మంత్రి నారాయణ పై ఉండవల్లి సంధించిన బాణం అంత సామాన్యమైనది కాదు. నారాయణ విద్యా సంస్థలు ఉండవల్లి అరుణ్ కుమార్ చెపుతున్నట్లు సొసైటీ క్రింద నడుస్తుంటే మాత్రం నారాయణకు కష్టకాలం దాపురించినట్లే. ఈ లాజిక్ గురించి ఏ చిన్న బాంక్ ఉద్యోగిని అడిగినా, న్యాయ వాదిని అడిగి నా, చార్టర్డ్ అకౌంటెంట్ నడిగినా వివరంగా చెప్పుతారు.

 Image result for narayana colleges

ఆ సొసైటీ క్రింద సంస్థలు నడిపితే ఆయనకు రెమ్యూనరేషన్  మినహా ఏమీ రాదు. “లాభనష్టాల ప్రసక్తే ఉండదు”   అంటే  “నో ప్రోఫిట్ - నో లాస్”  గానే సొసైటీ వ్యవస్థ నడుస్తుంది.  తనకు నారాయణ Rs. 475 కోట్ల సంపద ఉంది అంటే ఆయన ఇప్పుడు విద్యాసంస్థల ఆదాయం చూపటానికి ఉండదు. అలా చూపిస్తే అది మరోనేరమై కూర్చుంటుంది.

 Image result for narayana colleges

అంతే కాదు రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు వ్యాపారాలు చేయరాదు. అలా చేయాలంటే వారు రాజీనామా  చేయాల్సిందే.  అంతే కాదు ఎన్నికల అఫిడవిట్ లో ఇచ్చిన ఆస్తులు ఎలా సంపాదిం చారని చెప్పాలని డిమాండ్ చేసే హక్కు ప్రజలకు ఉంది. మొదట  చాలా చిన్న దనుకున్న మార్గదర్శి ఫైనాన్స్ కేసు  "చిరిగి చాటంతైనట్లు" ఉండవల్లి అదే స్థాయిలో ఈ ఇష్యూని ముందుకు తీసుకెళితే నారాయణ  చంకనాకి  పోవటం ఖాయం. అసలు వార్త వివరాలిలా ఉనాయి.

 Image result for narayana colleges  

“అంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖా మంత్రి నారాయణపై రాజమహేంద్రవరం మాజీ ఎమ్.పి ఉండవల్లి అరుణ కుమార్ విమర్శలు సంధించారు. ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు ఇచ్చిన అఫిడవిట్‌లో తన ఆస్తులు రూ. 474.70 కోట్లని మంత్రి నారాయణ పేర్కొన్నారని, ఈ ఆస్తులు ఏ వ్యాపారం చేసి సంపాదించారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యాసంస్థలను నారాయణ సొసైటీ పేరిట నడుపుతున్నారని, ఆ చట్ట ప్రకారం ఆ ఆస్తు లు సొంతానికి వాడుకునే హక్కు లేదని ఉండవల్లి అన్నారు. మంత్రి తన సొంత ఖాతాకు సొసైటీ నగదు బదలాయించుకున్నారా ? లేక సీఎం చంద్రబాబుతో కలసి వ్యాపారం చేశారా? అని ఉండవల్లి ప్రశ్నించారు. సొసైటీ చట్ట ప్రకారం విద్యాసంస్థలను లాభాపేక్ష లేకుండా నడపాలని, . సొసైటీని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదిస్తే నేరం. రూ. 474.70 కోట్లు ఎలా సంపాదించారో 15 రోజుల్లోపు తెలియచేయాలని ఆయన కోరారు. లేకపోతే చట్టపరంగా చర్యలు చేపడతామని ఉండవల్లి హెచ్చరించారు. అప్పుడు తాను ఉండవల్లినా, ఊసరవెల్లినా అన్నది చెబుతానని, మంత్రి నారాయణ చేసిన విమర్శకు బదులుగా అన్నారు.”

Image result for narayana colleges

మరింత సమాచారం తెలుసుకోండి: