తెలుగు, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమను ఓ ఊపు ఊపిన అందాల తార నయనతార రాజకీయ ప్రవేశం చేయనుందా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. తన రాజకీయ అరంగేట్రానికి సంబంధించి నయన్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆమె అధికార అన్నా డీఎంకే పార్టీలో చేరనున్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సాధారణంగా తాను నటించే చిత్రాల ప్రమోషన్‌కు హాజరుకానని నయనతార దర్శక, నిర్మాతలకు ముందే చెప్పేస్తుందట. నటించడం వరకే తనపని అని, మిగతాది దర్శకనిర్మాతలు చూసుకోవాల్సిందేనని ఆమె తెగేసి చెబుతారట. ఈ విషయంలో ఆమెపై చాలా విమర్శలున్నాయి... సినిమా అవకాశాలు తగ్గిన సందర్భాలున్నాయి. 

Image result for nayanthara jayalalitha

చిత్ర రంగానికి చెందిన పలువురు, ముఖ్యమంత్రులుగా ఏలిన చరిత్ర ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకుంది. ఎన్టీఆర్, ఎంజిఆర్ ఆ కోవకు చెందిన వారే. ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా తారగా ఒక నాడు చిత్ర పరిశ్రమను ఏలిన వారే. స్తుతం పలువురు సినీ ప్రముఖులు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ప్రజాసేవలో రాణిస్తున్నారు. తారల రంగ ప్రవేశం రాజకీయాల్లో కొత్తేమీ కాకున్నా.. నయన విషయానికొచ్చే సరికి..అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. కేరళకు కుట్టి అయిన నయన.. తమిళనాడులో రాజకీయారంగ్రేటం చేయాలనుకోవడమే ఇందుకు కారణమట.  నిన్న నటి నమిత అన్నాడీఎంకే పార్టీ తీర్థం పుచ్చుకోగా.. నయన కూడా అదే బాటలో నడుస్తారనే వార్త తమిళనాట హాట్ టాపిక్ గా మారింది. 


ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ లో నాయకిగా వెలుగొందుతున్న నయనతారకు రాజకీయల్లోకి వెళ్లాలనే కోరిక పుట్టిందనే ప్రచారం జోరందుకుంది. నయన కూడా తన రాజకీయ ప్రవేశానికి కావాల్సిన ఏర్పాట్లను చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ నయనను రాజకీయాల్లోకి స్వాగతిస్తున్నట్లు ప్రచారానికి తెర లేచింది. ఇందుకు ఇటీవల జరిగిన సంఘటనే కారణమని చెప్పాలి.  సినిమాలో హీరోయిన్ గా నటించినా.. ఆ సినిమా ప్రమోషన్ లకు తాను హాజరు కానని తెగేసి చెప్పే నయన తార.. ఇటీ వల అధికార పార్టీ నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరు కావడమే తాజా ప్రచారానికి ఆజ్యం పోసింది. 
 
కొద్ది రోజుల క్రితం అన్నాడిఎంకే  పార్టీ స్పోర్ట్స్ ఫౌండేషన్ ద్వారా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి నయనతార హాజరయ్యారు.  హీరోయిన్ లా తళుకుబెళుకు మోడ్రన్ డ్రస్ లోకాకుండా.. సాదాసీదాగా సాంప్రదాయ దుస్తులలో వచ్చింది. సినిమో ప్రమోషన్ లకే హాజరు కాని నయన.. పార్టీ కార్యక్రమాలకు హాజరు కావడం.. అందులోనూ  సంప్రదాయ దుస్తులలో కనిపించడంతో.. రాజకీయ ప్రవేశ ప్రచారానికి మరింత బలం చేకూరింది. నయన ఏ పార్టీలో చేరతారనే దానిపై దాదాపు క్లారిటీ రావడంతో.. ఆమె పార్టీలో ఎప్పుడు చేరతారనే దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: