Image result for vote note case chandrababu

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనాలు, కంపాలు సృష్టించిన ఓటుకు నోట్ కేసు మళ్లీ తెరమీదకు వచ్చింది. ఈ కేసును మరోసారి విచారణ చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఈ విచారణ  తుది గడువు సెప్టెంబర్ 29వ తేదీలోగా పూర్తి చేయాలని ఏసీబీని ఆదేశించింది. అంధ్రప్రదెశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వరంపై ఫోరెన్సిక్ పరీక్షల నివేదికను మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టు ముందు ఉంచారు. 

Image result for acb court hyderabad images

ఈ రిపోర్ట్ ఆధారంగా కేసుపై మరోసారి విచారణ చేయాలని ఏసిబి కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దాంతో పిటిషనర్ వాదనలతో ఏసీబీ కోర్టు ఏకీభవించింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై ఆయన తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఓటుకు నోట్ కేసులో విచారణ సరైన పద్ధతిలో జరగలేదని ఆయన చెప్పారు. ఫోరెన్సిక్ నివేదికను పరిగణనలోకి తీసుకుని తదుపరి ఆర్డర్స్ యివ్వాలని న్యాయవాది కోరారు. తిరిగి విచారణ జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలని అడిగారు. ఆయన వాదనలను ఏసీబీ కోర్టు అంగీకరించి విచారణకు ఆదేశించింది. 

Image result for acb court hyderabad images

ఒక సంవత్సర పొడవునా ఈ కేసు విచారణ పెండింగ్ లో పడిపోయింది. అప్పట్లో స్టీఫెన్‌సన్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడినట్లుగా చెబుతున్న ఆడియో టేపులు అతికించినవా, వాస్తవమైనవా అనే విషయమై నివేదికను "ఫోరెన్సిక్ సైన్సెస్ ల్యాబ్"  ఇచ్చింది. అవి ఒరిగినల్ వే నని తప్ప అతికించినవి కావని అప్పట్లో "ఫోరెన్సిక్ ల్యాబ్" కంఫార్మ్. ఈ స్వరం చంద్రబాబు నాయుడు గారిదేనని కూడా శాస్త్రీయంగా నిర్ధారించారు. ఇప్పుడు మరోసారి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పలు సందర్భాలలో చంద్రబాబు మాట్లాడిన స్వర నమూనాలను, ఓటుకు నోట్ కేసులో వినిపించిన సంభాషణలను అంతర్జాతీయంగా పేరొందిన ఒక ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఆ ల్యాబ్ అందించిన నివేదికలో కూడా ఆ స్వరం చంద్రబాబు దేనని తేల్చారు.

Image result for alla ramakrishna reddy ysrcp

వాటి ఆధారంగానే ఇప్పుడు ఏసీబీ కోర్టులో కేసు దాఖలు చేశారు. విచారణ మరోసారి జరిగి నేర నిరూపణ జరగి నేరస్తులందరికి శిక్ష పడాలని ప్రజలు భావిస్తున్నారు. తద్వారా ప్రజాస్వామ్య చిరాయువై వర్దిల్లాలని దొడ్డిదారిన రాజకీయాల్లోకి వచ్చి వాతావరణాన్ని తమకందిన అధికారముతో కలుషితం చెసేవారికి తగిన శిక్ష పడాలని ప్రజలు భావిస్తున్నారు.

Image result for vote note case chandrababu

మరింత సమాచారం తెలుసుకోండి: