జనసేన ప్రస్తానం అంటూ మొన్నటికి మొన్న తిరుపతి లో గళం విప్పిన హీరో పవన్ కళ్యాణ్ తనకి " కులం " రంగు అంట గట్టద్దు అని సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. " మీకు ఎప్పుడైతే నా సపోర్ట్ ఉంటుందో, ప్రభుత్వానికి నేనేప్పుడైతే ఎదురు చెప్పకుండా సాగుతానో అప్పుడు మాత్రం మీకేం ఇబ్బంది ఉండదు. కానీ ప్రభుత్వాన్ని కాస్త విమర్శిస్తే చాలు నా కులం గురించి నా కులపు వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు. ఇది మూర్ఖత్వం అనిపించుకుంటుంది. నా ప్రతీ చర్యా కులానికి వ్యతిరేకం.


నా కూతురు క్రిస్టియన్ అబ్బా .. నా భార్య ఆమెని రష్యా లో బాప్టిజం జాయిన్ చేయిస్తా అంటే నేను మనస్పూర్తిగా జాయిన్ చేయించమన్నాను. మనకి ఉన్నది ఒక్కటే కులం మనుషుల కులం. కేవలం మనుషులుగా మాట్లాడుకుందాం. కులం పేరు చెప్తే నాకు కోపం కాలు నుంచి తల దాకా లేస్తుంది " అని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. కాపుల ఉద్యమం అప్పుడు కూడా కులం గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ కాపులకి రిజర్వేషన్ లు ఇస్తాం అని ఎలెక్షన్ అప్పుడు చెప్పింది చంద్రబాబు కాబట్టి ఆ విషయం లో త్వరగా ఒక నిర్ణయం తీసుకోపోతే కాపులు ఇలాగే రియాక్ట్ అవుతారు అని ఆయన వాదించారు.

అప్పట్లో తెలుగుదేశం ఆయన మీద కులం రంగు పులమాలని చూడగా దానికి ఆయన ఇప్పుడు ఇచ్చిన సమాధానం ఇది. కులం విషయం లో తనకి ఉన్న క్లారిటీ ని తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇంత క్లియర్ గా చెబుతూ ఉంటే చిరంజీవి మాత్రం కాపు ముద్ర పడకుండా చూసుకుంటున్నారు అని విశ్లేషకులు తీవ్రంగా మందలిస్తున్నారు. రాజకీయం మీద తగ్గించి పూర్తిగా సినిమాలవైపు మొగ్గు చూపుతున్న మెగాస్టార్ 150 సినిమాకి సిద్దం అవుతూనే రాజకీయాల ని కూడా ఒదలలేదు అన్నట్టుగా ఈ కాపు హెడ్ లతో తిరుగుతున్నారు. మెగాస్టార్ అంటే అందరివాడు అని కొందరివాడు కానేకాదు అని ఫాన్స్ ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటారు.


అలాంటి అందరివాడుగానే ఆయన్ని రాజకీయాలలోకి ఆహ్వానించారు ఎందఱో కానీ ఇప్పుడు కొందరివాడు లాగా కాపు రిజర్వేషన్ విషయం లో ముద్రగడ తో కలిసి చిరు చేసి పనులు ఎవ్వరికీ నచ్చడం లేదు. ముద్రగడ దీక్ష చేస్తున్న సమయం లో స్వయంగా వెళ్లి పరామర్శించడం లాంటివి కూడా అస్సలు జనం ఇష్టపడడం లేదు. నిన్న హైదరాబాద్ చేరుకున్న ముద్రగడ చిరంజీవిని ప్రత్యేకంగా కలిసారు. మద్దతు కోసం ముద్రగడ వెళ్లి చిరంజీవిని కలిస్తే అందులో వింతేమీలేదు. కానీ దాసరి ఇంట్లో బొత్స అంబటి ముద్రగడ తదితర నాయకులతో కలిసి చిరంజీవి భేటీ కావడం కాపువర్గాల్లో కొత్త చర్చ కి దారి తీస్తోంది.


కాపుల రిజర్వేషన్ కోసం చేస్తున్న ఉద్యమం లో చిరంజీవి ప్రత్యక్షంగా సీరియస్ పాత్ర వహించబోతున్నారు అని న్యూస్ బయటకి వచ్చింది. అందరివాడుగా ఉండాలి అని అందరూ కోరుకునే చిరంజీవి ఇలా కాపుల వాడు గా మారితే ఎవరికో కాదు ఫాన్స్ కే కోపం నషాళానికి అంటుతుంది. ఇలాంటి మూర్ఖపు నిర్ణయాలు తీసుకోకుండా ఇప్పటికే నాశనం అయిన పొలిటకల్ కెరీర్ ని పక్కకి పెట్టేసి పూర్తిగా సినేమాలవైపు ఆయన దృష్టి పెట్టాలి అని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: