తెలుగు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కోసం అధికార పార్టీ మినహా అన్ని పార్టీలు ఏకతాటిపై వచ్చి పోరాటం చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష హోదాలో ఉన్న వైఎస్సాఆర్ పార్టీ అధినేత సారధ్యంలో ఏపికి స్పెషల్ స్టేటస్ కోసం తీవ్రంగా పోరాటం చేస్తున్నారు. గత కొంత కాలంగా నటుడు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాన్ నిశ్శబ్ధంగా ఉంటూ వస్తున్నానేపథ్యంలో ఆయనపై ఎన్నో విమర్శలు వచ్చాయి. మొన్న తిరుపతిలో భారీ బహిరంగ సభ పెట్టి  తాను ఏ విషయాన్ని కూడా ఆలోచించి మాట్లాడుతానని ఏది పడితే అది మాట్లాడి నోరు పారేసుకుంటే సస్పెండ్ అయి ఇంట్లో కూర్చోవాలని అన్నారు. అంతే కాదు ఏపీ ముఖ్యమంత్రి ని తాను సూచన మాత్రమే ఇస్తున్నానని నిలదీయడం లేదని తప్పుగా అర్ధం చేసుకోవద్దని అన్నారు.
Image result for ysrcp
అంతే కాదు మోడీ అంటే తనకు ఎంతో గౌరవం ఉందని స్పెషల్ స్టేటస్ కోసం లేచిందే లేడికి పరుగు అని వెళ్లి అడిగితే సభ్యతగా ఉండదని అన్నారు. దీనిపై ఇప్పుడు వైసీపీ నాయకులు పవన్ పై ఆగ్రహంగా ఉన్నారు. పవన్ కళ్యాన్ తెలుగు దేశం, బీజేపి పార్టీలకు కొమ్ము కాస్తున్నారని వారిని ప్రశ్నిస్తానని అన్న పవన్ సూచనలు ఇవ్వడం ఏంటీ అని ప్రశ్నిస్తున్నారు.  అంతే కాదు బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వారిపై కామెంట్ చేయడంపై జగన్ నేతృత్వం లోని వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు మాత్రం సోషల్ మీడియాలో పవన్ పై దుమ్మెత్తి పోస్తున్నారు .

పవన్ ఎక్కడ రాజకీయాల్లో క్రియాశీలకంగా పని చేస్తే జగన్ పార్టీ కి ఇబ్బంది అని భయపడుతున్నట్లు గా ఉంది ఇక వాళ్ళకు మరీ పవన్ పై కోపం రావడానికి మరో కారణం ఏమిటంటే ఎపి సిఎం చంద్రబాబు ని సుతిమెత్తంగా విమర్శలు చేసాడు తప్ప స్పెషల్ స్టేటస్ కోసం బాబు పోరాటం చేయడం లేదని పవన్ పై బాగానే విమర్శలు గుప్పిస్తున్నారు .  అయితే దీనిపై పవన్ ఫ్యాన్ సోషల్ మీడియాలో వైసీపి గట్టి సమాధానమే ఇస్తున్నట్లు తెలుస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: