Image result for cpec pakistan

చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ (సిపిఈసి) అంటే చైనాలోని జింగ్ జియాంగ్ ప్రావిన్స్ నుండి పాకిస్తాన్ లో గ్వాదర్ హార్బర్ వరకు బెలూచిస్తాన్ ద్వారా చైనా చాలా ప్రతిష్టాత్మకంగా "వన్ రోడ్ వన్ బెల్ట్" గా నిర్మిస్తుంది. ఈ చైనా ఎకనమిక్ కారిడార్ కు దాదాపు మూడు లక్షల కోట్ల వ్యయమవుతుందని అంచనా. చైనాకు చెందిన అత్యంత శక్తిమంతమైన ఇంటెల్లిజెన్స్ సెంటర్ "చైనా ఇన్ష్టి-ట్యూట్ ఆఫ్ కాంటెంపరరి ఇంటర్నేషనల్ రిలేషన్స్" గా పేరొందిన సీఐసీఐఆర్‌ లో పరిశోధకుడిగా పనిచేస్తున్న "హు-షిషెంగ్‌" మాట్లాడుతూ "ఎర్రకోట నుంచి మాట్లాడిన ప్రధాని మోదీ కశ్మీర్‌ (పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌), బలూచిస్థాన్‌ అంశాలపై ప్రస్తావించడం ప్రస్తుతం చైనా కు ఆందోళన కలిగిస్తుందని, ఐతే ఇది పాకిస్థాన్‌ విషయంలో ఇండియా విదేశీ విధానంలో ఇది కీలక మలుపు అయి ఉండొచ్చు, కానీ మొదటిసారి  ఈ విషయాన్ని ప్రస్తావించడం చైనా మేధావుల్లో ఆందోళన కలిగిస్తున్నది" అని చెప్పారు.

  Image result for cpec pakistan

కల్లోలిత ప్రాంతంగా బెలూచిస్తాన్ ను పరిగణిస్తూ ఆ ప్రాంతములో ఇండియా ఏదైనా కుట్రపన్నితే దానివలన "సి.పి.ఈ.సి" ఏదైనా నష్టం వాటిల్లితే చైనా చూస్తూ ఊర్కోదని అవసరమైతే చైనా రంగములోకి దిగుతుందని హెచ్చరించారు. బెలూచిస్తాన్ లో మానవహక్కులకు నష్టం కలుగుతుందనే పేరుతో భారత్ బెలూచిస్తాన్ లో కల్లోలం రేపితే దానివల్ల చైనా అవసరాలకు ఇబ్బంది కలిగే సూచనలున్నట్లు చైనా ఆందోళనకు గురౌతున్నట్లు ఆయన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈయన చైనాకు చెందిన "చైనా ఇన్ష్టి-ట్యూట్ ఆఫ్ కాంటెంపరరి ఇంటర్నేషనల్ రిలేషన్స్" (సమకాలీన అంతర్జాతీయ వ్యవహారాల కేంద్రం- సీఐసీఐఆర్‌) లోని “దక్షిణ, దక్షిణాసియా, సముద్రదేశాల అధ్యయన కేంద్రం”  డైరెక్టర్‌గా ఉన్నారు.

 Image result for cpec pakistan

అంతర్జాతీయ వార్తా సంస్థ  ఐఏఎన్‌ఎస్‌ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో భారత్ పై  “కారాలు మిరియాలు” నూరేపని పెట్టుకున్నారు. కల్లోలిత బలూచిస్థాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక శక్తులను భారత్ వినియోగించుకుంటే అది “సీపీఈసీ” ని నష్టం కలిగించవచ్చునని, అప్పుడు చైనా  రంగంలోకి దిగక తప్పదని ఘాటుగానే ఆయన చెప్పారు.  పాక్ కోసం చైనా భారత్ తో కయ్యనికి దిగటానికి సిద్ధంగా ఉందని దీనితో ఋజువౌతుంది. దీనిపై భారత్ స్పందించవలసి ఉంది.

 Image result for cpec pakistan

మరింత సమాచారం తెలుసుకోండి: