మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం సువిశాల భారత్ ను స్వచ్చ భారత్ గా మార్చాలని కంకనబద్ధులై కొన్ని వేలకోట్ల రూపాయాలు ఖర్చు పెట్టి మరీ ప్రభుత్వ కార్యాలయాల్లో, బహిరంగ ప్రదేశాల్లో, పాఠశాలల్లో మరుగు దొడ్ల నిర్మాణానికి పూనుకొన్న విషయం అందరికీ విదితమే. ఈ కార్యక్రమం ప్రతి ఒక్క భారతీయున్ని ఆలోచింపజేసిన విషయం కూడా అందరికీ విదితమే. దేశంలోని గొప్ప గొప్ప వ్యాపారస్తులు, పారిశ్రామిక వేత్తలు, సామాజిక వేత్తలు ఈ మిషన్ లో స్వచ్చందంగా భాగస్వాములు అవుతున్నారు.


Image result for government school toilet problems

 అయితే కేంద్రం ఆదేశాలను రాష్ట్రా ప్రభుత్వాలు సైతం ఆచరిస్తున్నా ఇకా ఈ కార్యక్రమం పూర్తిగా విజయవంతం అయిందా...? అని ప్రశ్నించుకుంటే ఇంకా లేదనే చెప్పవచ్చు. కారణం ఇంకా బహిరంగ మల విసర్జనన విధానాన్నే అనుసరిస్తున్న గ్రామలెన్నో. ప్రభుత్వ పాటశాలల్లో నైతే పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. పాటశాల మొత్తానికి కేవలం ఓకె ఒక్క మరగు దొడ్డి ఉండడం నిజంగా దయనీయకరం. ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిజంగా ఇంది ప్రత్యక్ష నిదర్శనం. ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణాలపై ప్రభుత్వం ఇస్తున్న హామీలు కాగితాలకే పరిమితమవుతున్నాయన్న సంగతి తాజా సర్వేలో వెల్లడైంది.


Image result for government school toilet problems

 దేశంలోని తొమ్మిది రాష్ట్రాల్లోని 450 ప్రభుత్వ స్కూళ్లలో అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ వాటర్ ఎయిడ్ నిర్వహించిన సర్వే విస్తుపోయే నిజాలను వెల్లడించింది. సర్కారు స్కూళ్లలో సగటున ఒక్క టాయిలెట్‌ను 76 మంది బాలురు వాడుకుంటుండగా, 66 మంది విద్యార్థినులు ఉపయోగిస్తున్నట్టు తేల్చింది. రెండు సంవత్సరాల క్రితం కేంద్రం స్వచ్ఛ విద్యాలయ అభియాన్‌ పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. పాఠశాలల్లో బాలబాలికలకు ప్రత్యేక టాయిలెట్ల నిర్మాణం ఈ కార్యక్రమం ఉద్దేశం. 


Image result for government school toilet problems

2.61 లక్షల పాఠశాలల్లో 4.17 లక్షల టాయిలెట్ల నిర్మాణం చేపట్టనున్నట్టు ఆగస్టు 2015లో ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. స్వచ్ఛ విద్యాలయ అభియాన్ ప్రకారం 40 మంది విద్యార్థులకు ఒక టాయిలెట్ ఉండాలి. కానీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి రెండేళ్లు గడుస్తున్నా విద్యార్థుల అవస్థలకు మాత్రం మోక్షం కలగలేదని తాజా సర్వే చెబుతోంది. సర్వేలో భాగంగా దేశవ్యాప్తంగా 4,800 మంది విద్యార్థులు, 800 మంది ఉపాధ్యాయులను ఇంటర్వ్యూ చేశారు. దాదాపు 95 శాతం స్కూళ్లలో బాలబాలికలకు ఒకే టాయిలెట్ అందుబాటులో ఉండగా 76 శాతం పాఠశాలల్లో వేర్వేరు టాయిలెట్లు ఉన్నాయి. ఈ విషయంలో కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లో పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: