గ‌త ఏడాది కాలంపాటు నిరువు గ‌ప్పిన నిప్పులా ఉన్న ఓటుకు నోటు కేసు మ‌రోసారి చెల‌రేగిందా? ఈ సారి ఏపీ సీఎం చంద్ర‌బాబుకు కోర్టు మెట్లు  ఎక్క‌క తప్ప‌దా? "మ‌న వాళ్లు బ్రిప్ డ్ మీ" అని ఫోన్ లో సంభాషించిన చంద్ర‌బాబు, ఇక వివ‌ర‌ణ ఇవ్వ‌క త‌ప్ప‌దా? అంటే త‌ప్ప‌ద‌నే వాద‌న‌లు గ‌ట్టిగా విన‌బ‌డుతోంది. ఈ కేసు మ‌రోసారి పున‌ర్విచార‌ణ చేయాల‌ని కోర్టు లో దావా వేసిన ఏపీ ప్రదాన‌ ప్ర‌తిప‌క్ష పార్టీకి అనుకూలంగా తీర్పు ఇవ్వ‌డంతో మ‌రోసారి ఓటుకు నోటు వ్య‌వ‌హారం తెర‌పైకి వ‌చ్చింద‌నే చెప్పాలి. అయితే ఈ సారి మాత్రం చంద్ర‌బాబు వివ‌ర‌ణ ఇవ్వక త‌ప్ప‌ద‌ని తెలుస్తోంది. ఇందుకు ఏసీబీ కోర్టు సైతం ఓకే చెప్పేసింది. వ‌చ్చే నెల 29 వ తేదీలోగా ఈ విచార‌ణ పూర్తి చేయాల‌ని ఏసీబీని అదేశించింది. 

బాబు మెడ‌కు మ‌రోసారి ఓటుకు నోటు ఇష్యూ....

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స్వ‌రం పై ఫోరెన్సిక్ ప‌రీక్ష‌లు నివేదిక ను మంగ‌ళ గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణ రెడ్డి కోర్టు ముందు ఉంచారు. ఈ నివేదిక ఆధారంగా కేసుపై పున‌ర్వీచార‌ణ చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. దీంతో పిటిష‌న‌ర్ వాద‌న‌ల‌తో ఏసీబీ కోర్టు ఏకీభ‌వించింది. ఆళ్ల రామ‌కృష్ణ రెడ్డి దాఖ‌లు చేసిన పిటిష‌న్ పై ఆయ‌న త‌ర‌పు న్యాయ‌వాది వాద‌న‌లు వినిపించారు. ఓటుకు నోటు కేసులో స‌రైన విచార‌ణ జ‌ర‌గ‌లేద‌ని ఆయ‌న కోర్టుకు తెలిపారు.  ఫోరెన్సిక్ నివేదిక‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని ఉత్త‌ర్వులు ఇవ్వాల‌ని న్యాయ‌వాది కోరారు. తిరిగి విచార‌ణ జ‌రిపించేలా అదేశాలు ఇవ్వాల‌ని అడిగారు. ఆయ‌న వాద‌న‌ల‌తో ఏసీబీ కోర్టు ఏకీభ‌వించింది. ఇదీలా ఉంటే దాదాపు గ‌తేడాది జూన్ లో తెలంగాణ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నిక‌ల జ‌రుగుతున్న స‌మ‌యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ స్టీపెన్ స‌న్ తో బేర‌సారాల‌డిన చంద్ర‌బాబు అండ్ కో 5 కోట్లకు బేరం కుదుర్చుకున్నారు. 

ఓటుకు నోటు కేసులో రేవంత్ అరెస్టు....

అయితే  రూ. 5 కోట్లు స్టీపెన్ స‌న్ తీసుకుని త‌మ టీడీపీ ఎమ్మెల్సీ అభ్య‌ర్ధి కి ఓటు వేసేందుకు తెలంగాణ టీడీపీ నాయ‌కులు మ‌ధ్య‌వ‌ర్తిత్వం న‌డిపించారు. ఇందులో ప్ర‌ధానంగా కొడంగ‌ల్ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప్ర‌త్య‌క్ష పాత్ర పోషించారు. అయితే వీరి ఒప్పందం ప్రకారం రూ. కోటి రూపాయ‌లు ముందుగా ఇచ్చి.... ఆ త‌రువాత రూ. 4 కోట్లు ఎన్నిక‌ల అనంత‌రం ఇవ్వాలని కుదుర్చుకున్నారు. ఈ క్ర‌మంలో మ‌రో వారం రోజులు ఎమ్మెల్సీ ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో రేవంత్ రెడ్డి కోటీ రూపాయ‌లు స్టీపెన్ స‌న్ ఇస్తూ అడ్డంగా దొరికారు. అయితే ఈ విష‌యాన్ని ముందుగా గ‌మ‌నించిన టీ స‌ర్కార్ ప‌క్కా వ్యూహంతోనే అడుగులు వేసింద‌న్న వాద‌న‌లు ఉన్నాయి. దీంతో రేవంత్ రెడ్డి తో మ‌రో న‌లుగురు టీడీపీ నాయ‌కులను తెలంగాణ ఎసీబీ అరెస్టు చేసింది. ఈ కార‌ణంగా టీడీపీ కి పార్టీకి తెలంగాణ లో కోలుకోలేని దెబ్బ త‌గిలింద‌ని చెప్పక త‌ప్ప‌దు. 

స్టీపెన్ స‌న్ తో చంద్ర‌బాబు సంభాష‌ణ‌...

 
అయితే ఈ వ్య‌వ‌హారంలో ప్ర‌దాన సూత్ర‌దారిగా పేర్కొంటు ప‌క్కా సాక్షాదారాలు ఉన్నాయ‌ని అప్ప‌ట్లో తెలంగాణ సర్కార్ తో పాటు, టీ. ఎసీబీ  కూడా పేర్కొంది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ స్టీపెన్ స‌న్ తో చంద్ర‌బాబు పోన్ లో సంభాషించిన ఓ ఆడియో రికార్డు సైతం బ‌య‌ట ప‌డింది. ఫోన్ లో సంభాష‌ణ ను గ‌న‌క ఒక‌సారి గ‌మ‌నిస్తే....

చంద్రబాబు తరపు మనిషి: హలో బ్రదర్.. బాబుగారు మీతో మాట్లాడతారు.. లైన్ లో ఉండండి
ఎమ్మెల్యే స్టీఫెన్సన్: సార్.. గుడ్ ఈవెనింగ్ సార్
చంద్రబాబు: గుడ్ ఈవెనింగ్ బ్రదర్.. హౌ ఆర్ యూ
స్టీఫెన్సన్:  ఫైన్.. థాంక్యూ సర్
చంద్రబాబు: మనవాళ్లు నాకంతా వివరించారు.. మీకు అండగా నేనుంటా.. కంగారు పడాల్సిందేమీ లేదు
స్టీఫెన్సన్: యస్ సార్.. రైట్ సార్
చంద్రబాబు: అన్నింటికీ మీకు నేను అండగా ఉంటా.. వాళ్లు మీతో మాట్లాడినవన్నీ నెరవేరుస్తాం
స్టీఫెన్సన్: యస్ సార్.. రైట్ సార్
చంద్రబాబు: మీరు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోండి.. ఎలాంటి సమస్య లేదు
స్టీఫెన్సన్: ఒకే సార్
చంద్రబాబు: అది మా హామీ.. మనం కలిసి పనిచేద్దాం
స్టీఫెన్సన్: రైట్.. థాంక్యూ సార్..
చంద్రబాబు: థాంక్యూ

చంద్ర‌బాబు వాయిస్ పై ఎఫ్ఎస్ఎల్ నివేదిక‌...


ఇక ఈ ఫోన్ సంభాషణ విన్న వారంతా  చంద్ర‌బాబు రాజీనామా, అరెస్టు త‌ప్ప‌వ‌ని భావించారు. అంతేకాదు చార్జ్ షీట్ లో సైతం చంద్ర‌బాబు పేరును ప్ర‌స్తావించారు. అంతేకాదు ఈ ఆడియో టేపు ను ప‌రీక్షించిన పోరెన్సిక్ ప‌రిశోదన సంస్థ... అందులో ఉన్న వాయిస్  సైతం చంద్ర‌బాబుదే న‌ని నివేదిక ఇచ్చింది. కానీ అనూహ్యంగా ఈ కేసు గ‌త కొద్ది నెల‌లుగా స‌ద్దుమ‌ణిగింది. ఇక ఆ ఇష్యూ పై చంద్ర‌బాబు ను అదుపులోకి తీసుకుని విచారిస్తార‌ని భావించినా అది జ‌ర‌గ‌లేదు. అయితే ఇందుకు ప‌లు కార‌ణాలు ఉన్నాయ‌ని ప్ర‌తిప‌క్ష పార్టీలు తీవ్ర ఆరోప‌ణ‌లు చేశాయి. ఈ కేసు పూర్తి ఆదారాల‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌ధాని న‌రేంద్రమోడీ దృష్టికి తీసుకువ‌చ్చారు. దీంతో  రాష్ట్రానికి రావ‌ల‌సిన ప్ర‌త్యేక హోదా పై ఎలాంటి డిమాండ్ చేయ‌వ‌ద్ద‌ని,  అలా చేస్తే ఈ కేసులో నుంచి బ‌య‌ట‌ప‌డేస్తాన‌ని కేంద్ర స‌ర్కార్ చంద్ర‌బాబుతో ఓ ఒప్పందానికి వ‌చ్చార‌ని... ఇందుకే చంద్ర‌బాబు ను ఓటుకు నోటు కేసు నుంచి త‌ప్పించార‌ని ప్ర‌ధాన ప్ర‌తి ప‌క్ష పార్టీ వైకాపా నాటి నుంచే ఆరోపించింది. 

మ‌రోసారి ఓటుకు నోటు కేసు విచార‌ణ‌...

అయితే ఈ క్ర‌మంలో తాజాగా మ‌రోసారి పోరాటం చేస్తున్న వైకాపా మ‌రోసారి  ఈ కేసును పున‌విచారించాల్సిందిగా ఏసీబీ కోర్టు ను ఆశ్ర‌యించింది. స్పందించిన ఏసీబీ కోర్టు మ‌రోసారి విచార‌ణ జ‌ర‌పాల‌ని ఇందుకు అనుగుణంగా వ‌చ్చే నెల 29 వ‌రకు నివేదిక ఇవాల్సిందిగా ఏసీబీకి ఆదేశాలు ఇచ్చింది. ఇక‌పోతే... ఈ కేసు విష‌యంలో గ‌త కొంత కాలంగా సైలెంట్ గా ఉంటూ వ‌స్తున్న తెలంగాణ స‌ర్కార్ కూడా ఏదో ఓ నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం లేక‌పోలేదు. మ‌రీ ఈ కేసును చంద్ర‌బాబు ఎలా తీసుకుంటారో... మ‌రోసారి కేంద్ర స‌ర్కార్ వ‌ద్ద ఎలాంటి ఒప్పందం చేసుకుంటారో చూడాలి మ‌రి.


మరింత సమాచారం తెలుసుకోండి: