తెలుగు రాష్ట్ర విభ‌జ‌నానంత‌రం తెలుగు రాష్ట్రాలు దేశీయంగా స‌త్తా చాటుతున్నారు. ఇందులో ప్ర‌త్యేకించి తెలంగాణ రాష్ట్రాన్ని ప్ర‌సంశ‌ల వ‌ర్షం కురుస్తోంది. కొత్త‌గా ఏర్ప‌డ్డ తెలంగాణ  రాష్ట్రానికి వ‌రుసగా రెండో ఏడాది కూడా దేశంలోనే మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ అవార్డును ఎంపిక‌య్యింది. నేష‌న‌ల్ న్యూస్ ఛానెల్ సీఎన్ఎన్ -ఐబీఎన్ 11 సంస్థ, గ‌త  11 ఏళ్లుగా జాతీయ స్థాయిలో ప్ర‌భుత్వాలు, ప‌రిశ్ర‌మ‌లు, క్రీడ‌లు. సామాజిక‌, క‌ళా, వినోద రంగాలే కాకుండా  వివిధ విభాగాల్లో  ఉత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌ర‌చిన వ్యక్తులు, రాష్ట్రాల‌కు అవార్డులు ప్ర‌క‌టిస్తున్న సంగ‌తి అంద‌రికి తెల‌సిందే. తెలంగాణ ప్ర‌భుత్వం చేపట్టిన వినూత్నమైన‌, పారదర్శ‌క  విధానాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న సీఎన్ బీసీ రాష్ట్రానికి మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ అవార్డ‌ను ఎంపిక చేసింది. 

మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ గా తెలంగాణ‌....

గ‌తేడాది, అవార్డుల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రం మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ గా అవార్డు ద‌క్కించుకుంది. తాజాగా ఈ ఏడాది కూడా తెలంగాణ అదే అవార్డును కైవ‌సం చేసుకుంది. ఇక‌పోతే... దేశంలో కొత్త‌గా ఏర్పాటైన ఒక రాష్ట్రం ... తాను ఏర్పాటైన రెండున్న‌రేళ్ల వ్య‌వ‌ధిలో జాతీయ స్థాయిలో గుర్తింపు ల‌భించ‌డం అంత చిన్న విష‌యం కాదు. అది కూడా ఒటి రెండు సార్లు కాకుండా వ‌రుస‌గా రావ‌డం విశేషంగా చెప్పొచ్చు. ఇక రాష్ట్ర ఏర్పాటు నుంచి తెలంగాణ రాష్ట్ర అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. మిష‌న్ కాక‌తీయ‌, మిష‌న్ భగీర‌థ‌, టీ-హ‌బ్, అత్యంత భారీ ప్రాజెక్టుల ఒప్పందాలు, వాట‌ర్ గ్రీడ్, పారిశ్రామిక సింగిల్ విండో పాల‌సీ లే కాకుండా ప్ర‌పంచంలో అత్యంత భారీ పెట్టుబ‌డులైన మైక్రోసాప్ట్, గూగుల్స్  కంపెనీలే కాకుండా.. ప‌లు భారీ ప్రాజెక్టులు తెలంగాణ‌లో ఏర్పాటు చేశారు. 

తెలుగు తేజం పీవీ సింధు జాతీయ గుర్తింపు...
 
ఇందుకు ముఖ్య‌మంత్రి కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేసిన‌ కృషి ఎంతో ఉంద‌ని చెప్పొచ్చు. ఈ రెండేళ్ల కాలంలో దేశంలో ఏ రాష్ట్రానికి సాధించ‌ని పెట్టుబ‌డులు తెలంగాణ రాష్ట్రం సాధించ‌న‌డంలో సందేహం లేదు. ఇందుకు అనుగుణంగానే గ‌డిచిన రెండేళ్ల కాలంలో తెలంగాణ కు వ‌రుస‌గా ఈ అవార్డుల‌ను ప్ర‌క‌టించింది సీఎన్ఎన్ సంస్థ‌. ఇక‌పోతే తాజాగా రియో ఒలింఫిక్స్ లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పీవీ సింధు సిల్వ‌ర్ మెడ‌ల్ ను సాధించింది. దేశాన్ని ప్ర‌పంచ స్థాయిలో గుర్తింపును తీసుకొచ్చిన సింధును తాజాగా తెలంగాణ సర్కార్ భారీ న‌జ‌రానా తో స‌త్క‌రించింది. క్రీడా ప‌రంగా చూసిన తెలంగాణ మ‌రోసారి దేశ ప్ర‌జ‌ల దృష్టిలోకి వెళ్లి పోయిందనడంలో అతిశ‌యోక్తి కాదు. ఇదీలా ఉంటే గ‌డిచిన  ప‌ద‌కొండేళ్లుగా సీఎన్ఎన్ బీసీ గ్రూపు ఇస్తున్న అవార్డును దేశ స‌మ‌గ్ర‌త‌... నిబ‌ద్ద‌తకు అనుగుణంగా వ్యాపార దృక్ప‌థంతో పాటు... మార్కెటింగ్ నైపుణ్యాల‌ను ప్ర‌ద‌ర్శించిన రాష్ట్రానికి ఇస్తుంటారు. 

పాలనకు, పారదర్శకతకు ఈ అవార్డులే సాక్ష్యం...

త‌న‌దైన పారిశ్రామిక పాల‌సీతో దేశ వ్యాప్తంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్న తెలంగాణ స‌ర్కార్ కు మ‌రోసారి అవార్డు రావ‌డం గ‌ర్వించ‌ద‌గ్గ విష‌యంగా చెప్పుకోవ‌చ్చు. ఇక దీనిపై స్పందించిన తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిఫ‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ ... ప్ర‌భుత్వ ప‌నితీరును మెచ్చి ఇప్ప‌టికే అనేక సంస్థ‌లు అవార్డులు ఇచ్చాయని... అనేక మంది ప్ర‌ముఖులు ప్ర‌శంసించార‌ని తెలిపారు. దేశంలోని ఇత‌ర రాష్ట్రాలు పోటీ ప‌డిన‌ప్ప‌టికీ  మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ అవార్డు తెలంగాణ కే రావ‌డం సంతోషంగా ఉంద‌ని తెలిపారు. ప్ర‌భుత్వం పాల‌నకు... పార‌దర్శ‌క‌త‌కు... విజ‌న్ కు ఈ అవార్డు సాక్ష్యంగా నిలుస్తుంద‌ని వెల్ల‌డించారు. రాష్ట్రానికి వ‌రుస‌గా అవార్డులు రావ‌డం  తో అనేక రంగాల్లో పేరు ప్ర‌తిష్ట‌లు పెరుగుతాయ‌ని తెలిపారు. ఇదే స్పూర్తి తో  రాష్ట్రంలో మ‌రింత అభివృద్దిని సాధిస్తామ‌ని అశాభావం వ్య‌క్త ప‌రిచారు.

ఈ నెల 30 న ఢిల్లీలో అవార్డు అందజేత‌...

ఇక ఈ అవార్డును ఈ నెల 30 న ఢిల్లీలో అంద‌జేయ‌నున్నారు. ఈ అవార్డును అందుకోవ‌టానికి తెలంగాణ ప్ర‌భుత్వం త‌ర‌పున రాష్ట్ర మంత్రి కేటీఆర్ హాజ‌రు కానున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆర్థిక మంత్రులు అరుణ్ జైట్లీ, ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్, ర‌విశంక‌ర్ ప్ర‌సాద్. స్మృతి ఇరానీ ల‌తో స‌హా పలువురు మంత్రులు హాజ‌రుకానున్నారు. దేశంలోనే అత్యున్న‌త పారిశ్రామిక విధానాన్ని పాటిస్తుంద‌న్న పేరును సొంతం చేసుకున్న తెలంగాణ రాష్ట్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు ల‌భించేలా పుర‌స్కారం లభిండచ‌టం కేసీఆర్  స‌ర్కారు ప‌నితీరు నిద‌ర్శ‌నంగా నిలుస్తుంద‌నటంలో సందేహం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: