తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత ఇరు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి కష్టాలు మొదలయ్యాయి..ఒక వైపు కలిసి ఉన్న రాష్ట్రాన్ని అన్యాయంగా విభిజించారని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకుంటే..60 సంవత్సరాల పోరాటం..ఎంతో మంది త్యాగంతో సాధించుకున్న తెలంగాణ కాంగ్రెస్ స్పెషల్ ఏముంటున్నారు. దీంతో రెంటికి చెడ్డ రేవడి గా మారింది కాంగ్రెస్ పరిస్థితి..అంతే కాదు ఇప్పటి వరకు ఏ ఎన్నికలయినా ఘోరంగా ఓటమి చవి చూస్తున్నారు కాంగ్రెస్ నాయకులు దీంతో అధికార పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఇప్పటికే ఏపీలో టీడిపిలోకి  సినియర్ కాంగ్రెస్ నాయకులు జంప్ అవుతుంటే..తెలంగాణలో టీఆర్ఎస్ లోకి జంప్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో  మాజీ మంత్రి అయిన దేవినేని నెహ్రూ త్వరలోనే ఆ పార్టీని వీడి సైకిలెక్కనున్నారు.
Devineni nehru meets chandrababu naidu in Vijayawada
నెహ్రూ టీడీపీలో చేరుతున్నట్టు కొన్ని రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ అవునా? కాదా? అనే సందేహాలు వచ్చినప్పటికీ నేడు దేవినేని నెహ్రూ, తన కొడుకు అవినాష్ తో కలిసి వెళ్లి చంద్రబాబును కలిశారు. వారు పార్టీలో చేరేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఎన్టీఆర్‌కు వీరాభిమాని అయిన దేవినేని నెహ్రూ 1995లో తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. అప్పటి నుంచి కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్న ఆయన రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉండదని భావించి టీడీపీలో చేరుతున్నారనే ఊహాగానాలు వస్తున్నాయి.  
Image result for devineni nehru
అంతే కాదు ప్రస్తుతం ఏపీ యవజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న తన కుమారుడి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని దేవినేని నెహ్రూ టీడీపీలో చేరుతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ భేటీలో తన కుమారుడి రాజకీయ భవిష్యత్తుపై చంద్రబాబు నుంచి హామీ తీసుకునే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు నెహ్రూని, అవినాష్ ను దగ్గరుండి చంద్రబాబు దగ్గరకు తీసుకెళ్లారు. సెప్టెంబర్ 12వ తేదీన అధికారికంగా తెదేపా తీర్థం పుచ్చుకునేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు నెహ్రూ.  


మరింత సమాచారం తెలుసుకోండి: