జ‌న‌సేన పార్టీ ఏర్పాటు చేసినా నాటి నుంచి ఆ పార్టీ నేత  ఆ పార్టీ ఆదినేత‌ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రోసారి త‌న సినీమా డైలాగ్ లతో రెచ్చిపోయారు. పార్టీ ఏర్పాటు చేసిన నాటి ప్ర‌సంగానికి,  తాజాగా నేడు తిరుప‌తి ప్ర‌సంగంలో కొంత వ‌ర‌కు మార్పు ను చూశాం కానీ... ఆయ‌న ఇంకా కూడా ఏదో తెలియని క‌న్ప్యూజ‌న్ లో మాత్రం ఉన్నారు. ప‌వ‌న్ ప్ర‌త్యేక హోదా పై గ‌ట్టిగానే స్పందించినా... ఆయ‌న ఎవ‌రిని టార్గెట్ చేశార‌న్న‌ది అర్ధం కానీ ప‌రిస్థితి... ఇందుకు ఓ కార‌ణం మీముందుచుతాను. ఆయ‌న మాటాల్లోనే చూస్తే... ప్ర‌త్యేక హోదా పై ఆంధ్ర ఎంపీలు ఎందుకు స్పందించ‌డం లేదు. కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ సీపీ , బీజేపీ, టీడీపీ ఎంపీ లు ఎందుకు మాట్లాడ‌టం లేద‌న్నారు. అయితే వాస్త‌వానికి గ‌త పార్ల‌మెంట్ వ‌ర్ష‌కాలం సెష‌న్ లో కేవ‌లం టీడీపీ త‌ప్ప ... అన్ని పార్టీల ఎంపీలు స్పందించాయి. వైకాపా నేత‌లు స‌భ‌ను బైకాట్ చేశారు. కాంగ్రెస్ ఎంపీలు ప్ర‌త్యేక హోదా కోసం ప్రైవేట్ బిల్లు ప్ర‌తిపాదించారు. చ‌ర్చకు ప‌ట్టుబ‌ట్టారు.

సీమాంధ్ర ఎంపీల పై ఫైర్...

కానీ ఇక్క‌డ కేవ‌లం టీడీపీ ఎంపీలే ప్ర‌త్యేక హోదా పై వెన‌క్కు త‌గ్గారు. అయితే ప‌వ‌న్ చేస్తే టీడీపీ ఎంపీ ల పైనే విమ‌ర్శ‌లు చేయాలి కానీ అన్ని పార్టీల‌ను ఎందుకు టార్గెట్ చేశారో అర్ధం కాలేదు. ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ ఆయ‌న విమ‌ర్శ‌లు ఉంటే బీజేపీ పైనే చేయాలి.  కానీ ప్ర‌త్యేకించి కాంగ్రెస్ నేత సోనియాగాంధీ పై విమ‌ర్శలు గుప్పించ‌డం కూడా అవ‌స‌రంలేని ప్ర‌సంగం. గ‌తంలో కాంగ్రెస్ ఉమ్మ‌డి రాష్ట్రాన్ని విభ‌జించింది. అది గ‌తం కానీ... ఇప్పుడు ప్ర‌త్యేక హోదాను ఇవ్వాల‌న్నా... వ‌ద్ద‌నుకున్నా కేవలం బీజేపీ చేతిలోనే ఉంది. ప‌వ‌న్ మాత్రం బీజేపీ పై త‌క్కువ స్థాయిలో విమ‌ర్శలు చేశారు. అప్ కోర్స్ ప‌వ‌న్ ప్ర‌సంగం గ‌తంలో కంటే ఇప్పుడు కొంత వ‌ర‌కు మెరుగేన‌ని చెప్పొచ్చు. మోడీ అంటే అభిమానం ఉంది గౌర‌వం ఉంది కానీ... సీమాంద్ర ప్ర‌జ‌ల‌ను తాకట్టు పెట్టే గౌర‌వం మాత్రం లేదు. ఇదే స్థాయిలో సీమాంధ్ర ఎంపీలపై విరుచుకుప‌డ్డారు. ఎంపీలు అంద‌రు గులాం గీరి చేయ‌కండి అన్నారు.

రాజ‌ధాని విష‌యంలో ప‌వ‌న్ ప్ర‌సంగం...

సీమాంధ్ర ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వాన్ని తాకట్టు పెట్టొద‌ని చెప్పిన ప‌వన్...  కేంద్ర ప్ర‌భుత్వ మోకాళ్ల‌కు ద‌ణ్ణం పెట్ట‌కం డ‌న్నారు. ఇక రాజ‌ధాని విష‌యంలో మ‌రోసారి ప్ర‌స్తావించారు  ప‌వ‌న్. వాస్త‌వానికి ఆయ‌న చెప్పిన విధంగా రాజ‌ధాని  ఎప్పుడు పూర్త‌వుతుందో అర్దం కానీ ప‌రిస్థితి. అయితే ఇక్క‌డ మ‌రో విష‌యం మాట్లాడాలి. గ‌తంలో రాజ‌ధాని భూసేక‌ర‌ణ కోసం ప్ర‌భుత్వం చాలా మంది రైతుల భూములను లాక్కున్నారు. దీనిపై అప్ప‌ట్లో జ‌న‌సేనాని వ‌చ్చి వారికి అండగా ఉంటాన‌ని హామీ ఇచ్చారు. కానీ ఇచ్చిన హామీ కేవ‌లం మాట‌ల‌కే ప‌రిమిత‌మౌయింది. తాజాగా రైతులు సైతం ప‌వ‌న్ వ‌స్తార‌ని మాకు అండ‌గా ఉంటార‌ని భావించినా దాని పై ప‌వ‌న్ మాత్రం త‌న ప్ర‌సంగంలో క్లారిటీ ఇవ్వ‌లేదు. అయితే ఇక్క‌డ గతంలో కంటే ఈసారి కేంద్ర ప్ర‌భుత్వాల‌పై విరుచుకుపడ్డ‌ట్టుగా చెప్పొచ్చు. అయితే ఇక్క‌డ కూడా కొంత క్లారిటీ క‌రువైయ్యింది. ఆయ‌న కేంద్రం పార్టీలు అంటే కాంగ్రెస్, బీజేపీల పై విరుచుకుప‌డుతూనే ఎక్కువ శాతం కాంగ్రెస్ నాయ‌కులను డైల‌మాలో ప‌డేశారు. 

టీడీపీ -బీజేపీ మ‌ద్ద‌తు ప‌వ‌న్ క్లారిటీ....

ఏపీ కాంగ్రెస్ నుంచి రాజ్య‌స‌భ ఎంపీగా ఎన్నికైన జైరాం రమేష్ ను మాత్రం పూర్తి స్థాయిలో ఎండ గట్టారు. ఆయ‌న మ‌న రాష్ట్రానికి వ‌చ్చి ఉమ్మ‌డిగా ఉన్న తెలుగు ప్ర‌జ‌ల‌ను విడిగొట్టి పోయార‌ని ఆయ‌న నిష్క్ర‌మ‌ణ కు చ‌ప్ప‌ట్ల‌తో గుర్తు చేశారు. ఇక గత సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఆయ‌న టీడీపీ-బీజేపీ కి పూర్తి మ‌ద్ద‌తు ఇచ్చినట్టు తెలిపారు. అయితే గతం నుంచి చంద్ర‌బాబు వెన‌కేసుకొచ్చిన ప‌వ‌న్... ఈసారి అయంతోనో, భ‌యంతోనో చంద్ర‌బాబుకు  ఓ హిత‌బోద చేశారు. చంద్ర‌బాబు మీరు ఎందుకు ప్ర‌త్యేక హోదా స్పందించడంలేదు. ఎందుకు మీరు గట్టిగా కేంద్ర‌ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించ‌డం లేద‌న్నారు. ప్ర‌త్యేక హోదాను అడిగితే సీబీఐ తో విచార‌ణ జ‌రిపిస్తార‌ని భ‌య‌ప‌డుతున్నారా? అని మాత్రం గ‌ట్టిగానే ప్ర‌శ్నించారు ప‌వ‌న్. మ‌రోవైపు  చంద్ర‌బాబు వెన‌కేసుకునే ప్ర‌య‌త్నం చేశారు. చంద్ర‌బాబు నాతో మాట్లాడారు. ఇప్ప‌టికిప్పుడే కేంద్రంతో త‌గాద పెట్టుకుంటే మ‌న‌కు రావాల్సిన నిధులు రావనే ఉద్దేశంతోనే తొంద‌ర ప‌డ‌టం లేద‌ని తెలిపార‌న్నారు. ఇక్క‌డ కూడా క్లారిటీ మిస్. అంటే ఒక‌వైపు చంద్ర‌బాబు వెన‌కేసుకుంటూనే మ‌రోవైపు ఎందుకు మీరు ప్ర‌త్యేక హోదా అడ‌గడం లేద‌ని ప్ర‌శ్నించ‌డం. 

న‌రేంద్ర మోడీ ప్ర‌శ్నించిన ప‌వ‌న్....

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని ప్ర‌శ్నిస్తూనే మ‌రోవైపు న‌రేంద్ర‌మోడీ అంటే నాకు చాలా అభిమానమ‌ని  చెప్పారు. కానీ ఈ సారి మాత్రం కొంత‌వ‌ర‌కు అస‌హ్యంగా ఉన్న‌ట్టు గానే క‌నిపించింది ప‌వ‌న్ ప్ర‌సంగం. ఎందుకు మీరు సీమాంద్ర ప్ర‌జ‌ల అత్మ‌భిమనానికి ప‌రీక్ష పెడుతున్నారు. ప్ర‌త్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేన‌ని డిమాండ్ చేశారు. సీమాంధ్ర ప్ర‌జ‌లు చేతగాని వారని తెలిపారు. ప్ర‌త్యేక హోదా గురించి అడిగితే ఇప్పుడు కేంద్రం మూడు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు అడ్డం పడుతున్నార‌ని చెబుతోంద‌ని బీజేపీ నేత‌లు చెబుతున్నార‌ని... గ‌తంలో విభ‌జ‌న స‌మ‌యంలో ఆరు కోట్ల మంది ఆంధ్రులు విభ‌జ‌న ఆప‌మ‌ని అడిగారే.. మ‌రి అప్పుడు విభ‌జ‌న‌ను ఎందుకు ఆప‌లేద‌ని నిల‌దీసే ప్ర‌య‌త్నం చేశారు. అయితే ఏపీ కి ప్ర‌త్యేక హోదా కోసం మూడు ద‌శ‌లుగా పోరాడుతాన‌ని స్పష్టం చేసినా... ఆయ‌న ఆ ద‌శ‌లు ఎలా ఉండ‌బోతున్నాయ‌న్న దానిపై స్ప‌ష్ట‌త ఇవ్వలేదు.

కేంద్ర రాష్ట్రాల‌ను నిల‌దేసే ప్ర‌య‌త్నం చేశారు...


అయితే ప్ర‌త్యేక హోదా పోరాటం మాత్రం ఎక్క‌డి నుంచి మొద‌ల‌వుతుందో తెలిపారు. బీజేపీ ఎక్క‌డైతే  రాష్ట్రాన్ని ముక్కలు చేయాల‌ని నిర్ణ‌యించిందో అదే కాకినాడు న‌డిబొడ్డు నుంచి ప్రారంభ‌మ‌వుతుంద‌న్నారు. మేక్ ఇన్ ఇండియా అని చెప్పి పరిశ్ర‌మ‌ల‌కు రాయితీలు ఇవ్వ‌క‌పోతే...  స్టార్టప్ ఇండియా అని చెప్పి కొత్త‌గా ప‌రిశ్ర‌మ‌లు పెట్టే వారికి రాయితి ఇవ్వ‌క‌పోతే మా భ‌విష్య‌త్ త‌రాల‌కు ఉద్యోగాలు ఎలా వ‌స్తాయి ఆయ‌న అడిగారు. అంటే మీ ప‌థ‌కాలు మాట‌ల‌కే ప‌రిమిత‌మా? అని ఆయ‌న నిల‌దీశారు.  ఇక‌పోతే ప‌వ‌న్ పూర్తి స్థాయి ప్ర‌సంగాన్ని గ‌మ‌నిస్తే... ఆయ‌న కొంత వ‌ర‌కు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను నిల‌దీస్తూనే... కొంత వ‌ర‌కు గంద‌ర‌గోళం లో పెట్టార‌న‌డంలో సందేహం లేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: