పవన్ కళ్యాణ్ నేటి ఉపన్యాసములో నందమూరి తారక రామారావు గారి లాగా తెలుగు వారి ఆత్మగౌరవ నినాదాన్ని తట్టిలేపిన ప్రయత్నం కనిపించింది. నిర్మాణాత్మకమైన మార్పు కనిపించింది. తిక్క పవన్ లో కూడా ఒక లెక్క ఉందన్న భావన బలపడింది.

 Image result for chandrababu moDi Pawan

ఆయన ఉపన్యాసాన్ని బట్టి - ఆయన కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుల గురించి, భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులైన వెంకయ్య నాయుడు లాంటివారి గురించి చెప్పిన విషయాలు జాతికి తెలియనివి కావు. వారి "నీకాల్మొక్కుత, నీ బాంచన్ దొర అనే తత్వమూ" మన జనవాహినికి తెలియంది కాదు. అయితే ఒక చలనచిత్ర మాస్ కథానాయకుడుగా ఉన్న విషయాలతోనే రెండుసంవత్సరాల మాహాసహనం తరవాత షడన్-గా తిరుపతి లో ప్రజలను ఉత్తేజపరచటం మనం గమనిద్ధాం.

Image result for chandrababu moDi Pawan 

చంద్రబాబు కొంతకాలం ప్రత్యేక హోదా ఒక్కటే అన్నీ సమస్యలను పరిష్కరించలేదు అంటూ - ఆ సమస్యను అటకెక్కించిన తీరు జాతికి తెలుసు. బిజెపి ని టార్గెట్ చేస్తూనే పవన్ మాట్లాడినా - మరో కల్ప్రిట్ టిడిపి ని శవంలోని బెతాళుణ్ణి విక్రమార్కుడు భుజాలపై మోసినట్లు మోయటానికి  ప్రయత్నించారు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ బిజెపి-టిడిపి లను గెలిపించి జాతికి ద్రోహం చేశారు.

Image result for chandrababu moDi Pawan

తాను ఏ ప్రాతిపదిక పై వారిని ఎన్నికల్లో గెలిపించాలో అదే ప్రాతిపదికపై ఆయన ముందుకు వచ్చి బహిరంగ సభలో మాట్లాడటానికి రెండున్నరేళ్ళు పట్టింది. ఇంత సమయం తను తీసుకోవటంలో దాగున్న కారణం లేదా న్యాయం  ఏమిటి. ఆయనకు మోడీ తో పనిచేయించ లేరా? ఇంతవరకు మోడీని వ్యక్రిగతంగా ప్రశ్నించక పోవటమేమిటి? చంద్రబాబులోని ప్రత్యేక హోదాపై ఉన్న అలసత్వం ప్రశ్నార్హం కాదా?

 Image result for pavan kalyan aimimg arrow on Modi

ఈ శాసనసభా కాలములో 50% సమయం దాదాపు అయిపొవచ్చిన తరవాత నిద్రలేచి వచ్చిన ఆయన స్థితప్రజ్ఞత కూడా ప్రశ్నార్ధకమే.  ఆయన బలంగా మాట్లాడారు.  ఓ.కే. ఆయన కనీసం ఈ నాటికైనా మాట్లాడారు ఇకమనం ఆయన్ను రోజూ ప్రశ్నించి ఉత్తేజ పరచి ఆ బాణాన్ని మోదీ పైకి సందించవచ్చు.

 Image result for pavan kalyan aimimg arrow on Modi

ఒకటే నా అనుమానం పవన్ కల్యాణ్ కు అంత స్థిర మైన చిత్తముందా? అదే నిజమైతే  “తిక్క పవన్ కు కూడా ఒక లెక్క ఉందను”  కుందాం.  సమయమే సరైన సమాధానం చెప్పవచ్చు.  నిరీక్షిద్ధాం పవన్ స్పందించినంత ఆలస్యంగా కాదు.

Image result for pavan kalyan aimimg arrow on Modi

మరింత సమాచారం తెలుసుకోండి: