ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని అందుకు ప్రత్యేక హోదానే సరైన మార్గమని డిమాండ్ లేవనెత్తాయి అధికార విపక్షాలు. అయితే మొదట ఈ డిమాండ్ పట్ల సానుకూలంగా వ్యవహరించిన కేంద్రం ఆ తర్వాత ఈ అంశాన్ని పెడ చెవిన పెట్టె ప్రయత్నం చేసింది. రోజుకో మాట పూటకో తీరు రకంగా కేంద్ర పెద్దలంతా ప్రత్యేక హోదాపై ఎవరికి నచ్చినట్లు వారు ప్రకటనలు చేస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తికమకపెడుతున్నారు. 


Image result for ap special status

అయితే ఈ విషయంపై బాబు ఢిల్లీ లో ప్రధాన మంత్రి తో సహా కేంద్ర మంత్రుల ముందు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. అయితే ఈ అంశం రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉందని గ్రహించిన బీజీపీ అధిష్ఠానం దీనిపి ఇక స్పష్టమైన ప్రకటన చేయాలని నిర్ణయించుకుంది. తిరుపతిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ బహిరంగ సభ తర్వాత ‘ప్రత్యేక’ వేడి రాజుకోవడం, ఇంటా బయట ఒత్తిళ్లు పెరిగిపోవడంతో ఏదో ఒకటి తేల్చేయాలని కేంద్రం నిర్ణయించుకుంది. 


Image result for ap special status

ఈ విషయాన్ని మరింత సాగదీయడం మంచిది కాదని భావిస్తున్న బీజేపీ ప్రభుత్వం మరో రెండు మూడు రోజుల్లో ప్రత్యేక హోదాపై కీలక ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా వచ్చేనెల 3న ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో అంతకు ముందురోజు అంటే సెప్టెంబరు 2నే ఇందుకు సంబంధించి మోదీ ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. హోదాతోపాటు ఒనగూరే ప్రయోజనాలు, విభజన సమయంలో ఇచ్చిన హామీలపైన కూడా స్పష్టమైన ప్రకటన చేయనున్నట్టు సమాచారం. 


Image result for ap special status

కాగా సోమ, మంగళవారాల్లో ఏపీకి ప్రత్యేక హోదా విషయంపై బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తదితరులు ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. హోదా, ప్యాకేజీపై రెండు విడతలుగా సుదీర్ఘ చర్చలు జరిపారు. హోదాతోపాటు రాష్ట్ర అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపైనా మంత్రి వెంకయ్యనాయుడు తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పినట్టు సమాచారం. ఏది ఏమైనా ఏపీ రాష్ట్ర భవిష్యత్తును పరిగణలోకి తీసుకుని కేంద్రం ప్రత్యేక హోదా కల్పించి రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని రాష్ట్ర ప్రజానికం ముక్త కంఠం తో కేంద్రాన్ని కోరుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: