తెలుగు దేశం పార్టీ పెట్టిన తొలి నాళ్ళ నుంచీ ఆ పార్టీ ని తన భుజాన మోసింది ఈనాడు . ఎన్టీఆర్ కి మొదటి రోజు నుంచీ సపోర్ట్ ఇస్తూ అప్పట్లో మీడియా లో ఏక చత్రాదిపత్యం కావడం తో విస్తారంగా పార్టీ ని జనాల్లోకి తీసుకువెళ్ళింది ఈనాడు. ఒకరకంగా తెలుగుదేశం పార్టీ కి ఈనాడు తొత్తుగా ఉండేది. అయితే పైకి అవసరమైన చోట తన విలువలు కోల్పోకుండా జనాలకి ఏ విషయం ఎలా చెబితే అర్ధం అవుతుందో ఈనాడుకి బాగా ఎరుక.తన ఫేం ని ఏ మాత్రం కోల్పోకుండా, విలువలు ఉన్న మీడియా గా తన ముద్ర ని కాపాడుకుంటూ అదే ముసుగులో తెలుగుదేశం కి ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. ఎన్టీఆర్ - రామోజీ రావు ఇద్దరూ కలిసే అనుకునే అప్పట్లో పార్టీ పెట్టె ముందర నుంచీ లెక్కలు బేరీజు వేసుకుని కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఎలా పోరాటం చెయ్యాలి, దాన్ని జనాలకి ఎలా చేరువ చెయ్యాలి అనే వివిధ విషయాలు మాట్లాడుకున్నారు అని చెబుతూ ఉంటారు విశ్లేషకులు.


ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా కృష్ణ , సత్యన్నారాయణ లాంటి వారు సినిమాలు తీసినా అందులో రామోజీ కి కూడా ఒక డూప్లికేట్ పాత్ర కల్పించేవారు.అచ్చం ఎన్టీఆర్ లా ఉండే వ్యక్తి తో  ఎన్టీఆర్ లీడర్ గా చేసిన పనులు ఏంటో అని చూపిస్తూ నటింపజేసిన డైరెక్టర్ లు పక్కనే రామోజీ లాంటి అచ్చం అలాగే ఉండే వ్యక్తిని పెట్టి మీడియా ద్వారా జనాలని ఎలా మభ్య పెడుతున్నాను అనేది ఆ పాత్రతోనే చెప్పించేవారు. రాను రాను తెలుగుదేశం - ఈనాడుల దోస్తీ బలపడుతూ వచ్చింది. ఒకానొక రోజున ఎన్టీఆర్ ని లైట్ తీసుకుని చంద్రబాబు ని నెత్తిన పెట్టుకున్న రామోజీరావు ఏ నాడూ కూడా తెలుగుదేశం జండా వదలలేదు.అలాగని ఎక్కడా ఓవర్ హైప్ ఇవ్వడం , తమ విలువ జార్చుకోవడం లాంటివి చెయ్యలేదు. ఉదాహరణ కి ఒక విలువలు గలిగిన ఛానల్ గా జనాల్లో ఈనాడు కి మొదటి నుంచీ పేరుంది కాబట్టి అలాంటి ఛానల్ ఒక పార్టీ, ఒక నాయకుడి గురించి కాస్తంత పాజిటివ్ గా అప్పుడప్పుడూ మాట్లాడితే చాలు జనాల్లో ఒకరకమైన ఆసక్తి భావం రేగుతుంది.


" ఇంత విలువలుగల ఛానల్ చెప్తోంది అంటే నిజమే అయ్యుండచ్చు కదా " అని సదరు సామాన్యుడు ఆలోచిస్తాడు. ఆ రకంగా సాగింది ఈనాడు సపోర్ట్. ఇప్పుడు కట్ చేస్తే ముప్పై నలభై ఏళ్ళ తరవాత పూటకొక ఛానల్ పుట్టుకొస్తోంది, గంటకొక వార్త షురూ అవుతోంది. ఆంధ్ర ప్రదేశ్ లో సాక్షి లాంటివి పక్కన పెడితే ప్రతీ మీడియా తెలుగుదేశం కి ఫర్ గానే ఉన్నాయి. పైకి ఎన్ని కబుర్లు చెప్పినా అందరూ తెలుగుదేశం కి ఫుల్ తొత్తులు. ప్రస్తుతం మరి చంద్రబాబు గారికి ఇష్టమైన మీడియా గా ఇంకా ఈనాడు కొనసాగుతోందా లేక ఇంకేవైనా ఫీలింగ్స్ ఉన్నాయా అని చూస్తే ఒక సంఘటన గురించి ప్రస్తావించాలి.రెండు సంవత్సాల పాలన్, మూడు సంవత్సరాల పాలనా పూర్తయిన క్రమం లో ఇంటర్వ్యూ లు ఇస్తూ ఉంటారు ముఖ్యమంత్రులు. కృష్ణా పుష్కరాలు పూర్తయిన తరవాత విడివిడిగా అందరు మీడియా సంస్థలకీ ప్రత్యేక ఇంటర్వ్యూ లు ఇచ్చిన చంద్రబాబు అందరికీ ఒకే విషయాన్ని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం అద్భుతంగా చేస్తోంది అనేది వారి సారాంశం.


అయితే ఇంటర్వ్యూ ల వ్యవహారం లో చంద్రబాబు ఈనాడు ని పక్కకి పెట్టేసారు అని వినిపిస్తోంది. ఇదివరకు చంద్రబాబు గారికి భజన అంటే ఈనాడు మాత్రమే చేసేది గానీ ఇప్పుడలా కాదు అందరూ ఆయనకే భజన, ఇలాంటప్పుడు ఈనాడుకి మాత్రమే ఇన్నేళ్ళుగా ఇస్తున్న విలువ ఎందుకు ఇవ్వాలి అనుకున్నారో ఏమో చంద్రబాబు " ఈనాడు కి ఇంటర్వ్యూ నా ? తరవాత చూద్దాం లే " అన్నారట తన సన్నిహితులతో. తాజా ఇంటర్వ్యూల నేపథ్యంలో ఈనాడు ను కాస్త వెనక్కు నెట్టి మరీ చంద్రబాబు ఆంధ్రజ్యోతికి ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది.  మిగిలినవారి కంటే ఆంధ్ర జ్యోతి కి స్పెషల్ గా ఒకరోజు ముందరే ఇంటర్వ్యూ ఇచ్చారు బాబుగారు. రాధాకృష్ణ స్వయంగా వెళ్లి మరీ ఈ ఇంటర్వ్యూ ని తీసుకోవడం విశేషం. మిగిలిన చానల్స్ తో కలిపి ఇచ్చిన ఇంటర్వ్యూ లలో ఈనాడు కి ఇవ్వడం గమనార్హం. ముందు ఆంధ్ర జ్యోతికి అపాయింట్మెంట్ ఇవ్వండి ఈనాడు ని అందరితో పాటు పంపండి అని బాబుగారు స్వయంగా అన్నారని ఎన్టీఆర్ భవన్ లో ఫుల్ టాక్ నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: