Image result for vote for note case in telangana

వనజాక్షి  కేసులో  ఇసుకమాఫియా లీడరుగా భావించబడ్డ చింతమనేని ప్రభకర్ ఎలా తప్పించు కున్నాడు?  నేరం జరిగిన ప్రాంతం వనజాక్షి పరిపాలనా పరిదికి బయట ఉందని ఆమె జూరిష్-డిక్షన్   కిన్దకు రాదని,  అమె  అధికార పరిది లో లేని ప్రాంతము లో తెలియక  - ఆమె నెరం జరిగి నప్పుడు గుర్తించి యాక్షన్ తీసుకున్నారు.  నేరం జరిగింది నిజమే కదా?  సాంకేతిక కారణం చూపి ఆమెను మందలించవచ్చు. కాని అందుకు ఆమెను దండించారు తెలుగుదేశం ప్రభుత్వం. కాని ఆ నేరానికి చెందిన వివరాలను ఆ జూరిస్ డిక్షణ్ ఆమె అధికార పరిధి బయట ఉండటం సాంకేతిక కారణం. శాఖాపరం గా ఆ కారణం చూపి ఆమెను మందలించవచ్చు.  కాని అందుకు ఆమెను దండించారు తెలుగుదేశం ప్రభుత్వం.  కాని ఆ నేరానికి చెందిన వివరాలను సంబందిత అధికార పరిదికి బదిలీ చేసినట్లు ఎక్కడా ప్రభుత్వం ప్రకటించలేదు.   ఆమె పై చింతమనేని చేసిన ధూషణలు ప్రభుత్వం పట్టించుకోలేదు.  కారణం ఆయన అధికారపార్టీ ఎం.ఎల్.ఏ.

Image result for vote for note case in telangana

“నీకు, నీవారికొక నీతి,  కానివారికి,  ప్రజలకొకనీతినా?”  అంటూ చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు ప్రజలు. ఇక్కడ ఇసుక మాఫియా నాయకుడనుకుంటున్న నేరస్తుణ్ణి రాజ్యం కాపాడింది. నిజాయతీ పరురాలైన వనజాక్షి శిక్షించబడింది.  వనిత అనీ చూడని బాబుపాలన కాల్చనా?  సాంకెతిక కారణాల ఎరచూపుతూ కోర్టుల నుండి స్టే-లు తెచ్చుకునే నాయకుని పాలనలో - ప్రజలకు,  ప్రజా ధనానికి రక్షణ కరువే కదా అని జనులు కోడై కూస్తున్నారు.  ఓటుకునోటు కేసులో బాబు దొంగ అని ఆరోజుల్లో టివి చూసిన పసిబాలుడు కూడా చెప్పగలడు.  రేవంత్ రెడ్డి పూర్తిగా బుక్కై పోయాడు. ఆయన  రాజకీయ జీవితం మొత్తం "చిద్రమైమట్టిలో" సమాది ఐపోయింది. ఆయన కనిపిస్తే ఒక జోకరుని చూసినట్లు చూస్తున్నారు జనం.  ఏమి మాట్లాడినా ప్రజలు ఆయన మాటలపై శ్రద్ధ చూపటము లేదు.

Image result for vote for note case in telangana

చంద్రబాబు "బ్రీఫ్డ్"  టేపులోని మాటల్లో కొంచమైనా ఆయన గొంతు కాదని ఒక మానవుడికి కూడా అనిపించదు. అయినా “వందల నేరస్తులు తప్పించు కున్నా పరవా లేదు కాని ఒక నిరపరాధి శిక్షింప బడకూడదన్న”  న్యాయసూత్రాన్ని అనుసరించి “ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటొరీ”  (ఎఫ్.ఎస్.ఎల్)  చేత కూడా దృవీకరించబడి నేరస్తుడెవరో ఋజువైన కేసుకు కూడా - తెలంగాణా అవినీతి నిరోదక శాఖ కు విచారణార్హత లేదని వాదించటం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి సబబేనా? టెలివిజన్లో లోకమంతా కళ్ళు తెరుచు కొని చూసిన నేరగాణ్ణి సాంకేతిక కారణాలను చూపి వదిలేయా  లనటం న్యాయమా?  దీన్ని కూడా ఎవరు విచారించాలో వారితో విచారింపచేస్తే కుదరదా? చివరకు బాబును గెలిపించిన ప్రజలు విచారించేలా వ్యవస్థలు తయారైతే ఎలా?

Image result for vote for note case in telangana

ఇలాంటి అనుమానాస్పద  వ్యక్తి లక్షలకోట్ల విలువైన అమరావతి నిర్మిస్తానని అదీ స్వదేశీయులకు నిర్మాణ సామర్ధ్యం లేదనీ, వాళ్ళు మురికివాడలు మాత్రమే నిర్మించ గలరని మాట్లాడిన ఈయన మాత్రం ఏమంత నిజాయతీ పరుడని నమ్మాలి? ఇది ప్రజాభావన. అందరూ పదేపదే అడిగేమాట. ప్రతి రాజకీయ నాయకుణ్ణి పరిశీలించండి రాజకీయాల్లోకి వచ్చిన నెల రోజుల్లోనే కోట్లు ఘడించే దుస్థితి దేశమంతా కనిపిస్తుంది. కొందరు కార్పోరేటర్లే పదుల కోట్లలో సంపాదించేస్తున్నారు. ఇలాంటి దుస్థితిలో దేశముంటే సాధారణ ప్రజలు మురికివాడల్లో కాక ఎక్కడ ఉంటారు. భూములు,  స్త్రీలు, పిల్లలు, అమాయకులు, నిరంతరం దోచబడే రాజకీయ నాయకులున్న సమాజంగా మారుస్తున్నారు.

Image result for vote for note case in telangana

సాంకేతిక కారణాలు తప్ప నైతికంగా పతనమైన చంద్రబాబు లాంటి నాయకుడు ఒకడైనా శిక్షించబడాలి అంటున్నారు ప్రజానీకం. అలాంటి వాళ్ళకు శిక్షలు పడకుంటే న్యాయం ఎప్పుడు కోర్టుల స్టే-ల చక్రబందం లోనే నీరు గారి పోతుంది.

Image result for chandrababu note for vote

తను నేరం చేయలేదని ఋజువైతే తనను ద్వేషించే వారు కూడా ప్రేమిస్తారుకదా. ఆ కనీస అవగాహన చంద్రబాబుకు లేకనా? ఆయనకు కాక మరెవరి కుంటుంది అంత పరిజ్ఞానం? తెలిసీ అలా స్టేల కోసం కోర్ట్ పక్షి అవుతున్నాడంటే - ఆయనే నేరస్తుడని ఘంఠా పధంగా నాడు కేసిఆర్ చెప్పినమాట - తెలంగాణా ఏ.సి.బి. నిగ్గు తేల్చిన  విషయం  యదార్దమనే భావించాలి. ఈకేసు లో చంద్రబాబు నిజాయతీ పరుడైతే పదిసంవత్సరాలు హైదరాబాద్ ను రాజధాని  గా పంచుకోవలసిన అవకాశం వదలి పారిపోయే అవసరమేమొచ్చింది. నీలో నిజాయతీ ఋజువు చేసుకొవటానికైనా  న్యాయ విచారణకు అంగీకరించు. లేకుంటే సాంకేతిక కారణాల నే సాకుగా చూపుతూ నేడు బ్రతికిపోయినా ప్రజలగుండెల్లో మరణించిన వాడవనే ఋజువవుతుంది ప్రజలు పదేపదే ఘోషిస్తున్నారు. ప్రభుత్వ అనుకూల కుల మీడియా బలంగా ఉండవచ్చు. ప్రజల్లో ఇప్పటికే అనేక ప్రభుత్వ వ్యతిరేఖ భావనలు వ్రేళ్ళూను కుంటున్నాయి. అప్పుడు మీడియాకన్నా ప్రజలు బలమైన వారవుతారు. సందేహం లేదు.

Image result for k ramakrishna mla

కె రామకృష్ణ అనబడే ఒక టిడిపి ఎం.ఎల్.ఏ రైల్వె నిర్మాణంలో కాంట్రాక్టర్ నుండి ఐదు కోట్ల రూపాయలు వసూలు చేయటాని ప్రయత్నించిన సందర్బానికి బాబు సమాదానం చెప్పాలి. టిడిపి ఎం.ఎల్.ఏ లు ఈ లెక్కన పోలవరం, అమరావతి నిర్మాణాల్లో చేయనున్న దోపిడీని నివారించే ప్రణాళిక విపక్షాలు, ప్రజలు రచించాలి. నివారించాలి. 

Image result for vote for note case in telangana

మరింత సమాచారం తెలుసుకోండి: