తు అని అన్నారు..కొంత మంది నన్ను గబ్బర్ సింగ్ కాదు..రబ్బర్ సింగ్ అన్నారు. అంటారు..మనం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అన్నీ పడాలి కదా.


ఎన్నికల ముందు తిరుపతి సభలోనే హోదా పై హామీ ఇచ్చారు.. మీ సమస్యల కోసం నేను పోరాడుతా..అంతా ప్రశాంతంగా ఉండండి..


నేను ఏ మాట్లాడినా ఆలోచించి మాట్లాడుతాను


నాకు సినిమాలపై వ్యామోహం లేదు.. సమాజం మీద, దేశం మీద వ్యామోహం ఉంది


సినిమాల్లో డైలాగులు చెబుతాం..రాజకీయాలు నాకు అవసరం లేదు. 


వర్తమాన రాజకీయ నాయకులు యువతకు మేలు చేయకపోవడం బాధ కలుగుతోంది


నోటి నుంచి వచ్చిన మాట వెనక్కి తీసుకోలేం.. అందుకే ఇప్పటి వరకు మౌనంగా ఉన్నాను. 



తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ గా ఎంతో పేరు అభిమానం సంపాదించిన తర్వాత సార్వత్రిక ఎన్నికల ముందు జనసేన అనే పార్టీ స్థాపించి ప్రజలకు మరింత చేరువ అయ్యారు పవన్ కళ్యాన్. ప్రశ్నించడానికి వస్తున్నా అంటూ పార్టీ ఆవిష్కరణలో ఆయన ప్రసంగించిన తీరు చూస్తుంటే ఒక్కొక్కరి హృదయాలు ఆవేశంతో నిండిపోయాయి.  పార్టీ స్థాపించినా గెలుస్తానన్న నమ్మకం ఉన్నా ఆయన మాత్రం ఎన్నికల్లో నిలబడలేదు..కాంగ్రెస్ కో హటావో..దేశ్ కో బచావో అనే నినాదంతో బీజేపీ, టీడీపీలకు మద్దతు పలికి వాటి విజయానికి పరోక్షంగా సహాయ పడ్డారు. ఇలా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన పవన్ కళ్యాన్ పవనీజంతో యువత మేల్కోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: