అతను నోరు విప్పి మాట్లాడడు. నెలలకి నెలలు అవసరం అయితే సంవత్సరాల పాటు సైలెంట్ గానే ఉంటాడు. ఎందరు ఏ విమర్శలు చేసినా ఎవ్వరు ఏమన్నా .. విసిగించినా అరిచినా బాబూ నిద్రలే అన్నా కూడా స్పందించడు. అసలు అలా వెంటనే రెస్పాండ్ అయిపోతే తాను తాను ఎందుకు అవుతాడు ? ఈ పాటికి అతనెవరో అర్ధం అయ్యే ఉంటుంది. పవర్ స్టార్ , జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. చాన్నాళ్ళ మౌనం తరవాత మొన్న తిరుపతి లో భారీ సభ పెట్టి అందరికీ సమాధానాలు చెప్పి తాను సైలెంట్ గా ఎందుకు ఉన్నానో కూడా చెప్పిన పవన్ కళ్యాణ్ జన్మతః కాపు కులం వాడు.

సో కుల రాజకీయాలు జరిగే భారత దేశ , ముఖ్యంగా తెలుగు నేల మీద ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి ఆయన్ని కూడా అదే దృష్టి తో చూస్తారు. దానికి పవన్ కళ్యాణ్ ఒప్పుకోను గాక ఒప్పుకోరు. మొన్న తిరుపతి లో గళం విప్పిన హీరో పవన్ కళ్యాణ్ తనకి " కులం " రంగు అంట గట్టద్దు అని సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. " మీకు ఎప్పుడైతే నా సపోర్ట్ ఉంటుందో, ప్రభుత్వానికి నేనేప్పుడైతే ఎదురు చెప్పకుండా సాగుతానో అప్పుడు మాత్రం మీకేం ఇబ్బంది ఉండదు. కానీ ప్రభుత్వాన్ని కాస్త విమర్శిస్తే చాలు నా కులం గురించి నా కులపు వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు. ఇది మూర్ఖత్వం అనిపించుకుంటుంది.


నా ప్రతీ చర్యా కులానికి వ్యతిరేకం. నా కూతురు క్రిస్టియన్ అబ్బా .. నా భార్య ఆమెని రష్యా లో బాప్టిజం జాయిన్ చేయిస్తా అంటే నేను మనస్పూర్తిగా జాయిన్ చేయించమన్నాను. మనకి ఉన్నది ఒక్కటే కులం మనుషుల కులం. కేవలం మనుషులుగా మాట్లాడుకుందాం. కులం పేరు చెప్తే నాకు కోపం కాలు నుంచి తల దాకా లేస్తుంది " అని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. సరే కాపు వ్యక్తివి కాదు కానీ స్వయంగా కాపు ఉద్యమం గురించి ఆ మధ్యన మాట్లాడారు పవన్ కళ్యాణ్ ,  కాపుల ఉద్యమం అప్పుడు కులం గురించి మాట్లాడి కాపులకి రిజర్వేషన్ లు ఇస్తాం అని ఎలెక్షన్ అప్పుడు చెప్పింది చంద్రబాబు కాబట్టి ఆ విషయం లో త్వరగా ఒక నిర్ణయం తీసుకోపోతే కాపులు ఇలాగే రియాక్ట్ అవుతారు అని ఆయన వాదించారు. అదే ప్రాతిపదికన ఇప్పుడు కాపులకి సపోర్ట్ గా నిలవచ్చు.


ప్రత్యేక హోదా ఎంత సీరియస్సో కాపుల రిజర్వేషన్ కూడా అంతే సీరియస్ కదా .. మరి అలాంటప్పుడు కనీసం ప్రత్యేక హోదా తరవాత అయినా రాజకీయ వేత్తగా పవన్ కాపుల ఉద్యమానికి మద్దతు ఇవ్వాలి , కానీ ఆయన ఆ లెక్కలో ఎక్కడా కనపడ్డం లేదు. ముద్రగడ చేస్తున్న ఉద్యమంలో కాంగ్రెస్, వైకాపాలతో సహా రాష్ట్రంలో ఏ పార్టీకూడా పాల్గొనడం లేదు. అదేవిధంగా బహిరంగంగా మద్దతు ప్రకటించడం లేదు. ఆయన పోరాటంలో పాల్గొంటే ఇతర కులాలవారికి ముఖ్యంగా బీసిలకి ఆగ్రహం కలుగుతుందనే భయంతోనే ముద్రగడ ఉద్యమంలో పాల్గొనడం లేదు.

మరి పవన్ కళ్యాణ్ మాత్రం ఎందుకు పాల్గొనాలి? అంటున్నారు అతని అభిమానులు. పైగా కుల ఓటు బ్యాంకు పోతుంది అని పవన్ కి భయమే లేదు. పార్టీ పెట్టిన మొదటి సభ లోనే తాను ఎవ్వరికీ భయపడను అనీ , కులం తనకి లెక్క కాదు అని మ తన కులపెద్దలు తనకి సపోర్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా తాను లేక్కజేయను అని దేశం లో మొదటి సారి తన కులాన్ని లేక్కజేయను అని చెప్పిన వ్యక్తిగా నిలిచారు పవన్. కాపుల కోసం ముద్రగడ 13 సెప్టెంబర్ న దీక్ష ప్రకటించగానే పవన్ హుటాహుటిన జన సేన ప్రస్థానం అంటూ మొదలెట్టారు అంటే ఇది ఖచ్చితంగా కాపు ఉద్యమాన్ని అణగదొక్కడానికే అంటున్నారు రాజకీయ పండితులు.

మరింత సమాచారం తెలుసుకోండి: