రాష్ట్రానికి రోజుకు 2.5 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల(ఎంఎంఎస్డీండీ) గ్యాస్ను అందించేందుకు గ్యాస్ ఆథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్) అంగీకరించింది. ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డితో గెయిల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బి.సి.త్రిపాఠి బుధవారం భేటి అయ్యారు. క్యాంప్ కార్యాలయంలో అర్థగంటపాటు వీరిద్దరూ రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిపై చర్చించారు. అవసరాలకు సరిపడ గ్యాస్ సరఫరా జరగని కారణంగా రాష్ట్రంలో విద్యుత్ కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. పలు గ్యాస్ ఆథారిత విద్యుత్ ప్రాజెక్టులు గ్యాస్ సరఫరా లేక నిరుపయోగంగా పడి ఉన్నాయి. ఈ విషయాన్ని గెయిల్ ఛైర్మన్ దృష్టికి ముఖ్యమంత్రి తెచ్చారు. 2.5 ఎంఎంఎస్ సిఎండీల గ్యాస్ సరఫరా లేక నిరుపయోగంగా పడి ఉన్నాయి. ఈ విషయాన్ని గెయిల్ అంగీకరించిన నేపథ్యంలో తక్షణమే తగిన కార్యాచరణను రూపొందించాల్సిందిగా ఇందనశాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో మౌళిక సదుపాయాల కల్పన, ఓడరేవుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ గ్యాస్ డిస్ట్రీబ్యూషన్ కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.నారాయణన్ ప్రభృతులు పాల్గొన్నారు. ప్రాధాన్యత అంశంగా వద్యుత్ : మంత్రి గంటా విద్యుత్ ఉత్పత్తిని అత్యంత ప్రాధాన్యత అంశంగా ప్రభుత్వం భావిస్తున్నదని, ఉత్పత్తిని పెంచేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నదని మంత్రి గంటా తెలిపారు. 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సరిపడే విధంగా గ్యాస్ ను అందించాల్సిందిగా గెయిల్ ఛైర్మన్ను కోరామన్నారు. అయితే 500 మెగావాట్ల ఉత్పత్తికి సరిపడే విధంగా గ్యాస్ అందించేందుకు ఆయన అంగీకరించారన్నారు. మరింతగా గ్యాస్ను అందించే విధంగా కేంధ్రంపై రాష్ట్రప్రభుత్వం ఒత్తిడి తెస్తున్నదన్నారు. విద్యుత్ కొరతకు ప్రధానకారణం సకాలంలో వర్షాలు కురవకపోవడం, గ్యాస్ కొరతేనని ఆయన తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: