ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి సమయం కోసం వేచిచూస్తున్న బాబు నామినేటెడ్ పదవి కోసం టీఆర్ఎస్ ఆగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్ సం కు తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తో కలిసి లంచం ఇవ్వజూపిన వీడియో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలనే ఒక్కసారిగా షేక్ చేసిన విషయం అందరికీ విదితమే. అయితే జరుగుతున్న ఈ తతంగాన్ని అంతా వీడియో రూపంలో చీత్రీకరించిన టీఆర్ఎస్ ఎమ్మేల్యే బాబు ప్రభుత్వాన్ని ఇరుకున పడేశారు. 


Image result for chandrababu

కేసీఆర్ దెబ్బకు బాబు కొన్ని రోజులు కోలుకోలేదంటే ఈ కేసు బాబుపై ఎంత ప్రభావాన్ని చూపిందో తెలుసుకోవచ్చు. ఈ కేసుపై రేవంత్ రెడ్డి ఏకంగా జైలుకు సైతం వెళ్లి వచ్చారు. అయితే ఇన్ని రోజులు వాయిదా పడ్డ ఈ కేసు మళ్లీ నేడు విచారణలోకి వచ్చింది. అయితే ఈ విషయాన్ని అదునుగా చేసుకొన్న విపక్షాలు బాబుపై విరుచుకుపడుతున్నాయి. టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు. 


Image result for chandrababu botsa satyanarayana

ఆయన సోమవారమిక్కడ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ..’చంద్రబాబు తాను నిప్పు, నిజాయితీపరుడని అంటున్నారని, నిజంగా చంద్రబాబు నిప్పుయితే వేరే పార్టీ ఎమ్మెల్యేలను ఎందుకు కోట్లు ఇచ్చి కొన్నట్లు. ఎమ్మెల్యేను కొన్న డబ్బంతా ఎక్కడిది? చంద్రబాబు నీ డొల్లతనం, నీ నైజం ఏంటో అందరికీ తెలుసు.  ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే చంద్రబాబు పదవి నుంచి తప్పుకోవాలి. ఏదైనా మేనేజ్ చేయవచ్చనే ధైర్యం చంద్రబాబుకు ఉంది. 


Image result for chandrababu botsa satyanarayana

చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సమంజమా?ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబును తాట తీస్తానన్న కేసీఆర్ వ్యాఖ్యలు ఏమయ్యాయి?. ప్రజాస్వామ్య పరిరక్షణను తెలంగాణ ప్రభుత్వం కాపాడాలి.  ఈ కేసులో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు లాలూచీ పడ్డాయి. వాళ్ల వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి సంజీవని అయిన ప్రత్యేక హోదాను కూడా కేంద్రం వద్ద తాకట్టు పెట్టారు’ అని ధ్వజమెత్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: