'గ్యాంగ్ స్టర్ నయీం ఓ క‌మిటీని ఏర్పాటు చేశారా?' 'ఆ క‌మిటి కొన‌సాగింపు ఉందా?' 'అత‌ను ఏర్పాటు చేసిన కాంత్రి సేన ను త‌న అనుచ‌రులు కొన‌సాగిస్తున్నారా?'  'దాదాపుగా నయీం అనుచ‌రుల‌నూ పూర్తి స్థాయిలో తూడ్చి పెడ‌తామ‌ని చెప్పుకుంటున్న స‌ర్కార్ ఇది  పెద్ద స‌వాలేనా?'  అంటే తాజాగా వెల్ల‌డైన ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌తో నిజ‌మే అనిపించ‌క త‌ప్ప‌దు! తాజాగా క్రాంతి సేన పేరు తో వెల్ల‌డైన  మీడియా ప్ర‌క‌ట‌న న‌యీం ఎన్ కౌంట‌ర్ బూట‌క‌మ‌ని తెల్చింది. అంతే కాదు... దీనికి కార‌కులైన టీఆర్ఎస్ పార్టీ నాయ‌కులను వ‌దిలిపెట్టేదిలేద‌ని హెచ్చ‌రించింది. ఇంత‌కీ ఈ క్రాంతి సేన ఎక్క‌డిది. ఎక్క‌డి నుంచి వ‌చ్చిందన్న అనుమానం ఇప్పుడు సామాన్య ప్ర‌జ‌ల మ‌నసులో మెదిలే ప్ర‌శ్న. ఇక‌పోతే... తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌నే కాదు, యావ‌త్ ద‌క్షిణ రాష్ట్రాల‌ను భ‌య‌బ్రాంతులు గురిచేసిన గ్యాంగ్ స్ట‌ర్ ఖాజా న‌యీముద్దీన్ అలియాస్ భువ‌న‌గిరి న‌యీం సంబంధించిన  మ‌రో కోణం బ‌య‌పడింద‌ని చెప్ప‌క త‌ప్పదు. 

క్రాంతి సేన పేరుతో ప్ర‌క‌ట‌న‌...

క్రాంతి సేన సెంట్ర‌ల్ క‌మిటీ పేరిట వెలువ‌డ్డ మీడియా ప్ర‌క‌ట‌న‌ను గ‌మ‌నిస్తే.... "ఒక డీఎస్పీ , మ‌రో ఎమ్మెల్యే క‌లిసి చ‌ర్చ‌లున్నాయ‌ని చెప్పి, మాట్లాడాల‌ని పిలిపించి న‌యీం కాల్చి చంపారు". "మాకున్న నెట్ వ‌ర్క్ ను ఉప‌యోగించుకుని న‌క్స‌ల్స్ ను ఏరివేసిన పోలీసులు చివ‌రికి మా నేత‌నే ల‌క్ష్యంగా చేసుకుని చంపారు". "తెలంగాణ  అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర స‌మితి(టీఆర్ఎస్) వ్య‌తిరేకంగా రాజ‌కీయ నిర్ణ‌యాలు తీసుకుంటూ ఉన్నందునే న‌యీం హ‌త్య చేశార‌ని", "ఇది బూట‌క‌పు ఎన్ కౌంట‌ర్" అని క్రాంతి సేన మ‌హారాష్ట్ర‌, ఒడిశా సెంట్ర‌ల్ క‌మిటీ స‌భ్యులు మధు, జ‌గ‌త్ ప‌ట్నాయ‌క్ ల పేరిట ఈ ప్ర‌క‌ట‌న విడుద‌లైంది. న‌ల్ల‌గొండ జిల్లాలో టీఆర్ఎస్ నేత‌లు గెలిచేందుకు నిధులు కూడా ఇచ్చామ‌ని, ఇప్పుడిక టీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌ను వ‌దిలి పెట్ట‌బోమ‌ని హెచ్చ‌రించారు. 

టీఆర్ఎస్ నాయ‌కులకు వార్నింగ్...

న‌యీం గ్యాంగ్ స్టర‌ర్ కాద‌ని... మావోయిస్టు , ఉగ్ర‌వాద వ్య‌తిరేక పంథా లో ప‌య‌నించాడ‌ని, ధ‌నికుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని వారి సంప‌ద‌ను పేద‌ల‌కు పంచాడ‌న్నారు. అంతేకాదు... అవ‌స‌ర‌మైతే తాము మావోయిస్టుల‌కు ద‌గ్గ‌ర‌వుతామ‌ని... టీఆర్ఎస్ నేతల‌ను వ‌దిలే ప్ర‌స‌క్తే లేద‌ని హెచ్చ‌రించారు. అయితే  కొద్ది నెల‌ల కింద‌ట టీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌కు...న‌యీం కు మ‌ధ్య ఏర్ప‌డ్డ ల్యాండ్ సెటిల్ మెంట్ ల కార‌ణంగానే ఎన్ కౌంట‌ర్ జ‌రిగింద‌ని ఆరోపించారు. అంతే కాంత్రిసేన పత్రికా ప్ర‌క‌ట‌న ప్ర‌కారం గ‌మ‌నిస్తే...న‌యీంకు భూ దంధాలు చేయ‌లేద‌ని... ఆయ‌న ఎవ్వ‌రిని సెటిల్ మెంట్ అంటూ ఒత్తిడి చేయ‌లేద‌ని మాత్రం తెలిపింది. మరీ ఇంత వ‌ర‌కు భాగానే ఉన్నా న‌యీం వ‌ద్ద ఉన్న వేల కోట్ల రూపాయలు, వంద‌ల ఎక‌రాలు భూములు ఎక్క‌డి నుంచి  వచ్చాయ‌న్న‌ది క్లారిటీ ఇవ్వ‌లేదు. దీని పై  క్రాంతిసేన ఎందుకు స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేద‌న్న‌ది అర్ధంకాని ప‌రిస్థితి.

మావోయిస్టు వ్య‌తిరేక ఉద్య‌మ‌మే క్రాంతి సేన‌....

వాస్త‌వానికి క్రాంతి సేన ఎక్క‌డ పుట్టిందన్న విష‌యాన్ని ఒక్క‌సారి గమ‌నిస్తే... 1990 లో సాధార‌ణ లెప్ట్ బావ‌జాలం తో విద్యార్థి ద‌శ‌లోనే క‌మ్యూనిస్టు నాయ‌కత్వం వ‌హించిన న‌యీం... అనంత‌రం అప్ప‌టి  పీపుల్స్ వార్ లో చేరి స‌మ సమాజ స్థాప‌న‌కై అడుగులు వేశాడు. అయితే ఈ క్ర‌మంలోనే మావోయిస్టు గా మారిన న‌యీం... అప్ప‌టి గ్రెహౌండ్ అధినేత వ్యాస్ ను చంపిన అనంత‌రం పోలీసుల‌కు లొంగిపోయారు.  త‌ద్వారా న‌యీంలో మార్పులు రావ‌డం జ‌రిగింది. మావోయిస్టు నేత‌ల‌తో వైరుద్యం ఎర్పరుచుకున్న న‌యీం మొద‌ట‌గా 1998 లో అప్పటి విర‌సం నేత‌, ప్ర‌జాగాయ‌ని బెల్లి ల‌లిత‌ను విచ్చ‌క్ష‌ణ ర‌హితంగా న‌రికి చంపారు. ఆ త‌రువాత పీపుల్స్ వ్య‌తిరేక ఉద్య‌మానికి ఏర్పరుచుకున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న క్రాంతి సేన ను ఏర్పాటు చేసిన‌ట్లు తెలుస్తోంది. అనంత‌రం కోవ‌ర్టుగా మారి మావోయిస్టు కీల‌క నేత‌ల‌ను చంపుతూ త‌న సామ్రాజ్యాన్ని నిర్శించుకున్నారు. 

నాటి నుంచి ఉన్మాది గా మారిన న‌యీం....

అయితే మావోయిస్టు నేత‌ల‌ను ఎరివేత‌కు నాటి టీడీపీ స‌ర్కార్ న‌యీం ను వాడుకున్నార‌న్న వాద‌న ఉంది. నాటి  హోం మంత్రి, దివంగ‌త‌ ఎలిమినేటి మాద‌వ‌రెడ్డి క‌నుస‌న్న‌లో న‌యీం ప‌నిచేశాడ‌ని ఇప్ప‌టికి చాలా మంది విశ్వ‌సిస్తున్నారు.  అయితే తాజాగా  ఆయ‌న షాద్ న‌గ‌ర్ ఎన్ కౌంటర్ లో ఏలాంటి సామ్రాజ్యాన్ని స్థాపించారో అదే సామ్రాజ్యానికి బ‌లయ్యారు. గ్రేహౌండ్ పోలీసుల ఎదురు కాల్పుల్లో మృతి చెందాడు. నాటి నుంచి నేటి వ‌ర‌కు ఆయ‌న‌  చేసిన ఆకృత్యాలు చూస్తే ఒళ్లు జ‌ల‌ద‌రించ‌క తప్ప‌దు. న‌యీం నాటి నుంచి రాను రాను ఓ ఉన్మాధిగా మారి.. త‌న ఇష్ట రాజ్యంగా దొపిడికి ఎగ‌బ‌డ్డార‌ని తాజాగా సిట్ బృందం విచార‌ణ‌లో వెలుగు లోకి వ‌స్తున్నాయి. చిన్నారుల‌ను సైతం ఆయ‌న ఇష్ట‌వ‌చ్చిన‌ట్టుగా వాడుకునే వాడ‌ని సిట్ బృందం తేల్చింది. త‌న‌కు ఎదురువ‌చ్చినా, చెప్పిన మాట విన‌క‌పోయినా, అడిగింది ఇవ్వ‌క‌పోయినా అంతే విచ్ఛ‌క్ష‌ణ ర‌హితంగా చంప‌డం ఆయ‌న లో ఉన్న మ‌రో కృర‌త్వం. 

నయీం ఎన్ కౌంటర్ తో భువ‌నగిరిలో స్వేచ్చా గాలులు...

ఈ కృర‌త్వాని చూసిన చాలా మంది పోలీసు అధికారులు, రాజ‌కీయ నేత‌లు అవ‌స‌రానికి వాడుకున్నార‌న్న నిజాలు ఒక్కొక్క‌టి వెలుగులోకి వ‌స్తున్నాయి. తాజాగా ఓ భువ‌న‌రిగి కి చెందిన వ్యాపారితో ఆయ‌న డ‌బ్బుల వ‌సూళ్ల తీరు చూస్తే పోలీసుల చెప్పింది వాస్త‌వ‌మే అన‌క మాన‌దు. కానీ తాజాగా క్రాంతి సేన పేరుతో  పత్రికా ప్ర‌క‌ట‌న రావ‌డంతో ఒక్కాసారిగా రాష్ట్రం మ‌రోసారి ఉలిక్కిప‌డింది. కేవ‌లం ధ‌నికుల‌ను టార్గెట్ చేసి పేద‌ల‌కు పంచాడ‌ని చెబుతున్నారు. నయీం గ్యాంగ్ స్ట‌ర్ కాద‌ని, మావోయిస్టు వ్య‌తిరేక ఉద్య‌మ‌నేత‌గా ఉన్నార‌ని క్రాంతిసేన తెలిపింది.  వీరు చెప్పిన దాని బ‌ట్టి చూస్తే ... పోలీసులు, ప్ర‌జ‌లే మంచివారు కాద‌ని, కేవ‌లం న‌యీమే మంచి వాడ‌న‌ట్టుగా ఉంది. వాస్తావానికి గ‌మ‌నిస్తే ... నయీం చనిపోవ‌డం తో భువ‌న‌గిరి ప్రాంతం వాసులు సంబ‌రాలు చేసుకుంటున్నారు. భువ‌న‌గిరి పట్ట‌ణం స్వేచ్చా గాలులు పీల్చుకుంటోంది.  కానీ  తాజా క్రాంతిసేన దీనికి భిన్నంగా ఆరోపిస్తోంది. 

'క్రాంతి సేన‌' కు పోలీసులు ఎలా చెక్ పెడ‌తారో...?

అయితే  ఇందులో నిజం ఎంతో తెలియ‌దు కానీ... నయీం ఎర్పాటు చేసిన క్రాంతి సేన మ‌ళ్లీ న‌యీం సామ్రాజ్యాన్ని కొన‌సాగిస్తుందా? అన్న అనుమానం క‌ల‌గ‌క మాన‌దు. ఇప్ప‌టికే న‌యీం కు సంబంధించిన ప్రదాన అనుచ‌రుల‌ను, అత్యంత కీల‌క వ్య‌క్తుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపుగా  నయీం చీక‌టి సామ్రాజ్యాన్ని కూక‌టి వెళ్ల‌తో తుడిచేశామ‌ని చెబుతున్న పోలీసుల‌కు ఈ ఉత్త‌రం క‌ల‌క‌లం రేపుతుంది. అంటే దీనిని బ‌ట్టి చూస్తే న‌యీం అనుచ‌ర గ‌నం ఇంకా మిగిలే ఉందా... ఇత‌ర రాష్ట్రాల్లో ఆయ‌నకు సంబంధించిన కీల‌క వ్యక్తులు ఉన్నారా? మ‌రి ఈ  క్రాంతిసేన‌కు పోలీసులు ఎలా చెక్ పెడ‌తారో చూడాలి!

మరింత సమాచారం తెలుసుకోండి: