గ‌త 2004 సంవ‌త్స‌రం నాటి నుంచి చంద్ర‌బాబుకు క‌ష్టాలు ఒకటి దాని వెన‌క ఒకటి వ‌స్తూనే ఉన్నాయి. అధికారం కోల్పోయిన నాటి నుంచి నేటి వ‌ర‌కు ఆయ‌న ప‌డుతున్న ఆరోప‌ణ‌లు, నింద‌లు ఇంతా అంతా కాదు. చంద్ర‌బాబు కు చంద్ర‌గ్ర‌హ‌ణం, గ్ర‌హ‌ణం ప‌ట్టిన చంద్రుడు, రాజ‌కీయ స‌న్యాసం పుచ్చుకోనున్న చంద్ర‌బాబు ఇలా అనేక ఆరోప‌ణ‌లు గ‌త 10 ఏళ్లుగా ప‌డుతూనే ఉన్నారు. అయితే అనూహ్యంగా ఉమ్మ‌డి రాష్ట్రం విభ‌జ‌న జ‌ర‌గ‌డం... అనంత‌రం కొత్త‌గా ఏర్ప‌డ్డ రాజ‌ధాని లేని ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో చంద్ర‌బాబు అధికారాన్ని మాత్రం చేపట్టారు. అయితే అధికారంలో వ‌చ్చాడే కానీ అవ‌మానాలు మాత్రం పడుతూనే ఉన్నారు. రాష్ట్రం ఏర్పాటు నుంచి ప్ర‌త్యేక హోదా, కేంద్రం నుంచి నిధులు, రాజ‌ధాని నిర్మాణం లో జాప్యం, రాష్ట్రానికి పెట్టుబ‌డులపై ఆశాజ‌న‌కం ఇలా చెప్పుకుంటూ చాలానే ఉన్నాయి. 

తెర‌పైకి ఓటుకు నోటు...

ఇవ‌న్నీ పోనూ... ములుగుతున్న న‌క్క పై తాడి పండు ప‌డ్డట్టు, ఓటుకు నోటు వ్య‌వహారంలో మ‌రోసారి ముందరికి వ‌చ్చింది. ముగిసిపోయింద‌ని భావించిన గ‌డం మ‌రోసారి వెంటాడుతుంది. ఏడాది త‌రువాత ఓటుకు నోటు కేసు మ‌రోసారి తెరపైకి వ‌చ్చింది. ఏపీ ప్ర‌దాన ప్ర‌తిప‌క్ష పార్టీయైన వైఎస్ఆర్సీపీ మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి ఈ కేసును మ‌రోసారి విచారించాల‌ని ప‌క్కా సాక్షాధారాల‌తో ఎసిబీ కోర్టును ఆశ్ర‌యించారు. దీంతో విచార‌ణ చేప‌ట్టిన ఏసీబీ వెంట‌నే ఈ కేసును మ‌రోసారి విచారించాల్సిందిగా తెలంగాణ ఎసిబీ కి ఆదేశాలు జారీ చేశాయి. ఇక ఇదే విష‌యంపై తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు  ఉమ్మ‌డి రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహాన్ సుదీర్ఘ స‌మ‌యం భేటి కావ‌డం... అదే స‌మ‌యంలో రాజ్ భ‌వ‌న్ కు ఏసీబీ డీజీ  ఏకే ఖాన్ రావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

గ‌వ‌ర్న‌ర్ తో కేసీఆర్ భేటీ....

ఏసీబీ డైర‌క్ట‌ర్ జ‌నర‌ల్ ఏకే ఖాన్... గ‌వ‌ర్న‌ర్, సీఎం ల‌కు ద‌ర్యాప్తు వివ‌రాలు వెల్ల‌డించారు. కేసు ద‌ర్యాప్తు ఎంత వ‌ర‌కు వ‌చ్చింద‌నే విష‌యం కూడా చెప్పారు. గ‌తంలో మ‌త్త‌య్య  పిటిష‌న్ పైన సుప్రీం కోర్టు కు వెళ్లిన విష‌యాన్ని వివ‌రించార‌ని తెలుస్తోంది. మ‌రికొన్ని రోజుల్లో ఈ కేసు సుప్రీంలో విచార‌ణకు రానుంద‌ని చెప్పారు. కాగా... ఓటుకు నోటు కేసు నేప‌థ్యంలో రాజ‌కీయంగా చెడ్డ‌పేరు రావొద్ద‌ని కేసీఆర్ అభిప్రాయంగా ఉన్నారు కూడా. అంటే దీనిని బ‌ట్టి గ‌మ‌నిస్తే... ఓటుకు నోటు వ్య‌వహారంలో తెలంగాణ స‌ర్కార్ అంత‌గా సిరీయ‌స్ గా లేద‌ని మ‌నం గ‌మ‌నించ వచ్చు. అప్ కోర్స్... సిరీయ‌స్ గా తీసుకుంటే చంద్ర‌బాబు ఇప్ప‌టికే విచారించేవారు. ఇటు రాజ‌కీయ ఒత్తిడిలు... అటు కేంద్ర నుంచి ఆదేశాలు... ఇలా మొత్తంమీద ఈ కేసు విష‌యంలో కేసీఆర్ లైట్ గా తీసుకుంటున్నారని చెప్పొచ్చు. 

చంద్ర‌బాబుకు ఆ భ‌యం ప‌ట్టుకుందా....?

ఇక్కడ మ‌రో విష‌యం గ‌మ‌నించాల్సిన అవ‌స‌రం ఉంది. ఈ కేసులో పూర్తి స్థాయిలో ప్ర‌మేయం లేకున్నా... చంద్ర‌బాబే దీనికి మూల‌కార‌ణమ‌న్న విష‌యం తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. కానీ చంద్ర‌బాబు మాత్రం ఈ విష‌యం పై నోరు మెద‌ప‌డం లేదు. టీ ఏసీబీ సేక‌రించిన సాక్షాధారాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి.  కానీ అయ‌న‌లో ఏదో తెలియని ఆవేద‌న, అవ‌మానం తో బాద‌పడుతున్నార‌న్న‌ది ఇట్టే గ‌మ‌నించ‌వ‌చ్చు. అందుకే ఆయ‌న కేసీఆర్ పై ప్ర‌త్యేక నిఘా వేశారు. నిన్న‌ గ‌వ‌ర్న‌ర్ తో కేసీఆర్ భేటీ నేప‌థ్యంలో అనంత‌పురం  జిల్లాలో ఉన్న ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఆరా తీశార‌ట‌! తెలంగాణ అడుగ‌ల పైన చంద్ర‌బాబు అందోళ‌న‌గా ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. గ‌వ‌ర్న‌ర్ తో కేసీఆర్ భేటీ పైన స‌మాచారం కూడా సేక‌రిస్తున్నారు! 

చంద్ర‌బాబును కేసీఆర్ ర‌క్షిస్తారా...

అంతేకాకుండా... ఏసీబీ ఏకే  ఖాన్ స‌మ‌ర్పించిన నివేదిక‌లోని అంశాల పైన టీడీపీ నేత‌ల్లో టెన్ష‌న్ నెల‌కొన్న‌ట్లుగా క‌నిపిస్తోంది. ఇంటెలిజెన్స్, ఇత‌రుల ద్వారా చంద్ర‌బాబు స‌మాచారం సేక‌రిస్తున్నారు. అంటే  మొత్తం మీద చంద్ర‌బాబు లో త‌ప్పుచేశాన‌నే ప్ర‌శ్చాతాపం మాత్రం క‌న‌బడుతుంద‌న‌డంలో సందేహం లేదు. ఇక ఈ వ్య‌వ‌హారం దోషిగా నిల‌బెట్టాల‌న్నా... నిర్ధోషిగా బ‌య‌ట‌వేయాల‌న్నా... గులాబీ సీఎం కేసీఆర్ చేతులోనే ఉంది.  అందుకే ఆయ‌న తీసుకునే నిర్ణ‌యాలు ఏలా ఉంటాయోన‌న్న భ‌యంతో చంద్ర‌బాబు కేసీఆర్ పై డేగ క‌న్నేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: