ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ హయాం లో నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులను రీడిజైనింగ్ పేరుతో మళ్లీ టీఆర్ఎస్ పార్టీ మరమ్మత్తులు చేపట్టి వాటన్నింటినీ తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ పార్టీ నేతలపై మండిపడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో జలయజ్ఞం పేరిట లక్ష కోట్లతో కోటి ఎకరాలకు నీఎరు అందించడమే లక్ష్యంగా ప్రాజెక్టుల నిర్మాణం తలపెట్టిన విషయం అందరికీ విదితమే. 


Image result for congress trs

అయితే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన గులాబీ దళం ఆ ప్రాజెక్టుల పేర్లు మార్చి పబ్బం గడాపాలని చూస్తోందని హస్తం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ చేపట్టినవే కానీ, కాంగ్రెస్‌కు పేరు రాకుండా చేసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నానా తిప్పలు పడుతున్నారని, అందుకే ప్రాజెక్టుల రీ డిజైన్ తెరపైకి తెచ్చారని ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అసెంబ్లీ లాబీల్లో విలేకరులతో మాట్లాడారు.

Image result for congress trs

‘బీఆర్ అంబేడ్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును కాంగ్రెస్ చేపట్టింది. ఇక్కడ అంబేడ్కర్ పేరు ఉండొద్దు. ప్రాజెక్టును మొదలుపెట్టిన కాంగ్రెస్‌కు పేరు రావొద్దు. ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్‌లకు ఆ పేర్లు ఉండొద్దు. అసలు ప్రాజెక్టుల్లో కాంగ్రెస్ పేరు మచ్చుకు కూడా కనిపించొద్దు. కాంగ్రెస్‌కు ఏ మాత్రం పేరు రావొద్దు.


Image result for congress trs

హరీష్ రావు ధ్వజం...
కాంగ్రెస్ పార్టీకి ఎన్ని తలలు, ఎన్ని నాలుకలు ఉన్నాయో అర్థం కావడం లేదని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ధ్వజ మెత్తారు. మంగళవారం మండలి వద్ద మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్రతో కుదుర్చుకున్న ఒప్పందంపై కాంగ్రెస్ నాయకులు మండలానికి, జిల్లాకు, రాష్ట్రానికో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. జాతీయ పార్టీ అని చెప్పుకొనే కాంగ్రెస్ రాష్ట్రానికో విధానం అవలంబిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందన్నారు. ఈ ఒప్పందంపై మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీల్లో ఒక్కో విధంగా కాంగ్రెస్ నాయకులు ఆందోళనలు చేయడాన్ని తప్పుబట్టారు.


Image result for congress trs

కాంగ్రెస్ నాయకుల బండారాన్ని వీడియో సాక్ష్యాలతో సహా బయటపెడతామన్నారు. కాంగ్రెస్ నేతలు అధికారంలో ఉన్నపుడు ప్రాజెక్టులు కట్టకుండా నిద్రపోయి ఇప్పుడు తాము కడుతుంటే అడ్డుపడుతున్నారని విమర్శించారు. వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఏ అంశంపై అయినా చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రెండేళ్లుగా జరుగుతున్న ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఘోర పరాజయం ఎదురవుతున్నా ఆ పార్టీ నాయకుల బుద్ధి మారలేదని దుయ్యబట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: