ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై ఇప్పుటికే ఎన్నో ఉద్యమాలు,ధర్నాలు కొనసాగాయి. నటుడు శివాజి అయితే ఆమరణ నిరాహార దీక్ష కూడా చేపట్టారు. మరోవైపు ప్రత్యేక హోదా కాదు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాం సర్ధుకోండీ అంటున్నారు కేంద్ర సర్కారు. దీనిపై వామపక్షాలు, ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్సాఆర్ సిపీ ఇప్పటికే పలు దఫాలుగా పోరాటాలు చేస్తూ వస్తున్నారు. తాజా జనసేన అధ్యక్షులు చాలా రోజుల తర్వాత మరోసారి తన నోరు విప్పారు..అయితే ఈ సారి మాత్రం మిత్ర పార్టీ అయిన టీడీపిని, బిజేపిని కూడా వదల్లేదు.  సూచన ఇస్తున్నా అంటూనే చురకలు వేశారు. తిరుపతిలో సభ పెట్టి ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో కీలక వ్యాఖ్యలు చేసిన జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్‌పై తెలుగు దేశం పార్టీకి చెందిన నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు.  టీడీపీ రాజ్యసభ స‌భ్యుడు టీజీ వెంకటేశ్ పవన్‌పై తీవ్ర‌స్థాయిలో మండిపడ్డారు.

ఓ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఎమ్మెల్యే ఇంట్లో మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ కుంభకర్ణుడిలా నిద్రపోయార‌ని ఆయన ధ్వజమెత్తారు. ఇప్పుడు లేచి ప్ర‌త్యేక‌హోదా కోసం ఎంపీలు రాజీనామా చేయాల‌న‌డం ఆయ‌న‌ అవివేకానికి నిద‌ర్శ‌నమ‌ని ఆయన ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వపన్ ఏది పడితే అది మాట్లాడితే ఆయన ఇమేజ్ పెరుగుతుందనుకుంటే అది తప్పు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ తన ప్రవర్తనను మార్చుకోవాలని సూచించారు.  ఏపీ ఎంపీలపై ఆయన చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారని ఎంపీలు అంతా వ్యాపారస్తుల్లా మాట్లాడుతున్నారని కేంద్రంలో అయ్యాసార్ అంటూ మేం అడుక్కోవడం లేదు..ఏపీ కి ప్రత్యేక హోదా గురించి తాము కూడా పోరాటం చేస్తున్నామని అన్నారు.  

ఇదే వ్యాఖ్యలు త‌మిళ‌నాడులో చేస్తే ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత కాళ్లు, చేతులు విర‌గ్గొట్టించి లోపల వేయించేవారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు హోదాను తెరపైకి తెచ్చిందే తానని అన్నారు. హోదా కోసం ఏమైనా చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. టీడీపీ ఎంపీలు ఏ పని చేయడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఏపీకి హోదా కోసం మేమంతా పోరాడతుంటే ఇన్నాళ్లు పవన్ కళ్యాణ్ ఏం చేశారని ప్రశ్నించారు. తన వ్యాఖ్యలపై తాను కట్టుబడి ఉన్నానని చెప్పుకొచ్చారు. చివరగా చిరంజీవి ప్రజారాజ్యానికి పట్టిన గతే జనసేనకు పడుతుందని హెచ్చరించారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్‌పై టీజీ వెంకటేశ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: