విశ్వ విఖ్యాత సోషల్ మీడియా వ్యాపార ధిగ్గజ సంస్థ ఫేస్బుక్, "ట్రెండింగ్ టాపిక్స్"  లో అభ్ అద్ధాల కథనాలతో గోబెల్స్ నే మరిపిస్తూ తప్పుడు కథనాలతో జనాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. ఎవరైకి తోచిన వార్తలు, ఊహలు, అలోచనలు, పోష్ట్ చేస్తుంటే ఆ తప్పుడు కథనాలనే ఫేస్బుక్ ఎక్కువగా ప్రచారం చేస్తుందని అనేక విమర్శలే కాకుండా విశ్వసనీయత పై అనుమానాలు ఎదుర్కొంటోంది. గత కొద్దికాలంగా ఈ విమర్శలు ఎక్కువగా వస్తున్నాయయని గమనిస్తున్నాము.   "ఫాక్స్ న్యూస్"  వ్యాఖ్యాత "మెగిన్ కెల్లీ" కు సంబంధించిన ఓ వార్తాకథనాన్ని ఫేస్ బుక్ అనాలోచితంగా, తప్పుగా ప్రచారం చేసింది.
Image result for facebook images
అమెరికా అధ్యక్ష అభ్యర్థి డెమొక్రాటిక్ పార్టీ లీడర్ హిల్లరీ క్లింటన్కు కెల్లీ మద్దతిస్తున్నట్టు ఆ వార్తా కథనాన్ని ఫేస్బుక్ ప్రచురించింది. అంతే కాదు ఆ రసవత్తర కథను "ట్రెండింగ్  టాపిక్స్ సైట్" లో టాప్ప్లేస్ లో ఫేస్బుక్ మెయిన్ పేజీలో ప్రచురించింది. నెలకు దాదాపు 1.7 బిలియన్ యూజర్లు ఈ పేజీని చదువుతారు. ఈ పేజీ వీక్షకులకు మహా ఇష్టం. దీంతో ఫేస్బుక్ "నమ్మతగనిది గా కచ్చితత్వం లేని" కథనాలను ప్రసారం చేసే మీడియాగా ఆరోపణలు వచ్చాయి.  ఈ కథనం సరియైనదిగా లేదని తొలగించాలంటూ ఫాక్స్ న్యూస్ ఆదేశించింది. ఆ ఆదేశాల మేరకు ఫేస్బుక్ రివ్యూ టీమ్ కథనములో నిజములేదని, ఆ లోపాన్ని గుర్తించి వెంటనే తొలగించింది.

Image result for facebook images

2014లో పరిచయమైన ఈ "ట్రెండింగ్ టాపిక్స్" కోసం, ఫేస్ బుక్ అత్యంత విలువ నిస్తూ, శ్రద్ధ తో ఒక ప్రత్యేక టీమ్ పనిచేస్తుంది. అయితే పొలిటికల్ చర్చలు, విశ్వాసాలను, నమ్మకాలను బట్టి కథనాలను ఎంపిక చేసిన వాటినే "ట్రెండింగ్ టాపిక్స్" లో ప్రచురిస్థారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే బ్రేకింగ్ న్యూస్లను, సంఘటనలను  ఈ పేజీకి కోసం సేకరిస్తారు. అయితే గత కొద్ది మాసాలనుంది నుంచి ఫేస్బుక్ ఈ "ట్రెండింగ్ టాపిక్స్" పై విమర్శలు రావటముతో విచారణ కొనసాగించిన ఫేస్బుక్ సైతం తాము ప్రచురించే కథనాల్లో తప్పులు ఉంటున్నయని అంగీకరించింది. అయితే ప్రచారం నిర్వర్తించే ముందు కథనాల కచ్చితత్వాన్నిధృవపరచుకొనే  విషయాన్ని  మాత్రం ఆ సంస్థ అధికార ప్రతినిధి తెలుపలేదు.  పాపులర్ కథనాల, వార్తల నిజాయతీ, గుర్తించడానికి ఫేస్బుక్ మరిన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అనేకులు వాదనలు, సలహాలు ఇస్తున్నారు.  అదీ ఫేస్ బుక్ నిజాయతీ. 

మరింత సమాచారం తెలుసుకోండి: