Image result for janata garage images

అంధ్రప్రదేశ్ లోని తెలుగుదేశం ప్రభుత్వం జూనియర్ సినిమాల పై కక్షగట్టినట్లు విడుదల రోజున ఏదో మాయోపాయం చేస్తూనే ఉన్నారు. దీని వెనుక నందమూరి బాలకృష్ణ, నారా లోకెష్ హస్తముందని జూనియర్ అభిమానులే కాదు, అనెకమంది అంటున్నారు. వాస్తవమేమిటో తెలియాల్సి ఉంది. ఇలాంటి దురదృష్టమైన కార్యక్రమం నాన్నకు ప్రేమతో  సమయములో థియేటర్స్ దొరక్కుండా చేసినా సినిమా విజయవంతమైనది.  


ప్రజల్లో టిడిపి తుడిచి పెట్టుకుపోయే రోజులు వస్తున్నాయి అని వైసిపి అంటుంటే ఏమో అనుకుంటున్నాము. ఈ నిరంకుశ, స్వప్రయోజన ఆలోచనలు, కక్షపూరిత ధోరణులు చూస్తే నిజమే ననిపిస్తుదని ప్రజాభిప్రాయం. 

Image result for janata garage images

ఆంధ్రప్రదేశ్‌లో సెప్టెంబర్ ఒకటవ తేదీన విడుదలవనున్న ఎన్టీఆర్ జనతాగ్యారేజ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. గ్యారేజ్‌కు సంబంధించి అక్కడ ఎలాంటి బెనిఫిట్ షోలు ఉండబోవు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. సెప్టెంబరు 1న అర్ధరాత్రి, "వేకువజామున" (ఏర్లీ మార్నింగ్ షోస్) వేసే షోలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

Image result for janata garage images

విజయవాడకు చెందిన కొందరు జనతా గ్యారేజ్ బెనిఫిట్ షో హక్కులను రూ.25 లక్షలు పెట్టి దక్కించుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రభుత్వ జీవోతో డిస్ట్రిబ్యూటర్‌లు తీవ్రంగా నష్టపోయే అవకాశముందని ఆందోళన చెందుతున్నారు. కాగా, తెలంగాణలో మాత్రం యథావిధిగా బెనిఫిట్ షోలు ఉండబోతున్నాయి. హైదరాబాద్‌లో బెనిఫిట్ షో హక్కులను శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్ సంస్థ రూ.70 లక్షలకు కొనుగోలు చేసింది. కూకట్‌పల్లి, దిల్‌సుఖ్ నగర్ ఇతర ప్రాంతాల్లోని థియేటర్లలో ఆగస్టు 31 అర్ధరాత్రి నుంచి బెనిఫిట్ షోలను వేయబోతున్నారు.

Image result for janata garage images

ప్రభుత్వం తీరు అనుమానాస్పదంగా ఉందని,  ప్రభుత్వము ఏమైనా చేయవచ్చునని భావిస్తున్నట్లు ఉందని, బాలకృష్ణ , నారా రోహిత్  సినిమాలకు, ఎలాంటి అవాంతరాలు కలిపించని ప్రభుత్వం ఎన్.టి.ఆర్ సినిమాల విషయములో ఈ విధంగా ప్రవర్తించటం అన్యాయమని అంటున్నారు. అదృష్టం కలిసొస్తే ఆ సినిమా సూపర్ హిట్ టాక్ మూట కట్టుకుంటే జూనియర్ ఫాలోయింగ్ ప్రభజనమైతే, బాలకృష్ణ, లోకేషుల గౌరవం అమరావతిలో ప్రవహించే కృష్ణ పాలే అంటూ, ముఖ్యంగా టిడిపి కి ఎంత అప్రతిష్ట కలుగుతుండో దేవుడుకూడా చెప్పలేడు. 

Image result for chiranjeevi on janata garage images

మరింత సమాచారం తెలుసుకోండి: