తెలుగుదేశం పార్టీ నాయకుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు మీద గానీ , ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ మీద కానీ ఎవరైనా విమర్సలకి దిగితే ఎదురు దాడి దిగడం కోసం కొందరు కాచుకుని సిద్దంగా ఉంటారు. వైకాపా వారు తెలుగుదేశం ని గానీ ముఖ్యమంత్రి చంద్రబాబు ని గానీ ఏమైనా అంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులు భగ్గున మండిపడతాయి. వై ఎస్సార్ జమానా నుంచి జగన్ వరకూ వారిలో ఉన్న నెగెటివ్ కోణాలు బయటకి తీసుకుని ఒచ్చి గొడవ గొడవ చేస్తారు. " నీకు నీ బాబు కీ కలిపి అడ్డదిడ్డంగా పెరిగిన సంపాదన లక్ష కోట్లు ఉన్నాయి.. అవెక్కడ పెట్టారు " అదీ ఇదీ అంటూ వైకపా పుట్టు పూర్వత్రాలు పట్టుకుని నరకం చూపిస్తారు. వైకపా మీద, జగన్ మీదా  తెలుగు దేశం దాడి చేసినప్పుడు కూడా ఇంతే అంబటి రాంబాబు, రోజా లాంటి వారు ఏ రేంజ్ లో విరుచుకుని పడతారో తెలిసిన విషయమే.  


రాజకీయాల్లో ప్రశ్నకి ఖచ్చితంగా సమాధానం వుండాలి. విమర్శలకు స్పందన కూడా వుండి తీరాలి. అది లేకపోతే, అసలు ప్రజాస్వామ్యానికి అర్థమేముంటుంది.? కానీ తనని తాను ట్రెండ్ సెట్టర్ గా చెప్పుకునే పవన్ కళ్యాణ్ విషయం లో ఇలా జరగదు. ఆయన రాజకీయం ఎక్కడా చెయ్యలేడు మరి. పవన్ మొన్నటికి మొన్న తిరుపతి లో సభ పెట్టి అందరినీ ఏకి పారేసాడు. మీరు ఇలా చేసారు మీరు అలా చేసారు, ప్రత్యేక హోదా విషయం లో ఎవరరిది తప్పు అనేది అంచనా వేస్తూ మోడీ నుంచి టీడీపీ ఎంపీల దాకా అందరికీ క్లాస్ పీకేసాడు.


ఈ పరిస్థితి లో గట్టిగ ఎదురు వాదన వినిపించిన బీజేపీ , టీడీపీ శ్రేణులు పవన్ కళ్యాణ్ మీద మండి పడుతున్నాయి. ఇలా పవన్ కళ్యాణ్ ని తిడుతూ, ఇష్టం వచ్చినట్టు దూషిస్తున్న టైం లో పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా లో గట్టిగానే స్పందిస్తున్నారు. ఉదాహరణ కి టీజీ వెంకటేష్ మీదా , జేసీ దివాకర్ రెడ్డి మీదా వారు తమ ప్రతి స్పందన తెలిపారు. అయితే ఇది మెయిన్ స్త్రీం మీడియా కి ఎక్కడ జరిగే పని మాత్రం కాదు. సో పవన్ తరఫున మాట్లాడడానికి ఒక్కరూ లేరు అనేది తేలిపోయింది. సినిమాల్లో ఏం చేసినా చెల్లిపోతుంది అనేది పవన్ కళ్యాణ్ మనస్తత్వం.


ఆయనకీ విపరీతమైన పాపులారితే, స్టార్ డం ఉండడమే కారణం దీనికి . పవన్ సినిమా ప్లాప్ అయినా హిట్ అయినా అతని రేంజ్ బట్టి చూస్తే తదుపరి సినిమాకి అంచనాలు ఆకాశాన్నంటేలానే వుంటాయి. దటీజ్‌ పవన్‌కళ్యాణ్‌. చూసీ చూసీ నిర్మాతకు విసుగొస్తే ఇంకో హీరోని చూసుకుంటాడు. కానీ పవన్ క్రేజ్ తరగదు. అదే ఏక్ నిరంజన్ పంథా పాలిటిక్స్ లో కూడా సాగిస్తున్నాడు పవన్. ఇక్కడ పవన్ కి మద్దతుగా మాట్లాడ్డం కోసం ఒక్కరూ లేరు.

అసలు జనసేన కి క్యాడర్ అనేది లేదు. పవనిజం అంటూ ఎగిరే ఫాన్స్ కూడా సోషల్ మీడియా లో హడావిడి తప్ప బయటకి రారు, వచ్చినా మీడియా వారికి సపోర్ట్ ఇస్తూ తెలీకాస్ట్ లు చెయ్యదు . పవన్ కళ్యాణ్ స్వయంగా విమర్సాలకి స్పందించాలి లేదా ఆయన తరఫున అధికారికంగా ఎవరైనా ప్రకటనలు విడుదల చెయ్యాలి లేని పక్షం లో పవన్ పూర్తిగా ఒంటరివాడు అయిపోయే ప్రమాదం ఖచ్చితంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: